1. Home
  2. Articles
  3. Mother of All
  4. అమ్మనాకిచ్చిన దివ్యానుభూతి

అమ్మనాకిచ్చిన దివ్యానుభూతి

Upadrasta Satyanarayana Murthy
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 7
Month : April
Issue Number : 2
Year : 2008

ఆ రోజు నేను చారి అన్నయ్య గారింటిలో ఉండటం తటస్థించింది. నేచర్ క్యూర్ హాస్పటల్ నుంచి ఫోన్ చేస్తే అన్నయ్యగారు నన్ను కూడా రమ్మని తీసుకు వెళ్ళరు. అక్కడ డా. వెంకట్రావ్ గారు (నాచురోపతి), డా. పి. తిరుమల రావు, PATAS ఉన్నారు. అంతకు మూడు రోజుల ముందు నెదర్లాండ్ కు చెందిన జె.ఎఫ్. నీరెండ్ అనే అమ్మ విదేశీ భక్తుడు ఆ ఆస్పత్రిలో అస్వస్థతతో అడ్మిట్ అయ్యడు. “నీలాండ్ అనే పేషెంట్కి డిహైడ్రేషన్ అయింది. తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించమని, అతడు ఫారినర్ కనక మీకు వప్ప చెబుతున్నాం” అన్నారు. వెంటనే అన్నయ్య అక్కడినించే సెయింట్ థెరెసాస్ హాస్పిటల్కి ఫోన్ చేసి పేషెంట్ని తీసుకు వస్తున్నామని చెప్పి కండిషన్ చెప్పారు. నేనూ, అన్నయ్యా నీలాంట్ని చేతుల మీద అపస్మారకస్థితిలో కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళాము. మేం వెళ్ళే సరికే వాళ్ళు అన్నీ చేసి స్ట్రెచర్ మీద తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ రూమ్లో చేర్చారు. అన్నయ్య “మీరుండండి” అంటే నేనతనితో ఉండిపోయాను బెడ్ దగ్గర. ఇదంతా సాయంత్రం 6, 7 గంటల వేళ జరిగింది. అమ్మ నామం చేసుకుంటూ నేనతని తోడున్నాను. డ్రిప్ మందులు కలిపి యిద్దరు నర్సులు అతనిని అటెండ్ అవుతున్నారు. ఛీఫ్ మేట్రన్గా సిస్టర్ ఆగస్టస్ అన్నామె ఉన్నది. రాత్రి 2 గంటలైంది. అతనికి స్పృహ వచ్చి “Where am I?” అన్నాడు. దానికి సిస్టర్ సమాధానం “You are among your brothers and sisters. Don’t worry, you are alright అంది.

అల్లాగ మూడు రోజులైంది. రోజూ అతని పరిస్థితి నా ద్వారా తెల్సుకుని అన్నయ్య జిల్లెళ్ళమూడి అమ్మవద్ద నించి ఫోన్ వస్తే చెబుతున్నారు. మూడో రోజు రాత్రి అమ్మ: “నాకు వాడితో మాట్లాడ్డానికి వాడి ఫోన్ కలప”మంది. అట్లాగే చేసేరు ‘జిల్లెళ్ళమూడి నుండి ఫోన్’ అని నాకు చెబితే నేను పరుగున వెళ్ళేను. రోగి ఫస్ట్ ఫ్లోర్లోను ఫోన్ గ్రౌండ్ ఫ్లోర్ లోనూ ఉంది. అమ్మ మాట్లాడుతూ “వాడి దగ్గరెవరున్నారంది. “అమ్మా! నేను, సత్యనారాయణమూర్తిని అన్నాను”, “ఐతే సరేగాని ఫోన్ వాడికియ్యి మాట్లాడతాన”ది. “అమ్మా! అతను మేడమీద . రూమ్లోను ఈ ఫోన్ క్రింద అంతస్థులోను ఉంది” అన్నాను. “ఐతే సరే నీవే వాడి వద్ద ఉండి చూడమంది. “అల్లాగే నమ్మా! నేనే ఉంటానన్నాను.

నాలుగైదు రోజులైనాయి. అతనికి నడ్డి మీద పుండ్లల (బెడ్ సోర్స్) రక్తం కారడం మొదలైంది. స్పెషలిస్ట్ డాక్టర్ని పిలిపించేరు. అతను వచ్చి పరీక్ష చేసి బెడ్సోర్స్ కావు, ఇది ఒక రకమైన జబ్బు దీనికి మండు లేదన్నాడు. ఆ సంగతే అమ్మకి చెప్పారు. అప్పుడమ్మ అన్నదిట వాడు శ్రీశైలం అడవులన్నీ చూసి యిది తిరిగాడు వాడికున్న వ్యాధులు చాలా ఉన్నాయందిట. అక్కడేవున్న రామకృష్ణన్నయ్య – రోజూ అమ్మ అతని సంగతి అడిగి తెలుసుకోవడం, యిక్కడితని పరిస్థితిలో ద్వారా మార్పులు రావడం మొదలైంది.

ఒకవారం గడిచింది. అతను పూర్తి శాఖాహారి వయస్సు 51 సం॥ (1974 సం॥రంలో) బ్రహ్మచారి. మందులిష్టంలేక నేచర్ క్యూర్ హాస్పిటల్ లో చేరాడు. ఉన్నట్టుండి ఒక రోజు సిస్టర్ ఆగస్టస్తో “I want mutton soup” అన్నాడు. ఆమె వెంటనే “I will bring soup and curry” అని చెప్పి ఆమె యింటి వద్ద స్వయంగా చేసి తీసుకువచ్చి అతనికి తినిపించింది. నాకనిపించింది. “అమ్మ వీడి బుద్ధి మార్చేసింది. ఎంత వింత యిది!” అని మరొక వారం అయ్యేసరికి అతను ” want to move out” అని అంటే, అతణ్ణి వీల్ ఛెయిర్లో కూర్చోపెట్టి త్రిప్పేవాడిని బైట open place లో. బాగా కోలుకున్నాడు.

ఇంతలో అమ్మ Amma Humanitarian Mission ప్రారంభోత్సవానికై హైద్రాబాద్ వచ్చింది. దానిని ప్రారంభం చేసి, అమ్మ హాస్పిటల్ విజిట్ చేసింది. అమ్మతో అన్నయ్యలందరూ బుట్టలతో పళ్ళూ, స్వీట్స్ దండిగా తీసుకు వచ్చారు. పేషెంట్స్కి పంచడానికి. అమ్మ ముందస్తుగా నేరుగా నీలాండ్ రూమ్కి వచ్చింది. అప్పుడు అతని బెడ్ దగ్గిర నేనున్నాను. అమ్మ నవ్వుముఖంతో అతణ్ణి, నన్నూ ఆశీర్వదించడానికన్నట్లు ప్రత్యక్షమైంది. అప్పుడతడన్నదేమంటే: “I want to hug Mother” అని. అంతే అమ్మని వాటేసుకున్నాడతను. అమ్మ అతణ్ణి తన పవిత్ర హృదయానికి హత్తుకొని అల్లాగ ఐదునిమిషాల పాటుండిపోయింది. అతని కళ్ళవెంట ఆనందాశ్రువులు. అమ్మ కళ్ళవెంట అనురాగ ధారలు. ఆ ఆనందాన్ని ఇతని అనుభూతిని మాటల్లో వర్ణించ తరంగాడు. అతడు ధన్యజీవి. అతనితో ఉన్న ఆ అనుభూతి ననుభవించే మహద్భాగ్యం, మహదవకాశం నాకు చక్కింది. అమ్మ అవ్యాజకరుణా రసాంబుధిలో మునకలు వేసిన ధన్యాత్ముడు శ్రీశ్రీలాండ్, జీవాత్మ పరమాత్మల దివ్యానుబంధం చేసే వేడుక నాకీ విధంగా అమ్మ కటాక్షించిన దివ్యానుభూతిగా నా హృదయంలో పదిల పరుచుకున్నాను.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!