24-6-2022 బహుళ ఏకాదశి అనసూయా వ్రతము- ‘అమ్మ’ నామ సంకీర్తన జరిగినవి.
25-06-2022: జిల్లెళ్ళమూడి ప్రాచ్యకళాశాల పూర్వవిద్యార్థి కోటప్పకొండ తిరుమల తిరుపతి దేవస్థాన వేదపాఠశాల అధ్యాపకులు, శాస్త్రీయనృత్య కళాకారులు శ్రీ శ్రీకాంత్ కారి శిష్యురాలు కుమారి శ్రావణి శ్రీ అన్నపూర్ణాలయ వేదికపై గావించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. శ్రీ శ్రీకాంత్ విద్యార్థిగా తాను జిల్లెళ్ళమూడిలో అమ్మ సన్నిధిలో పొందిన తన స్వీయానుభవాలను ఎంతో భావావేశముతో వివ రించారు.
2-07-2022 ఆశ్లేషా నక్షత్రము – ‘అమ్మ’ నామ సంకీర్తనం జరిగినది.
7-7-2022, 8-7-2022 ఆగష్టు 6వ తేదీ కళాశాల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో భాగంగా 7-7-2022 8-7-2022 తేదీలలో విద్యార్థినీ విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమమును శ్రీ పి. గిరిధర్ కుమార్ గారు, శ్రీ లాలాఅన్నయ్యగారు క్రీడల ప్రాముఖ్యాన్ని తెలిపి ప్రారంభించారు.
ఈ ఆటలపోటీలు బాలుర హాస్టల్ వార్డెన్, లెక్చరర్ – శ్రీ శాస్త్రిగారు, బాలికల హాస్టల్ వార్డెన్ శ్రీమతి నండూరి నాగమణి గారి పర్యవేక్షణలో జరిగినవి. ఆటల వివరములు
బాలురు – క్రికెట్, వాలీబాల్, షార్ట్పుట్, షటల్, కారమ్స్, చెస్.
బాలికలు – మ్యూజికల్ చైర్స్ – క్యారమ్స్, షటల్, షార్టఫుట్, త్రోబాల్ – చెస్,
9-7-2022: విజయవాడ వాస్తవ్యులు శ్రీ కె.జి.కె. మూర్తిగారు – శ్రీమతి నిర్మల దంపతులు, “అమ్మను నాన్నగారిని, శ్రీ హైమవతీదేవిని దర్శించుకొని పూజలు గావించారు. శ్రీమతి నిర్మలగారు అమ్మ సన్నిధిలో చేటల నోమును చేసుకుని సోదరీ మణులకు పసుపు కుంకుమ చీరలు బహూకరించారు.
10-07-2022 శుద్ధ ఏకాదశి – తొలిఏకాదశి: సందర్భముగా శ్రీ అనసూయేశ్వరాలయములో అనసూయా వ్రతము జరిగినది. స్థానికులు, ఇతర ప్రాంతముల నుండి వచ్చినవారు వ్రత కార్యక్రమములో పాల్గొన్నారు. సాయంత్రం, విద్యార్థినులు, సోదరీ మణులు, శ్రీ హైమాలయ ఆలయప్రాంగణములో సహస్ర దీపాలంకరణ గావించారు.
హెూమశాలలో సౌర హెూమం జరిగింది.
11-07-2022: హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ వల్లూరి బసవరాజుగారు తమ పుట్టినరోజు సందర్భముగ ‘అమ్మ’కు నాన్నగారికి శ్రీ హైమవతీదేవికి పూజలు జరిపించుకొని నూతన వస్త్ర సమర్పణ గావించారు. సోదరీసోదరులకు నూతన వస్త్ర బహూకరణ గావించారు.
జిల్లెళ్ళమూడి వాస్తవ్యులు శ్రీ టి.టి. అప్పారావుగారు తమ పుట్టినరోజు సందర్భముగ అమ్మకు – నాన్నగారికి శ్రీ హైమవతీదేవికి పూజలు జరిపించుకున్నారు.
12-07-2022: రాత్రి 9 గంటలకు వాత్సల్యాలయములో – అమ్మ నామ సంకీర్తన మహాహారతి కార్యక్రమములు జరిగినవి.
13-07-2022: గురుపూర్ణిమ హైమాలయములో హైమనామ ఏకాహము జరిగినది. గురుపూర్ణిమ సందర్భముగ ఉదయము శ్రీ అనసూయేశ్వరాలయములో వేదవిద్యార్థులచే శ్రీ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ గావించబడినది. శ్రీ టి.టి. అప్పారావు గారు వ్యాసపూర్ణిమ ప్రాశస్త్యాన్ని వివరించారు. అనంతరం మాతృశ్రీ జీవితమహోదధిలో తరంగాలు పారాయణ కార్యక్రమము జరిగినది. కార్యక్రమములో అందరింటి సోదరీసోదరులందరూ పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు వాత్సల్యాలయములో అమ్మకు పూజ నామసంకీర్తన కార్యక్రమములు జరిగినవి. నామసంకీర్తన పూజాకార్యక్రమముల నిర్వహణ శ్రీమతి పిల్లలమర్రి సుబ్రహ్మణ్యం గారు శ్రీమతి పద్మావతి దంపతులు కుమారి ఎమ్.వి.సుబ్బలక్ష్మి. కార్య క్రమానంతరము తీర్థప్రసాద వితరణ జరిగింది.
16-2022 : బహుళ చవితి హెూమశాలలో సంకష్టహర గణేశహెూమము జరిగినది.
22-07-2022: తిరుపతి నుండి వచ్చిన కొందరు సోదరులు హెూమశాలలో చండీ హెూమము చేసుకున్నారు.
19-07-2022: బహుళషష్ఠి – శ్రీ హైమవతీ వ్రతము – ‘అమ్మ’ నామ ఏకాహము జరిగినది.
24-07-2022: బహుళ ఏకాదశి అనసూయావ్రతము – అమ్మ నామ సంకీర్తన జరిగినవి. స్థానికులు, ఇతర ప్రాంతముల నుండి వచ్చిన సోదరీ మణులు వ్రతకార్యక్రమములో పాల్గొన్నారు.