మనోచింతలను భస్మము చేయు
మహిషాసురమర్దనికి మ్రొక్కెదన్;
దుస్తార సంసార కడలిని
దాటించు దుర్గాదేవికి మ్రొక్కెదన్’;
శాస్త్ర వాఙ్మయ ధీశక్తికై
చదువులతల్లి సరస్వతికి మ్రొక్కెదన్;
సిరిసంపదలు మెండుగా నొసంగు
మా తల్లి లక్ష్మికిని మ్రొక్కెదన్;
విధాతరాతను దిద్ది బంగరు భవితనందించు
రాజరాజేశ్వరీదేవికి మ్రొక్కెదన్;
చక్కని చిక్కని వాత్సల్య సుధలు వర్షించు
ఆది మూలమౌ అనసూయమ్మకు మ్రొక్కెదన్.