సాంస్కృతిక కార్యక్రమాలు:
అమ్మ శతజయంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరపాలని సంస్థవారు నిర్ణయించారన్న విషయం అందరికీ తెలిసిందే కదా.
అందులో భాగంగా మే నెల 28 వ తారీఖున కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఇందులో పాల్గొన్నవారంతా చిన్నారులే అవడం మరొక విశేషం.
ఇందులో చిరంజీవులు ఉమ్మెత్తాల వేంకట ధాత్రి, ఉమ్మెత్తాల వేంకట సాయి భరద్వాజ (తల్లి తండ్రులు శ్రీమతి సూరత్, U.V. విజయేంద్రకుమార్), N. గోకుల్ చేసుకొన్నారు. కార్తికేయ పాల్గొన్నారు.
వీరి గురువులు శ్రీ N .బాలసుబ్రహ్మణ్యాచారి గారు. వీరు నాట్యం యొక్క విశిష్టత, ఎలా చేయాలి అందులో ఉన్న అర్ధనారీశ్వర తత్త్వం విపులంగా చెప్పడమే కాకుండా, ప్రతి item ప్రదర్శించేముందు దాని గురించి విశదీకరించారు. ఆ విధంగా ఆయన సభా నిర్వహణ చాలా చక్కగా ఉంది.
కార్యక్రమం వివరాలు, నాట్యం చేసినవారి పేర్లు ఈ విధంగా ఉన్నాయి.
– జేమ్ జేమ్ తనన (ధాత్రి)
– రామశబ్దం (కార్తికేయ)
– శివ శంభో (ధాత్రి)
– అమ్మలారా అయ్యలారా, జానపదం (భరద్వాజ)
– గోవర్ధన గిరి (ధాత్రి)
– భామనే సత్యభామనే (ధాత్రి)
వీరందరి నృత్యనైపుణ్యం అందరినీ ఆకట్టుకుంది.
అమ్మ ఆశీస్సులు వీరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ చిన్నారులకు, వారి గురువుగారికి అమ్మ ప్రసాదం అందజేశారు.
అమ్మ అనంతోత్సవములు జూన్ 12, 13, 14వ తేదీలలో జరిగాయి. మొదటి రెండు రోజులూ. అననయేశ్వరాలయంలో పదకొండుమంది. ఋత్విక్కులచే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు.
12వ తేదీ ఉదయం సామూహిక అంబికా | సహస్ర నామ పారాయణ జరిగింది. తరువాత అమ్మకు “అన్నాభిషేకం” శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద స్వామీజీ (విజయ రాజరాజేశ్వరి పీఠం, పెదవులిపాక) ప్రారంభించారు. వారి అనుగ్రహభాషణం తరువాత అమ్మ బిడ్డలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో అన్నాభిషేకం చేసుకున్నారు.
మహానివేదన మంత్రపుష్పం, అమ్మ ప్రసాద వితరణ (భోజనం)తో ఉదయం కార్యక్రమం ముగిసింది.
సాయంత్రం 6 గంటలకు అనసూయేశ్వరా. లయంలో శ్రీ దినకర్ అన్నయ్య వ్రాసిన “జిల్లెళ్లమూడి అమ్మః” అనే చిన్న ఇంగ్లీషు పుస్తకం శ్రీ బ్రహ్మాండం రవి అన్నయ్య ఆవిష్కరిం చారు. ఆచార్య శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారు అమ్మని గురించి, ఆ పుస్తకం విశిష్టత గురించి విపులంగా తెలిపారు.
శ్రీ దినకర్ అన్నయ్య మాట్లాడుతూ ఆ పుస్తకం వ్రాయడానికి ఎన్నోనంవత్సరాల క్రిందటనే అమ్మ గదిలో, అమ్మ సమక్షంలోనే తనకు ప్రేరణ ఎలా కలిగిందో వివరించారు.
శ్రీ రవి అన్నయ్య తెలుగుభాషతో పరిచయం లేని ఇతర రాష్ట్రప్రజలకు అమ్మను గురించి తెలుసు కోవడానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
శ్రీ టి.టి.అప్పారావు అన్నయ్యగారు అమ్మ సందేశం అందరికీ, అన్ని ప్రాంతాలవారికి బహుముఖ ప్రచారం జరగాలని కోరుతూ, సాధనామార్గంలో అమ్మ తనకు ప్రసాదించిన ఎన్నో అనుభవాలు పంచుకున్నారు.
రాత్రి 9.30 గంటల నుండి ఒక గంటసేపు వాత్యల్యాలయంలో నామ సంకీర్తన, అమ్మను గురించి రాజుబావ, నదీరా గార్లు రచించిన పాటలు శ్రీమతి పద్మావతి, ఇతర సోదరీమణులు ఎంతో మధురంగా గానం చేశారు.
13న ఉదయం 10 గంటలకు అనసూయేశ్వరా లయంలో అంబికా సహస్రనామంతో లక్ష నామార్చన, తరువాత యాగశాలలో శ్రీ విశ్వజననీ చరితం హెూమం నిర్వహించారు.
సాయంత్రం లలితా లక్షనామార్చన, అమ్మ గుడిలో ప్రత్యేక పూజలతో ఆనాటి కార్యక్రమాలు ముగిసాయి.
14 వ తేదీ ఉదయం ఏడు గంటలకు అమ్మ మూలవిరాట్టుకు సహస్రఘటాభిషేకం ఒక ప్రత్యేక కార్యక్రమం. అందరూ ఎంతో ఉత్సాహంగా, తృప్తిగా అమ్మకు అభిషేకం చేసుకున్నారు.
సాయంత్రం 6 గంటలకు వాత్యల్యాలయం ధ్యానమందిరంలో అమ్మకు కనులపండువుగా పూలంగి సేవ జరిగింది.
వారుణానువాకాలు, శతానువాకాలు, విరాట పర్వం మొదలైన పారాయాణాలు జరగడం ఈ సంవత్సరంలో ఒక విశేషం.
అమ్మ బిడ్డలందరూ ఒక పక్క అమ్మ కనుమరుగైందని బాధపడుతూ, మరొకపక్క అమ్మ ఇక్కడే మరో రూపంలో ఉన్నదనే విశ్వాసంతో అమ్మను ఈ మూడు రోజులూ భక్తిశ్రద్ధలతో అర్చించుకొన్నారు.
అనుదినం నామసంకీర్తన, నగర సంకీర్తన, సహస్రనామ పారాయణలు ఇత్యాది కార్యక్రమాలు వైభవంగా నిర్విఘ్నంగా జరగటం కేవలం అమ్మ కృపావిశేషం.
జయహోమాత.