25.11.2020: శుద్ధ ఏకాదశి – శ్రీ అనసూయా వ్రతము ”అమ్మ” నామ ఏకాహము జరిగినవి.
28.11.2020: గన్నవరం వాస్తవ్యులు శ్రీ ఈలప్రోలు వెంకటేష్ – శ్రీమతి దివ్యదంపతులు వారి కుమార్తె చి.కుసుమాచౌదరి అన్నప్రాశన కార్యక్రమము శ్రీ అనసూయేశ్వరాలయములో జరుపుకున్నారు.
29.11.2020: రాత్రి గల పూర్ణిమ. శ్రీ హైమ నామ ఏకాహము జరిగినది.
30.11.2020 నుండి 6.12.2020 : 30-11-2020 కార్తీక పౌర్ణమి నుండి 6-12-2020 బహుళ షష్ఠి వరకూ శ్రీ హైమవతీదేవి 78వ జయంతి ఉత్సవములు వేదపఠనముతో, మంగళ వాద్యములతో శుభకరముగ వైభవంగా ప్రారంభ మయినాయి.
ఉదయం శ్రీ హైమవతీదేవికి జరిగిన అభిషేక, పూజాకార్యక్రమములలో శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు, శ్రీమతి వైదేహి దంపతులు, శ్రీ విశ్వజననీపరిషత్ కార్యనిర్వహణాధికారులు, ఆవరణలోని సోదరీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
30.11.2020 నుండి 6.12.2020: వరకూ శ్రీ హైమాలయములో శ్రీ హైమవతీ జనయిత్రీ భవ,గా వ్రతములు జరిగినవి.
3.12.2020: బాపట్ల వాస్తవ్యులు శ్రీ ఎమ్.వి.ఎమ్. చరణ్ – శ్రీమతి మృదుల దంపతుల ద్వితీయ కుమార్తె కుమారి చరిత పుష్పవతి అయిన సందర్భముగా వాత్సల్యాలయములో పేరంటము చేసి, అందరికీ అన్నప్రసాదవితరణ గావించారు.
4.12.2020: బహుళచవితి, సంకష్టహర గణపతి హోమము జరిగినది.
5.12.2020: ఆశ్లేషా నక్షత్రము,అమ్మనామ సంకీర్తన జరిగినది.
6.12.2020: బహుళషష్ఠి శ్రీహైమవతీదేవి 78వ జయంతి ఉత్సవములు వైభవంగా జరిగినాయి. ఉదయం 7 గంటలకు ఆలయముల అర్చకులు, శ్రీ అన్నపూర్ణాలయ వేదికపై ”అమ్మ – శ్రీ హైమవతీదేవి” చిత్రపటములకు పూజ గావించి శ్రీ లలితాకోటి నామ పారాయణ కార్యక్రమమును ప్రారంభించారు. కార్యక్రమములో ఆవరణలోని సోదరీ సోదరులు, మాతశ్రీ ఓరియంటల్ కళాశాల అధ్యాపకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ హైమవతీదేవి జయంతి సందర్భముగా సోదరీ సోదరులు ”సర్వాలంకారశోభితురాలై, కిరీట ధారిణియై భాసించిన కరుణామయి, కారుణ్యమూర్తి, తేజో విరాజితురాలైన హైమవతీదేవిని దర్శించుకొని అర్చించుకున్నారు.
శ్రీ హైమవతీదేవి జన్మదినోత్సవ సందర్భముగ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ పొత్తూరి ప్రేమగోపాల్‌గారు 2021 నూతన సంవత్సర హైమవతీదేవి క్యాలండర్లను సమర్పించారు. శ్రీ బ్రహ్మాండం రవి అన్నయ్యగారు శ్రీ ప్రేమగోపాల్‌గారు కార్యనిర్వహణాధికారులు శ్రీ అనసూయేశ్వరాలయములో శ్రీ హైమాలయములో క్యాలెండర్లను ఆవిష్కరించారు. కోటి నామార్చనలో పాల్గొన్న వారికి, సందర్శకులకు, క్యాలెండర్లు ఇచ్చారు.
”ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు ”కోటి, ముప్పది లక్షల 24 వేల” పారాయణ జరిగినవి.
జయంతి ఉత్సవాలకు జిల్లెళ్ళమూడి రాలేక పోయిన సోదరీ సోదరులు అధికసంఖ్యలో స్వగ్రామాలలో స్వగృహాలలో పారాయణలు నిర్వహించుకొని, పారాయణ సంఖ్యను తెలియజేశారు. ”అమ్మ” శ్రీ హైమవతీదేవి కృపా కటాక్షములతో, శ్రీ లలితాకోటి పారాయణ కార్యక్రమము విజయవంతంగా పూర్తి అయింది. సాయంత్రం జరిగిన కార్యక్రమములలో, 2 సప్తాహముల అమ్మ నామ సంకీర్తన చేసిన సోదరీ సోదరులకు హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ వారణాసి ధర్మసూరిగారి వితరణతో నూతన వస్త్ర బహూకరణ జరిగింది. శ్రీ కొండముది రవిగారి నిర్వహణలో శ్రీ విశ్వజననీపరిషత్ అధ్యకక్షులు శ్రీ ఎమ్.దినకర్ నూతన వస్త్ర బహూకరణ గావించారు. కన్యలకు శ్రీ డి.వి.యన్.కామరాజు దంపతులు – శ్రీ విశ్వజననీపరిషత్ వారు నూతన వస్త్రబహూకరణ గావించారు.
కార్యక్రమముల అనంతరం సోదరీమణులు ”శ్రీ హైమవతీదేవికి” ప్రదక్షిణా పూజా కార్యక్రమములు పూర్తిచేసి, ప్రసాద నివేదనలు గావించి, సోదరీ సోదరులందరికీ పంచారు.
శ్రీ లలితా కోటి నామపారాయణ ముగింపు సందర్భముగా శ్రీ అన్నపూర్ణాలయ వేదికపై ”శ్రీ హైమవతీదేవికి” అమ్మకు హారతి నిచ్చి కార్యక్రమమునకు ముగింపు పలికారు.
హైమనామ సప్తాహాలు : హైమ అక్కయ్య జయంతి ఉత్సవాలు సందర్భంగా నవంబరు 23 నుండి డిశంబరు 6 వరకు 2 అమ్మనామ సప్తాహాలు కె.రవిబాబు నిర్వహణలో భజన బృందాలు, గ్రామస్థుల భాగస్వామ్యంతో దిగ్విజయంగా జరిగినాయి.
10.12.2020: కార్తీకమాస సందర్భముగ శ్రీ విశ్వజననీపరిషత్ వారు వనభోజనములు ఏర్పాటు చేశారు. శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ప్రాంగణములో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమములో సోదరీ సోదరులు పాల్గొన్నారు.
11.12.2020: బహుళ ఏకాదశి – శ్రీ అనసూయా వ్రతము, అమ్మ నామ ఏకాహము జరిగినవి.
12.12.2020: రాత్రి 9 గంటలకు వాత్సల్యా లయములో నామసంకీర్తన, మహాహారతి కార్యక్రమములు జరిగినవి.
13.12.2020: 2వ ఆదివారము సౌరహోమము జరిగినది.
16.12.2020: ధనుర్మాసము ప్రారంభమయి నది, వేకువనే ఆలయములలో పూజా కార్యక్రమములు జరుగుచున్నవి. శ్రీ అనసూయేశ్వరాలయములో నామసంకీర్తన తిరుప్పావై పఠనము జరుగుచున్నవి. శ్రీమతి పి.పద్మావతిగారు – నామ సంకీర్తన నిర్వహణ, కుమారి ఎమ్.వి.సుబ్బలక్ష్మి తిరుప్పావై పఠనము గావిస్తున్నారు. అందరింటి సోదరీ సోదరులు, స్థానికులు కార్యక్రమములో పాల్గొంటున్నారు. అనంతరము తీర్థ ప్రసాద వినియోగము జరుగుచున్నది.
20.12.2020: సుబ్రహ్మణ్యషష్ఠి సందర్భముగ శ్రీ నవనాగేశ్వరాలయములో శ్రీ నాగేశ్వరస్వామికి మహన్యాస పూర్వక ఏకాథ రుద్రాభిషేకము – రుద్ర త్రిశతి అర్చనా కార్యక్రమములు జరిగినవి.
25.12.2020: శుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భముగ వేకువనే శ్రీ అనసూయేశ్వరాలయ ఉత్తర ద్వారదర్శనము ఆలయములో పూజా కార్యక్రమములు జరిగినవి. శ్రీ అనసూయేశ్వరాలయములో విష్ణు సహస్ర నామపారాయణ, నామసంకీర్తన, తిరుప్పావై పఠనము జరిగినవి. శ్రీ అనసూయేశ్వరాలయములో సోదరీ మణులు శ్రీ అనసూయావ్రతము చేసుకున్నారు. శ్రీ ప్రత్తిపాటి వెంకటరవి, శ్రీమతి విజయలక్ష్మి ఉత్తరద్వార పూజ నిర్వహించారు. శ్రీ అనసూయేశ్వరాలయములో శ్రీ డి.వి.యన్.కామరాజు, శ్రీమతి సుందరి దంపతులు, శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్య పూజలు నిర్వహించారు. మొత్తం కార్యక్రమాన్ని ఐఙఅఆ వారు గిళితి-శితిలీలి మధ్యమం ద్వారా ప్రత్యక్షప్రసారం చేసి సకల సోదరీ సోదరులకు ఆనందాన్ని కలిగించారు.