అమ్మ చరణములపై మనసునుంచి ప్రార్ధించిన
కరుణా రసము మనపై వర్షించును
అమ్మా, అమ్మ, అమ్మా అమ్మ
అమ్మా యని అనరాదా
మాతృశ్రీ చరణమ్ముల మనసునుంచలేవా
కరుణామయి ఆ జననియే ‘అమ్మే’ అని వినలేదా ॥
మాతృ నామము మనసారగ మననమ్మే చేయ లేవా ||అ॥
పసితనమున ఆ జననియె సత్యదేవు రూపుజూపి
భక్తుని కరుణించలేదా
అర్కపురి లోనను నిలచి అన్నపూర్ణయై వెలసిన ॥అ॥
సత్యమై, నిత్యమై, నిఖిలలోక జననియై
కరుణా స్వరూపిణియై కరుణించిన ఆ తల్లిని ॥అ॥
ఇలలో వెలసిన స్వర్గము అర్కపురి అని వినలేదా
కరుణామయి ఆ జననిని కనులారగ గాంచలేవా! ॥ అ॥
గురుదేవుడు రామకృష్ణుని కరుణించిన ఆ జననీ
నరహరి హృదయమ్ములోన నవ్వుచు నిలచిన తల్లిని|| అ॥