28-10-2021 శ్రీ నాన్నగారి 108వ జయంతి ఉత్సవ కార్యక్రమములు: శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్యగారి ఇంటి నుండి ఆవరణలో ‘అమ్మ నాన్నగారల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగినది. శ్రీ అనసూయేశ్వరాలయంలో 11 మంది ఋత్విక్కులచే 5. మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము జరిగిననవి. ఏకాహంగా నాన్నగారి నామసంకీర్తన జరిగినది. శ్రీ అనసూయేశ్వరాలయంలో సోదర సోదరులు శ్రీ అంబికాసహస్రనామ స్తోత్ర పారాయణ గావించారు. శ్రీ విశ్వజననీపరిషత్ వారు ఆవరణలోని వృద్ధులకు నూతన వస్త్రబహూకరణ గావించారు. గ్రామములో ప్రసాదవితరణ కార్యక్రమము జరిగినది.
1-11-21: శ్రీ మన్నవ వెంకట లక్ష్మీనరసింహారావుగారు శ్రీమతి శేషు దంపతులు (అందరి మామయ్య గారు అత్తయ్యగారు) మామయ్య – గారి 80వ పుట్టినరోజు సందర్భంగా అమ్మకు నాన్నగారికి శ్రీ హైమవతీదేవికి పూజలు గావించి – నూతన వస్త్రములు సమర్పించి “అమ్మ”కు నవరత్న సమర్పణ గావించారు. హోమశాలలో ఆయుష్కామము మృత్యుంజయ హోమము రుద్రహోమము జరుపుకొని అందరికీ అన్నప్రసాదవితరణ గావించారు.
1-11-21: బహుళ ఏకాదశి – శ్రీ అనసూయా వ్రతము- ‘అమ్మ’ నామ ఏకాహము జరిగినది.
2-11-21 ఏలూరు వాస్తవ్యులు శ్రీ గుడివాక శ్రీనివాసరావుగారు వాత్సల్యాలయము సభా మంది రములో గావించిన ‘శ్రీ అన్నమాచార్య కీర్తనల’ గాన కచేరి శ్రోతలను ఆనందపరవశులను చేసింది. శ్రీశ్రీనివాసరావుగారిని, వారికి అద్భుతంగా వాద్యసహకార మందించిన వారిని అందరూ అభినందించారు.
3-11-21: శ్రీ గుడివాక శ్రీనివాస్ – శ్రీమతి స్వర్ణలత దంపతులు శ్రీ శ్రీనివాస్ గారి షష్టిపూర్తి సందర్భముగ అమ్మకు నాన్నగారికి శ్రీ హైమవతీదేవికి పూజలు గావించి హోమశాలలో ఆయుషహోమము చేసుకొని ‘అమ్మ’ నామ సప్తాహముల సందర్భంగా నామసంకీర్తన చేయుచున్న సోదరీసోదరులకు నూతన వస్త్ర బహూకరణ గావించి అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు.
4-11-21: దీపావళి పండుగ “అమ్మ” సన్నిధిలో దివ్యంగా జరిగింది. సాయంత్రం 5గం. 30ని.లకు శ్రీ హైమాలయములో శ్రీ అనసూయేశ్వరాలయములో శ్రీ బుద్ధిమంతుడు అన్నయ్య దంపతులు – శ్రీ ఎమ్.వి.ఆర్. సాయిబాబు, శ్రీమతి అనంతసీతాలక్ష్మి దంపతులు, సోదరీ సోదరులు పూజా కార్యక్రమములు నిర్వహించారు.
4-11-2021: ప్రతి సంవత్సరము వలెనే శ్రీ బుద్ధిమంతుడు అన్నయ్య – శ్రీ విశ్వజననీపరిషత్ వారు, విద్యార్థినీ విద్యార్థులకు ఆవరణలోని వారికి టపాసులు వెంకట ఇచ్చారు. విద్యార్థినులు – దీపపు ప్రమిదలతో ఆలయ ప్రాంగణమును అలంకరించారు.
5-11-21: కార్తీకమాసము మొదలైంది. విద్యార్థినులు సాయంసమయంలో ఆలయములు ప్రాంగణములు, అన్నపూర్ణాలయము, వాత్సల్యాలయము లలో దీపాలంకరణ చేస్తున్నారు..
- 11, 2021: నంద్యాల వాస్తవ్యులు శ్రీ మిట్నాల వీరరాఘవశర్మగారు – శ్రీమతి సత్తెమ్మ దంపతులు, బంధుమిత్రులతో జిల్లెళ్ళమూడి వచ్చి తమ 71వ వివాహ వార్షికోత్సవము “అమ్మ” సన్నిధిలో జరుపుకున్నారు. ‘అమ్మకు నాన్నగారికి -శ్రీ హైమవతీదేవికి పూజలు గావించుకొన్నారు. అనంతరము అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు.
8.11.21 నాగులచవితి సందర్భముగా శ్రీ నాగేశ్వరాలయములో శ్రీ నాగేశ్వర స్వామికే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, బిల్వార్చన కార్యక్రమములు జరిగినవి.
12-11-21: వాత్సల్యాలయములో రాత్రి 9 గంటలకు “అమ్మ నామ సంకీర్తన”, మహాహారతి జరిగినవి.
14-11-21: 2వ ఆదివారము – హోమశాలలో సౌరహోమము జరిగినది.
15-11-21: శుద్ధ ఏకాదశి – శ్రీ అనసూయా వ్రతము – “అమ్మ” నామ ఏకాహము జరిగినవి.
16-11-21: క్షీరాబ్దిద్వాదశి – సాయంత్రం – శ్రీ అనసూయేశ్వరాలయ ప్రాంగణములో సోదరీమణులు తులసి, ఉసిరి మొక్కలకు పూజ గావించి అందరికీ తీర్థ ప్రసాదములనిచ్చారు.
18-11-21: రాత్రిగల పూర్ణిమ – శ్రీహైమనామ ఏకాహము జరిగినది.
19-11-21 కార్తీకపూర్ణిమ నుండి 25-11-2021 : బహుళ షష్ఠి వరకూ శ్రీ హైమవతీ దేవి 79వ జయంతి ఉత్సవములు వేదపఠనముతో మంగళ వాద్యములతో శుభకరముగ, వైభవంగా ప్రారంభ మయినాయి. ఉదయం 8 గంటలకు శ్రీ హైమవతీదేవికి జరిగిన క్షీరాభిషేకము – పూజాకార్యక్రమములలో శ్రీమతి బ్రహ్మాండం శేషు అక్కయ్యగారు, శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్యగారు, సోదరీ సోదరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ హైమవతీ జనయిత్రీ వ్రతములు మొదలైనవి. కార్తీకపూర్ణిమ సందర్భంగా అధికసంఖ్యలో భక్తులు “జిల్లెళ్ళమూడి క్షేత్ర సందర్శనము చేసుకొని ఆలయములు దర్శించుకున్నారు.
కార్తీకపూర్ణిమి సందర్భముగ సోదరులు శ్రీ రావూరి ప్రసాద్ గారు, కుటుంబసభ్యులు హోమశాలలో సుబ్రహ్మణ్య హోమము, రుద్రహోమము సకలదేవతా హోమములు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అభిషేక పూజా కార్యక్రమములు జరుపుకున్నారు. మండపారాధన కలశస్థాపన, పూర్ణాహుతి అవబృథస్నాన కార్యక్రమములు జరిగినవి. సాయంత్రం 6 గంటలకు శ్రీ అన్నపూర్ణాలయ వేదికపై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణకార్యక్రమము జరుపుకున్నారు.
అమ్మ ఆస్థాన గాయకుడు “అమ్మ”తో అనుభవ సేకరణోపజ్ఞుడు శ్రీ రావూరి ప్రసాద్ మహాశయులకు శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ ఛారిటబుల్ ట్రస్ట్ వారు కార్తీకపూర్ణిమ సంద్భంగా సాయంత్రం 4 గంటల నుండి వాత్సల్యాలయ సభామందిరంలో శ్రీ విశ్వజననీ పరిషత్ వారి సహకారముతో శ్రీ వి.యన్.ఆర్. జీవన సాఫల్య పురస్కారము నందించారు. కార్యక్రమమునకు వచ్చిన వారందరూ మంచి కార్యక్రమము నిర్వహించిన శ్రీ పి.యస్.ఆర్ గారిని అభినందించారు. సన్మానగ్రహీత శ్రీ రావూరి ప్రసాద్రికి శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలియ జేశారు. శ్రీ పి.యస్.ఆర్.గారు ప్రతి సంవత్సరం జరిపినట్లే సహస్ర దీపాలంకరణ కావించారు.
22-11-21: హోమశాలలో సంకష్టహర గణేశ హోమము జరిగినది. స్థానికులు ఇతర ప్రాంతముల నుండి వచ్చిన సోదరీ సోదరులు హోమకార్యక్రమములో పాల్గొన్నారు.