26.12.2020: శ్రీ గణపతి సచ్చిదానందస్వామి వారి శిష్యులు ( హైదరాబాద్) నేడు జిల్లెళ్ళమూడి ఆలయముల సందర్శనము చేసుకొని శ్రీ అనసూయేశ్వ రాలయములో భగవన్నామ సంకీర్తన గావించారు.
- 12. 2020 శ్రీ వమిడిపాటి గిరిధరకుమార్ గారు, శ్రీమతి శివకుమారి దంపతులు నేడు గిరిధర కుమార్ గారి పుట్టినరోజు సందర్భముగ శ్రీ అనసూయేశ్వ రాలయములో అనసూయా వ్రతము చేసుకొని అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు.
హైదరాబాదు వాస్తవ్యులైన శ్రీ గాదిరాజు రమేష్ ప్రసాద్ గారు డాక్టర్ శ్రీమతి పద్మజ దంపతులు, నూతన వధూవరులైన తమ కుమారుడు చి. కృష్ణకార్తీక్, చి.ల.సౌ.శిల్పామూర్తి గారలతో నేడు జిల్లెళ్ళమూడి వచ్చి, అమ్మకు, నాన్నగారికి, శ్రీ హైమవతీదేవికి పూజలు గావించి, శ్రీ అనసూయేశ్వరాలయములో శ్రీ అనసూయా వ్రతము జరుపుకున్నారు.
29.12.2020: రాత్రి గల పూర్ణిమ – శ్రీ హైమ నామ ఏకాహము జరిగినది.
- 12. 2020 నూతన ఆంగ్ల సంవత్సర ఆగమన సందర్భముగ 31-12-2020 సాయంత్రం 6 గంటల నుండి 1-1-2021 సాయంత్రం 6 గంటల వరకూ ‘అమ్మ’ నామ ఏకాహము జరిగింది. కార్యక్రమంలో స్థానిక భజన బృందముల వారు, ఆవరణలోని సోదరీసోదరులు, గ్రామస్థులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొండముది రవిబాబు.
రాత్రి 11 గంటల నుండి శ్రీ అననూ యేశ్వ రాలయములో సోదరీ సోదరులు ‘అమ్మ నామ సంకీర్తన’ భక్తి గీతాలాపన గావించారు. రాత్రి 12 గంటలకు శ్రీ అనసూయేశ్వరాలయములో ‘అమ్మను నాన్నగారిని’ — శ్రీ హైమాలయములో శ్రీ హైమవతీదేవిని దర్శించుకొని సోదరీ సోదరులందరూ ఉత్సాహంగా “హ్యపీ న్యూఇయర్” అంటూ పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ఎమ్. వి. ఆర్ సాయిబాబుగారు శ్రీమతి అనంతనీతాలక్ష్మి దంపతులు మాజా కార్యక్రమములు నిర్వహించారు. శ్రీ విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ ఎమ్. దినకర్, కార్యదర్శి శ్రీ డి.వి.యన్. కామరాజు అమ్మ చిత్రమున్న నూతన సంవత్సర క్యాలండర్లను ‘అమ్మ’ సన్నిధిలో ఆవిష్కరించారు. వాత్సల్యాలయములో శ్రీమతి మతుకుమల్లి శారద పూజా కార్యక్రమములు నిర్వహించారు. అనంతరము శ్రీ అన్నపూర్ణాలయ వేదిక వద్ద ‘అమ్మ’ ప్రసాదముగ ‘టీ, రస్కులు’ ఇచ్చారు. నూతన సంవత్సర క్యాలెండర్లను సోదరీ సోదరులందరికీ పంచారు. కార్యక్రమములలో శ్రీ విశ్వజననీవరిషత్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు, పరిషత్ కార్యనిర్వహణాధికారులు, ఉద్యోగులు, ఆవరణలోని వారు, గ్రామస్థులు, ఇతర ప్రాంతముల నుండి వచ్చిన వారు పాల్గొన్నారు. నెల్లూరు వాస్తవ్యులు శ్రీ ఈమని కుమారశాస్త్రి గారి నిర్వహణలో ఎందరో సోదరీ సోదరుల సహకారముతో శ్రీ అనసూయేశ్వరాలయములో, శ్రీ హైమాలయములో పుష్పాలంకరణ గావించబడినది.
1.1.2021: నూతన సంవత్సరారంభ సందర్భముగ శ్రీ అనసూయేశ్వరాలయము, శ్రీ హైమా లయము, శ్రీ నవనాగేశ్వరాలయము – శ్రీ వరసిద్ధి వినాయకాలయమును అధిక సంఖ్యలో భక్తులు దర్శనము చేసుకున్నారు.
2.1.2021: బహుళ చవితి – సంకష్టహర గణేశ హోమము జరిగినది.
ఆశ్లేష నక్షత్రము ‘అమ్మ’ నామ ఏకాహము జరిగినది.
4.1.2021: బహుళ షష్ఠి శ్రీ హైమవతీ వ్రతము ‘అమ్మ’ నామ ఏకాహము జరిగినవి.
7.1.2021: శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్య నిర్వహణలో సాయంత్రం 6 గంటలకు శ్రీ అన్నపూర్ణాలయ వేదిక వద్ద సందెగొబ్బెమ్మ పేరంటము జరిగింది. బాలికల హాస్టల్ వార్డెన్ శ్రీమతి నండూరి నాగమణి, విద్యార్థినులు “అమ్మ” చిత్రపటమునకు గొబ్బెమ్మలకు పూజచేసి పేరంటము ప్రారంభించారు. విద్యార్థినులు కోలాట నృత్యం ప్రదర్శించారు. వేద విద్యార్థులు, హరిదాసులై వచ్చారు. శ్రీమతి పిల్లలమర్రి పద్మావతిగారు, కుమారి ఎమ్. వి. సుబ్బలక్ష్మి గారు, శ్రీమతి చుండి సుందరిగారు గొబ్బిపాటలు పాడి నామ సంకీర్తన గావించారు. కార్యక్రమానంతరం అందరికీ ప్రసాద వితరణ జరిగింది.
9.1.2021: బహుళ ఏకాదశి – శ్రీ అనసూయా వ్రతము, ‘అమ్మ’ నామ ఏకాహము జరిగినవి.
10.1.2021: బాపట్ల వాస్తవ్యులు శ్రీ దుంపల సూర్యం, శ్రీమతి ఇందుమతి – తమ కుమార్తె చి. అర్పిత అన్నప్రాశన కార్యక్రమము అనసూయేశ్వరాలయలో చేసి అందరికీ అన్నప్రసాద వితరణ చేశారు.
12.1.2021: వాత్సల్యాలయములో రాత్రి 9 గంటలకు నామ సంకీర్తన మహాహారతి జరిగినవి.
13.1.2021: ధనుర్మాసము ముగిసింది. ధనుర్మాసమంతా వేకువనే భగవన్నామ సంకీర్తన పూజా కార్యక్రమములకు సోదరీ సోదరులు భక్తిశ్రద్ధలతో వచ్చి పాల్గొన్నారు. నామ సంకీర్తన నిర్వహించిన శ్రీ పిల్లలమర్రి సుబ్రహ్మణ్యం – శ్రీమతి పద్మావతి దంపతులకు శ్రీ విశ్వజననీపరిషత్ వారు “అమ్మనాన్నగారి ఆశీః పూర్వకంగా నూతనవస్త్ర బహూకరణ కావించారు.
భోగిపండుగ సందర్భముగ సాయంత్రం 6. గంటలకు శ్రీ అనసూయేశ్వరాలయములో, శ్రీ హైమాలయములో భోగిపండ్ల వేడుక జరిగింది.
విజయవాడ వాస్తవ్యులు శ్రీ కోన వెంకట సుబ్బారావు, శ్రీమతి విజయలక్ష్మి దంపతులు అనసూయేశ్వరాయములో పూజా కార్యక్రమము ప్రారంభించారు. సోదరీసోదరులు అందరూ అమ్మ నాన్నగారు శ్రీ హైమవతీదేవి శ్రీ చరణములను భోగిపండ్లు, పుష్పములతో అర్చించుకున్నారు. అనంతరము కార్యక్రమమునకు వచ్చిన వారందరికీ ఆలయముల అర్చకుడు ఆశీర్వచన పూర్వకముగ భోగిపండ్లు పోశారు. తదుపరి తీర్థ ప్రసాద వినియోగము జరిగింది.
14.1.2021: సంక్రాంతి పండుగ సందర్భముగా సౌరహోమము జరిగింది.
15.1.2021: విజయవాడ వాస్తవ్యులు శ్రీ కోన వెంకట సుబ్బారావు, శ్రీమతి విజయలక్ష్మి దంపతులు శ్రీ హైమాలయములో శ్రీ హైమవతీవ్రతము చేసు కున్నారు. సంక్రాంతి, కనుమ పండుగల సందర్భముగా అధిక సంఖ్యలో సందర్శకులు, ఆలయముల సందర్శనము చేసుకున్నారు.
24.1.2021: శుద్ధ ఏకాదశి అనసూయేశ్వరాలయములో శ్రీ అనసూయా వ్రతము ‘అమ్మ’ నామ ఏకాహము జరిగినవి. హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ కుమ్మమూరు నరసింహమూర్తి గారు వారి సోదరులు కుటుంబసభ్యులతో నేడు జిల్లెళ్ళమూడి వచ్చి మాతృశ్రీ గోశాల నందు గోదానము చేసి, దుర్గపిన్ని అస్తికలు ఓంకారనదిలో కలిపి ‘అమ్మకు – నాన్నగారికి – శ్రీ హైమవతీదేవికి పూజలు నిర్వహించి అందరికీ – అన్నప్రసాదవితరణ గావించారు.