ది.28-8-22తేదీ, 16-10-22 తేదీలలో ఉభయట్రస్టుల అధ్యక్షులు శ్రీ కె. నరసింహమూర్తి గారు అంతర్జాల సభలకు అధ్యక్షత వహించారు. సభ్యులందరూ సభక్తికంగా అమ్మకు అంజలి ఘటించారు. అధ్యక్షులు తొలిపలుకుల్లో –
1) అమ్మ సందేశవ్యాప్తి సభ నిర్వహించుటకు 26-1-2023న హైదరాబాదులో రవీంద్రభారతిని ఖాయం చేశామని, అందుకుగాను వక్తలను ఎంపిక చేయాలని, నాటి సభకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారిని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ పి. నరసింహంగారలను ఆహ్వానించాలని తెలిపారు. తాము డాక్టర్ బి.వి.యస్. లక్ష్మిగారితో సంప్రదించామని, ఆమె 29-10-22న ప్రభుత్వ ప్రతినిధి బృందంతో జిల్లెళ్ళమూడి సంస్థను సందర్శించనున్నారని, కావున SVJP Managing Trustee శ్రీ పి. గిరిధర్ కుమార్ గారు – ఎ
– 7వ మైలు నుంచి జిల్లెళ్ళమూడి వరకు రోడ్డును (రెట్టింపు) వెడల్పు చేయుట.
SVJP సంస్థ గృహ సముదాయానికి ప్రత్యేక Transformer ను ఏర్పాటు చేయుట. 7వ మైలు నుంచి SVJP సంస్థ వరకు విద్యుద్దీపాలను ఏర్పాటు చేయుట.
జిల్లెళ్ళమూడికి మురుగునీటి పారుదల వ్యవస్థను కల్పించుట
– జిల్లెళ్ళమూడి చెరువు నందలి బురద, కాలుష్యాన్ని తొలగించి శుద్ధిచేయుట
– 25-3-23 నుండి 3-4-23 వరకు బాపట్ల – జిల్లెళ్ళమూడి మధ్య గంట గంటకు RTC Bus సౌకర్యం కలిగించుట మున్నగు ప్రాధాన్యతాంశములపై అర్జీలను ముందుగా సిద్ధం చేసుకుని డాక్టర్ బి.వి.యస్.లక్ష్మిగారికి అందజేయాలని కోరారు.
2) బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు వంటి ప్రసిద్ధ ప్రవచనకర్తలను ఆహ్వానిస్తూ – విజయవాడలో శ్రీజయంతి చక్రవర్తి, తిరుపతిలో శ్రీ ఎమ్. రామకృష్ణాంజ నేయులు, విశాఖపట్టణంలో శ్రీ జి. చిన్నంనాయుడు మొదలగు పూర్వ విద్యార్థుల సహకారంతో అమ్మ సందేశవ్యాప్తి సభలను నిర్వహించుట ద్వారా అందుకు ఒక నాందీ ప్రస్తావన చేయాలన్నారు.
3) శతజయంతి ఉత్సవాలకు – కుర్తాళం పీఠాధిపతులు, కంచి కామకోటి పీఠాధిపతులు, పుష్పగిరి పీఠాధిపతులు, బెంగుళూరు శ్రీ రాజరాజేశ్వరస్వామి, కైలాసానంద ఆశ్రమం వారు, గుంటూరు శ్రీ విశ్వయోగి విశ్వంజీ, హైదరాబాదు శ్రీరాం సర్ మున్నగు పీఠాధిపతులను ఆహ్వానించాలని తీర్మానించారు.
4) శతజయంతి ఉత్సవాలలో అనుదిన కార్యక్రమం
1) ఉదయం గం.10ల నుండి గం.12ల వరకు – స్వామీజీ అనుగ్రహభాషణం
2) 12 గంటల నుండి అన్నప్రసాదవితరణ
3) సాయంత్రం గం.4.00ల నుండి గం.8.30 వరకు – ప్రవచనములు / సాంస్కృతిక కార్యక్రమములు
4) రాత్రి గం.8.30 కు అన్నప్రసాద వితరణ అని సూచించారు.
5) శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యంగారు మాట్లాడుతూ తాము కొందరు పెద్దలతో వెళ్ళి కుర్తాళం పీఠాధిపతులను సందర్శించి అమ్మ శతజయంతి ఉత్సవాలకు వారిని ఆహ్వానించి, అనుగ్రహభాషణం చేయాలని విన్నవించామని తెలిపారు. స్వామివారు తాము ఇటీవల ప్రయాణాలు చేయటం లేదని, అయినా – తప్పనిసరిగా అమ్మ ఉత్సవాలకు విజయం చేయాలని అంగీకరించారని వివరించారు.
6) శ్రీ వి.యస్.ఆర్.మూర్తిగారు మాట్లాడుతూ SVBC మాధ్యమంలో ఒక కార్యక్రమాన్ని రూపొందించుటకు
ప్రయత్నిస్తున్నానని
– ‘ఆంధ్రప్రభ’, ‘నమస్తే తెలంగాణ’ పత్రికల యాజమాన్యంతో మాట్లాడుట ద్వారా అమ్మను గురించి
వ్యాసాలను ప్రచురించుటకు అంగీకరించారని 26-10-22న స్వయంగా పుష్పగిరి పీఠాధిపతుల్ని సందర్శించి శతజయంతి ఉత్సవాలకు
ఆహ్వానిస్తానని
– ఉత్సవాల్లో ఒక రోజున ‘సర్వమత సమ్మేళన’ కార్యక్రమము నిర్వహించుకోవాలని – రామకృష్ణ మిషన్, రమణాశ్రమం నుండి మరియు IAS, IPS శ్రేణికి చెందిన విశిష్ట వ్యక్తులను
వక్తలుగా ఆహ్వానించాలని
Sub-committee ల కార్యదర్శులే కాక సభ్యులు కూడా సభలో పాల్గొనాలని సూచించారు.
కార్యదర్శుల నివేదికలు
1) ప్రసార మాధ్యమ కమిటీ : భక్తి టి.వి. యాజమాన్యంతో మాట్లాడి అమ్మపై ఒక Documentary రూపొందించి డిసెంబరునెలలో ప్రసారం చేసేందుకు కృషి చేస్తున్నానని శ్రీ ఈమని కృష్ణ తెలిపారు. ‘పత్రికారచన’ అనే ఒక ప్రత్యేక What App Groupని ఏర్పాటు చేసుకుని అందు 10 మంది రచయితలను సభ్యులుగా చేర్చామని, పత్రికలలో ప్రచురణార్థం 10 రోజులలో 5 వ్యాసాలు సిద్ధం అవుతాయని వాటిని శ్రీ ఈమని కృష్ణగారికి అందజేస్తామని ఆచార్య మల్లాప్రగడ వివరించారు.
సందేశ ప్రచార కమిటి : సందేశ ప్రచార సభలలో ఉపయోగార్థం ఒక వీడియోను రూపొందించుకోవాలని
శ్రీ మల్లాప్రగడ సూచించారు. SVBC, భక్తి టి.వి. మరియు పత్రికల ప్రముఖుల్ని కలిసి Electronic & Print media లో సందేశ ప్రచారానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని తెలిపారు.
3) సావనీర్ కమిటీ :
– ‘అమ్మ’ను గురించి వ్యాసాలను ఆహ్వానిస్తూ ఒక విజ్ఞప్తిని రూపొందించి వార్తాపత్రికల్లో, పత్రికల్లో
ప్రచురించాలని తీర్మానించారు. – సావనీరు (తెలుగు) ప్రచురణ విభాగానికి శ్రీ వి.యస్.ఆర్.మూర్తి, శ్రీ మల్లాప్రగడ, శ్రీ డివిఎన్ కామరాజు, శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం గార్లతో ఒక కమిటీ నియమించారు.
– బహుభాషల సావనీర్ ప్రచురణ విభాగానికి శ్రీ వి. ధర్మసూరి, శ్రీ పర్సా హరగోపాల్, శ్రీ రాచర్ల
రహి, శ్రీ సూరి సత్యశ్రాంత్, శ్రీ శ్రిష్ఠి లక్ష్మీనరసింహగారలతో ఒక కమిటీ నియమించారు. ఆచార్య శలాక రఘునాధశర్మగారిని సలహాదారుగా అభ్యర్థించాలని తీర్మానించారు.
– సావనీర్ ప్రచురణ వ్యయం, ఇతర అంశాల గురించి నిర్దిష్టంగా రాబోవు సమావేశంలో తెలియజేసెదనని శ్రీ వి.యస్.ఆర్.మూర్తిగారు స్పష్టం చేశారు.
I.T. కమిటీ : శ్రీ వి. హేమకుమార్ కార్యదర్శి – భక్తులు విరాళములను సులభముగా పంపుటకు
ఒక APP ను నిర్మిస్తున్నామని దానిని 25-10-22న ఆవిష్కరిస్తామని తెలిపారు.
5) Fund raising Committee : శ్రీ వి. హేమకుమార్ – దాతలను కలుసుకున్నప్పుడు వారికి ఒక కరపత్రాన్ని అందించి విరాళములను సేకరించుటకు వీలుగా ఒక కరపత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.
Project కమిటీ : శ్రీ వి. గిరిధరకుమార్ మాట్లాడుతూ-
డిసెంబరు 22 నాటికి నూతన అతిధి గృహ నిర్మాణం పూర్తి అగునని – నవంబరు 22 నాటికి టి.టి.డి. కళ్యాణమండపం మరమ్మత్తులు పూర్తి అగునని, మండపం Lease Period ను 3 సంవత్సరాలు పొడిగించారని – అక్టోబరు 22 నాటికి అందరింటి మొదటి అంతస్తుకు రంగులు వేయటం పూర్తి అగునని
– నూతన కాలెండర్ల ముద్రణ వ్యయం నిమిత్తం ఒక విదేశీ భక్తుడు రూ.2,00,000 ల విరాళాన్ని
ప్రకటించారని
వివరించారు.
7) Reception and Accommodation Committee : పెరిగిన బాధ్యతల దృష్ట్యా తాను కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తించలేనని శ్రీ యెల్. సత్యనారాయణ గారు తెలిపారు. ఆ బాధ్యతలను నిర్వహించమని అధ్యక్షులు శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారిని కోరగా, వారు అంగీకరించారు. తమ సొంత ఖర్చుతో అన్నపూర్ణాలయం ముందుభాగంలో Reception Centres ను నిర్మిస్తానని, వాటి layout drawing sheets ను అందజేశారు.
Food Arrangement Committee : అల్పాహారము, భోజనము, ఏర్పాట్ల గురించి కార్యదర్శి శ్రీమతి వి. అరుణ వివరించారు. శ్రీ యల్.వి. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ – పదార్థాలను వండి వడ్డించటం సందర్భంగా పెక్కు వంటశాలలు అవసరమనీ, ఆ ఐదురోజులలో సగటున రోజుకు 15,000 మందికి భోజనాది సౌకర్యాలను కలిగించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ప్రచురణలు : గ్రంథముల పునర్ముద్రణ, నూతన గ్రంథ ప్రచురణ, ఏఏ గ్రంథాలు ఎన్నెన్ని ఉన్నాయి? ఎన్ని అవసరము? ఇత్యాది అంశములపై అధ్యయనం చేయుటకు శ్రీ ఎమ్. దినకర్, శ్రీ వి. ధర్మసూరి, శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీ వి.త్ర్యంబకం గారలతో ఒక కమిటీ నియమించారు. తదుపరి సమావేశము 20-11-22న ఉదయం గం.10.30 నుండి గం.1.00 వరకు జరుగునని
అధ్యక్షులు తెలిపారు. శాంతిమంత్రపఠనంతో సభలు ముగిశాయి.