28-5-2021 మండపారాథన, కలశస్థాపన అనంతరం వెయ్యి వుండ్రాళ్ళతో అష్టగణపతి హోమము నిర్వహించారు. 29-5-2021: 108 ఆవృతములతో మన్యుసూక్త హోమము జరిగినది. 29-5-2021 :యాగశాలలో శ్రీ సంకష్టహర గణపతిహోమము జరిగినది.
30-5-2021: మహా సుదర్శన హోమము, నారసింహ హోమము జరిగినవి. 31-5-2021: ఉదయము ఏకాదశరుద్ర హోమము జరిగినది.
01-06-2021: ఉదయము శ్రీసుబ్రహ్మణ్య హోమము నిర్వహించబడినది. సాయంత్రము “అమ్మ-నాన్న గారల” శాంతికళ్యాణము శ్రీ నవనాగేశ్వర ఆలయప్రాంగణములో జరిగినది. హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ వారణాసి ధర్మసూరి గారు, కుమారి ఎమ్. శైలజ, కార్యక్రమములకు తమ సంపూర్ణ సహాయసహకారములనందించారు.
శాంతి కళ్యాణ కార్యక్రమానంతరం, వెయ్యి (1000) లడ్డూలు జిల్లెళ్ళమూడిలో గడపగడపకూ అమ్మ – నాన్నగారల ప్రసాదముగ పంచటము జరిగినది.
ఈ కార్యక్రమములకు సోదరులు, కీ॥శే॥ శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ గారి కుటుంబ సభ్యులు “ఆర్ధికముగ” సేవ చేసుకున్నారు. అనేకమంది వేదపండితులు ప్రతిరోజూ ఉదయం ముక్త కంఠముతో “అమ్మనామము” చేయటం అందరికీ ఆనందాన్ని కలిగించింది.
12-06-2021 నుండి 14-06-2021 ‘అమ్మ’ – అనంతోత్సవములు: –
12-06-2021: శ్రీ అనసూయేశ్వరాలయములో “మూలవిరాట్ అమ్మకు 11 మంది ఋత్విక్కులచే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము. “అన్నపూర్ణేశ్వరి, నిత్యాన్నదానేశ్వరి” ‘అమ్మ’కు అన్నాభిషేక కార్యక్రమములు జరిగినవి.
రాత్రి గం. 9-00లకు వాత్సల్యాలయములో అమ్మ నామ సంకీర్తన, మహాహారతి జరిగినవి.
13-06-2021: ఉదయము 11 గం॥కు శ్రీ అనసూయేశ్వరాలయములో అంబికాసహస్రనామ పారాయణ కార్యక్రమములు జరిగినవి. సౌరహోమము జరిగింది.
గుంటూరు వాస్తవ్యులు “విజ్ఞానస్వరూప్” శ్రీ కోసూరు మురళీకృష్ణారావు గారు “అమ్మకు – నాన్నగారికి” శ్రీ హైమవతీదేవికి పూజలు గావించి, తాను రచించిన “అనసూయోపనిషత్తు” గ్రంథమును సమర్పించి అనంతరము కార్యక్రమమునకు వచ్చిన సోదరీసోదరు లందరికీ గ్రంథ బహూకరణ గావించారు.
శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు శ్రీ మురళీకృష్ణారావు గారు, శ్రీమతి సరోజ దంపతులను వేదాశీర్వచనముతో ‘అమ్మ’ ప్రసాదముగ నూతన వస్త్రములతో సత్కరించారు.
14-06-2021: శ్రీ అనసూయేశ్వరాలయములో సహస్రఘటాభిషేకము జరిగినది. హోమశాలలో “శ్రీ విశ్వజననీ చరితము” హోమము జరిగినది. ధ్యానా లయములో “అమ్మ”కు శ్రీలలితాసహస్రనామ పారాయణ, పూలంగి సేవ, పూజా కార్యక్రమములు జరిగినవి.
12-06-2021 – 17-06-2021: శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ వార్షికోత్సవములు
15, 16-06-2021 శ్రీ వరసిద్ధి వినాయక ఆలయములో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, శ్రీ గణపతి సహస్రనామార్చన యాగశాలలో సహస్ర మోదకములతో శ్రీ లక్ష్మీగణపతి హోమము, అష్టగణపతి హోమము జరిగినవి.
17-06-2021: అధర్వ శీర్షిపనిషత్ అభిషేకము, ఏకవింశతి పత్రములతో “గకార గణపతి” సహస్రనామార్చన యాగశాలలో శ్రీ గణపతి అధర్వశీర్షిపనిషత్తో హోమము, పూర్ణాహుతి, అవబృధ స్నానములు జరిగినవి.
కార్యక్రమములలో శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు, శ్రీమతి వైదేహి దంపతులు, శ్రీమతి బ్రహ్మాండం శేషు అక్కయ్య గారు, శ్రీ విశ్వజననీ పరిషత్ కార్యనిర్వాహకులు అందరింటి సోదరీసోదరులు పాల్గొన్నారు.
19-06-2021: శ్రీ కొండముది ప్రేమకుమార్ శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతుల కుమార్తె చి||ల|| సౌ అనసూయ సంహిత వివాహ నిశ్చితార్థ కార్యక్రమము, బాపట్ల వాస్తవ్యులు శ్రీ యల్లాప్రగడ వెంకట సూర్యరమణగారు, శ్రీమతి జ్యోతివాణి దంపతుల కుమారుడు చి॥ వెంకటనాగసాయి మారుతి రాఘవేంద్ర భరద్వాజ్ గారితో శ్రీ అన్నపూర్ణాలయ వేదికపై వైభవంగా జరిగింది.
20-06-2021: జిల్లెళ్ళమూడి వాస్తవ్యులు శ్రీ మన్నవ లక్ష్మీనరసింహరావు గారు, శ్రీమతి శేషు దంపతులు, వాత్సల్యాలయములో “అమ్మకు” పూజచేసుకొని, మామిడిపండ్లు నివేదన చేసి అందరికీ ప్రసాదముగ ఇచ్చారు.
శ్రీ అన్నంరాజు మురళి జన్మదినోత్సవ సందర్భంగా వారి కుమారులు వంశీ, ప్రేమచరణ్ గోసంరక్షణార్థం రు.516/-లు సమర్పించారు.
21-6-2021: శ్రీ హనుమజ్జయంతి సందర్భముగా హైమాలయములో తమలపాకులతో, పుష్పాలతో పూజ నిర్వహించి, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ గావించారు.