- అమ్మ దర్శనానికి మీలో తీవ్ర పరితాపం కలిగిన వెంటనే క్షణమాత్రం ఆలస్యం చేయకుండా జిల్లెళ్ళమూడి బయలుదేరండి.
- మీ ఎదురుగా, మీ ప్రక్కల … మీరు ఎటుచూస్తే 5. అటు అమ్మ రూపం మీకు కనుపించేటట్లు చూచుకొనండి. మీ గృహంలో …. ప్రతి గదిలో, వంటయింటిలో, పడకటింటిలో, ఆఫీసుగదిలో 6. అమ్మ చిత్రపటాలను ప్రతిష్ఠించుకొనండి.
- నిరంతరం పెదవులతో అమ్మనామాన్ని జపించండి. లేక మనస్సులో అమ్మ నామాన్ని మననం చేయండి.
- ప్రతిదినమూ ‘విశ్వజనని’ పత్రికను గానీ ‘అమ్మా ‘ అమ్మ వాక్యాలు’ నుంచి కనీసం ఒక పేజీనయినా పఠించండి.
- మీకు యిష్టమయితే – అమ్మచిత్రాన్ని గొలుసు చివర లాకెట్ లో అంకరించుకొని మెడలో ధరించండి.
- మీరు ఎవరికి ఏ విధమైన సేవచేసినా అది అమ్మకు చేసినట్లే భావిస్తూ మనస్ఫూర్తిగానూ, శక్తివంచన లేకుండానూ చేయండి.
- మీరు కలిసిన ప్రతివ్యక్తీ, చూసిన ప్రతి వస్తువూ అమ్మ రూపాంతరంగానే అర్థం చేసుకొనండి.
రెవరెండ్ సి.జి. వెస్టరెండ్