“వినిపింతువ రాకడ పోకడ
నీ మాటల వేదములందూ,
చూపింతువ ఈ జగమెల్లను
నీ పావన పాదములందూ!”
‘రాకడ పోకడ’ అనడంలో రెండు భావాలున్నాయి. ఒకటి ” శ్వాస మీద ధ్యాస” ఉంచటం. రెండవది అమ్మవాక్యం “మీరంతా నా సంకల్పంతో నాలోనే జన్మ ఎత్తి, నాలోనే లయం అవుతారు” అని. అమ్మ పావన పాద పద్మాలలో ఈ జగత్తుని దర్శించాను. (రాజుబావ వ్రాసిన “లోచూపు” గ్రంధం నుండి… పేజీ 118).
అమ్మను దర్శించినవాళ్ళు అనేకమంది. అమ్మ స్థితిని దర్శించిన వాళ్ళు కొద్ది మంది. అందులో రాజుబావ గొప్పదనం ఏమిటంటే అమ్మ స్థితిని దర్శించటమే కాక, అందరికీ తన అనుభూతిని తెలియజేయడం!. సాధన గురించి ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఎందరో ఎన్నో రకాల చెప్పారు. మనకి అత్యంత సమీపంలో ఉన్న మన శ్వాసని గమనించమంది అమ్మ. అమ్మే అన్నింటికీ ఆధారమని ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోమన్నది. ఇంతకంటే ఏమి కావాలి… ఓ మనసా! అమ్మ వైపుకి అడుగులు వెయ్యి. జగత్తు మాతగా గోచరించడం మొదలుపెడుతుంది. జయహో మాతా.