1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అర్కపురి విశేషాలు

అర్కపురి విశేషాలు

Vishali
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : October
Issue Number : 3
Year : 2021
  1. 8. 21 బహుళ చవితి – హోమశాలలో సంకష్ట హర గణేశహోమము జరిగినది.
  2. 8. 21 బహుళ షష్ఠి – శ్రీ హైమవతీ వ్రతము – “అమ్మ” నామ ఏకాహము జరిగినవి.
  3. 8. 21 – 29, 8, 21. సోదరులు శ్రీ రావూరి ప్రసాద్ గారి ఆహ్వానం మేరకు హైదరాబాద్ ‘పిరమిడ్ మెడిటేషన్ ఛానల్” వారు జిల్లెళ్ళమూడి మహాక్షేత్ర కార్యక్రమములను “డాక్యుమెంటరీగా” చిత్రించే నిమిత్తము వచ్చారు. శ్రీ మారేళ్ళ రవిశాస్త్రి గారి ఆధ్వర్యములో ” ఆలయములు” అందరింటి దైనందిన కార్యక్రమములు.. చిత్రీకరించారు. శ్రీ విశ్వజననీవరిషత్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావుగారు, పరిషత్ అధ్యక్షులు శ్రీ ఎమ్. దినకర్ గారు, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కరస్పాండెంట్ శ్రీమతి బి.లక్ష్మీసుగుణగారు, ఆచార్య శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు, శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారు, శ్రీ మాకాని చంద్రమోహన్ గారు, శ్రీ కోమటి బాలయ్యగారు తదితరులతో వారి వారి అనుభవాలను కూడా చిత్రీకరించారు. పి.యమ్.సి. ఛానల్ చిత్రీకరణ బృందానికి అమ్మ ప్రసాదముగ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావుగారు నూతన వస్త్రములు “అమ్మ సాహిత్యం” బహూకరించారు. చిత్రీకరించిన కార్యక్రమములు డిసెంబరు 2021 నుంచి ప్రసారం కావచ్చు.

30.8.21 శ్రీ కృష్ణాష్టమి సందర్భముగ సాయంత్రం 6 గంటలకు శ్రీ అనసూయేశ్వరాలయములో శ్రీమతి పిల్లలమర్రి పద్మావతిగారి నిర్వహణలో శ్రవణానందకరముగ నామసంకీర్తన కార్యక్రమము జరిగినది. కార్యక్రమములో ఆవరణలోని సోదరీ సోదరులు, స్థానికులు పాల్గొన్నారు. కార్యక్రమానంతరము అందరికీ మోడీకారం, వెన్న, పండ్లు, ప్రసాదముగా ఇచ్చారు.

31.8.21 శ్రావణ మంగళవారము . సందర్భముగా సోదరీమణులు శ్రీ హైమాలయములో మంగళగౌరీ వ్రతము చేసుకున్నారు.

2.9.21 బహుళ ఏకాదశి – శ్రీ అనసూయా వ్రతము “అమ్మ” నామ ఏకాహము జరిగినవి.

3.9.21 శ్రావణ శుక్రవారము – సోదరీ మణులు శ్రీ హైమాలయములో నోములు, పూజలు చేసుకున్నారు. “అమ్మ” భక్తులు “అమ్మకు – శ్రీ హైమవతీదేవికి పూజలు గావించి నూతన వస్త్ర సమర్పణ గావించారు.

5.9.21 ఆశ్లేషా నక్షత్రము “అమ్మ” నామ ఏకాహము జరిగినది. –

7.9.21 శ్రావణ మంగళవారము అందరింటి సోదరీమణులు శ్రీ హైమాలయములో శ్రావణ మంగళగౌరీ నోములు చేసుకున్నారు.

10.9.21 వినాయకచవితి కార్యక్రమములు: ఉదయం 7 గంటలకు శ్రీ వరసిద్ధివినాయక ఆలయములో ఏకాదశ రుద్రాభిషేకము ఉదయం 10 గంటలకు వినాయకచవితి పూజా కార్యక్రమములు సాయంత్రం 5 గంటలకు హోమశాలలో గణపతి హోమము, సాయంత్రం 6 గంటల 30ని.లకు (ఏకవింశతి) 21 పత్రములతో విఘ్నేశ్వరునికి పూజా కార్యక్రమములు జరిగినవి. కార్యక్రమములలో అందరింటి సోదరీ సోదరులు విద్యార్థిని విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.

12.9.21 శ్రీ విశ్వజననీపరిషత్ ప్యాట్రన్ – శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్యగారి పుట్టినరోజుసందర్భముగా శ్రీ రవీంద్రరావుగారు శ్రీమతి వైదేహి దంపతులు “అమ్మకు -నాన్నగారికి” శ్రీహైమవతీదేవికి పూజలు గావించి అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు. ఆవరణలోని సోదరీసోదరులకు నూతన వస్త్ర బహూకరణ గావించారు. సోదరీ సోదరులు శ్రీ రవి అన్నయ్యగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

12.9.21 2వ ఆదివారము హోమశాలలో సౌరహోమము జరిగినది. స్థానికులు ఇతర ప్రాంతముల నుండి వచ్చిన సోదరీ సోదరులు హోమకార్యక్రమములో పాల్గొన్నారు.

రాత్రి 9 గంటలకు వాత్సల్యాలయములో అమ్మ నామ సంకీర్తన, మహాహారతి కార్యక్రమములు జరిగినవి.

17.9.21 శుద్ధ ఏకాదశి – శ్రీ అనసూయేశ్వ రాలయములో శ్రీ అనసూయావ్రతము, “అమ్మ” నామ ఏకాహము జరిగినవి.

19.9.21 కీ.శే. శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణగారి. జయంతి సందర్భముగ, సోదరులు శ్రీ వారణాసి ధర్మసూరి గారి ఆధ్వర్యములో అన్నప్రసాద వితరణ మరియు గ్రామంలో “అమ్మ” ప్రసాదముగ పులిహోర ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమమునకు కళాశాల విద్యార్థులు తమ సహాయసహకారముల నందించారు.

20.9.21 రాత్రిగల పూర్ణిమ – శ్రీ హైమనామ ఏకాహము జరిగినది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!