అమ్మకు ఇష్టమైన అర్చన ధాన్యాభిషేకం.
అమ్మకు ఇష్టమైన కార్యం బిడ్డలకు అన్నం పెట్టుకోవటం.
అమ్మకు ఇష్టమైన వాళ్ళు అన్నదాతలు.
ప్రేమసాగర అయిన అమ్మకు ఆజన్మవిరోధి బిడ్డల ఆకలి.
అమ్మ ఆయుధాలు గిన్నెలు, గరిటెలు.
అమ్మ గుండె అన్నపూర్ణాలయం.
అమ్మ గుండెచప్పుళ్ళు అన్నపూర్ణాలయంలోని గుండిగల మోతలు.
ఒక ఉత్సవంలో వంటవాడు అడిగాడు – అమ్మా ఏం స్వీటు చేయమంటావు ? అని. అప్పుడు అమ్మ చెప్పింది – చేసిన పదార్థం అందరికీ అందటం కంటే స్వీట్ ఏముంటుంది? అది చేయండి!!
అమ్మ సన్నిధిలో చండీయాగం చేసుకున్న యజమాని ఆ హోమగుండంలో ఏమైనా వెయ్యమని అమ్మను
అడిగితే అమ్మ అన్నది “నేనేమీ వెయ్యవలసి వచ్చినా – గాడిపొయ్యిలోనే వేస్తాను”.
అమ్మ ప్రారంభించిన “అన్నపూర్ణాలయంలో – ఎవరికి భోజనం పెట్టాలి ? అన్న మీమాంస వచ్చినపుడు అమ్మ ప్రవచించింది – “డ్రస్సూ, అడ్రస్సు చూసి కాదు; ఆకలే అర్హతగా, ఆదరణే అనుపాకంగా పెట్టండి”.
అమ్మ అవతారనామం అన్నావతారం.
నారాశి బియ్యపురాశి – అమ్మ.