26-4-21 పూర్ణిమ శ్రీ హైమనామ ఏకాహము జరిగినది.
12-5-2021: రాత్రి 9 గం.కు వాత్సల్యా లయములో నామసంకీర్తన, మహాహారతి జరిగినవి.
30-4-21 బహుళ చవితి – హోమశాలలో సంకష్టహర గణేశహోమము జరిగినది.
2-5-21 బహుళ షష్ఠి – శ్రీ హైమాలయములో హైమవతీ వ్రతము జరిగినది.
5-5-2021 జగత్కళ్యాణమూర్తులైన “అమ్మ, నాన్నగారల (శ్రీఅనసూయా, శ్రీనాగేశ్వరుల) కళ్యాణ మహోత్సవ వేడుకలు శ్రీ అనసూయేశ్వరాలయములో వైభవంగా జరిగినవి. శ్రీఆనసూయేశ్వరాలయములో కళ్యాణమూర్తులకు ఉదయం 10 గం. కళ్యాణ కార్యక్రమములు మొదలైనవి. “అమ్మ” తరపున శ్రీమన్నవ లక్ష్మీనరసింహారావుగారు, శ్రీమతి శేషదంపతులు అందరి మామయ్య అత్తయ్యగారలు) నాన్నగారి తరపున శ్రీ చుండి నవీన్ శర్మ, శ్రీమతి సుందరి దంపతులు, శ్రీ మురికిపూడి సందీప్ శర్మ కళ్యాణకార్యక్రమము నిర్వహించారు. వేదవిద్యార్థులు కార్యక్రమ సహాయకులుగా వున్నారు. వేదమంత్రములతో శుభప్రదముగ “నాన్నగారు మంగళసూత్రమును “అమ్మ. దివ్యకంఠ సీమనలంకరించారు”. అనంతరం, హైదరాబాద్ వాస్తవ్యులు సోదరులు శ్రీ పొత్తూరి ప్రేమగోపాల్ సమర్పించిన ముత్యాలతో తలంబ్రాల కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. సోదరీసోదరులు “అమ్మ, నాన్న గారల” దివ్య శ్రీ చరణార్చన చేసుకున్నారు.
7-5-2021: బహుళ ఏకాదశి, శ్రీ అనమాయేశ్వరాలయములో “శ్రీఅనసూయావ్రతము”జరిగినది.
9-5-2021: హోమశాలలో సౌరహోమము జరిగినది.
1-5-2021 నుండి 12-5-2021 పౌరహోమములు, ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ అన్నారు. మనవాళ్ళు. అనేక సంవత్సరములనుండి జిల్లెళ్ళమూడిలో “మహాసౌరహోమం” జరుగుతోంది ప్రపంచమంతా. ఆరోగ్యంగా వుండాలని, ఇప్పుడున్న కరోనా సమస్య తగ్గడానికి, నివారణ కొరకు శ్రీ విశ్వజననీపరిషత్, శ్రీ విశ్వజననీ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యములో సోదరులు శ్రీ వారణాసి ధర్మసూరిగారి సూచన మేరకు 1-5-21. నుండి 12-5-21 వరకూ జిల్లెళ్ళమూడిలో మహా సౌరహోమం జరిగింది.
ఈ హోమంతోపాటు రోజూ 108 ఆవృతులు, లక్ష్మీగణపతి హోమము, నవగ్రహహోమము, రోజూ 12 ద్వాదశ ఆదిత్యులు అన్నారు గనుక 144 మహా పౌరహోమాలు చేద్దామని సంకల్పించారు. “అమ్మ” దయవల్ల 156 మహాసౌరహోమాలు జరిగాయి. 36 ఆవృతముల అరుణహోమం జరిగింది.
తరువాత “నృసింహ”హోమం కూడా జరిగింది. ప్రతిరోజూ ఆజ్యపూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. అన్ని రోజులు కార్యక్రమం దిగ్విజయంగా 12-5-21 న పూర్తి అయినది. తెనాలి నుంచి వచ్చిన శ్రీవిష్ణుభట్ల లక్ష్మీపతి సోమయాజులుగారి బ్రహ్మత్వంలో జిల్లెళ్ళమూడి ఆలయముల అర్చకులు శ్రీ చుండి నవీన్ శర్మగారు, వేదపాఠశాల గురువర్యులు శ్రీమురికిపూడి నందీప్ శర్మ గారు, శ్రీ షణ్ముఖ శ్రీనివాసశర్మ గారు. సూర్య నమస్కారములు చేశారు. వీరి ఆధ్వర్యములో హోమ కార్యక్రమములు జరిగినవి.
సోదరులు శ్రీ వారణాసి ధర్మసూరి గారు 1-5-21 నుండి 12-5-21 వరకు హోమకార్య క్రమములలో పాల్గొన్నారు.
పూర్ణాహుతి నాడు శ్రీవిశ్వజననీపరిషత్ పాట్రన్ శ్రీబ్రహ్మాండం రవీంద్రరావుగారు, జనరల్ సెక్రటరీ శ్రీ డి.వి.ఎన్. కామరాజు గారు, ఋత్విక్కులందరికీ వస్త్రాలు, దక్షిణ తాంబూలములతో సత్కరించారు. మంటపారాధన, కలశస్థాపనతో కార్యక్రమములు మొదలైనవి. 12-5-21 సాయంత్రం పూర్ణాహుతితో కార్యక్రమాలు మంగళ ప్రదముగా పూర్తి అయినవి.