ఓంకారమే మూలం అన్నింటికీ అని పెద్దలు చెప్పారు. అమ్మ తాను ఏ అవతారము కాదు “అమ్మను” అన్నది. అమ్మ అనటంలో ఒక విచిత్రమైన అక్షరాలతో “అ” అని చేవ్రాలు చేసేది. మీరు చూస్తే నేను కనపడను, నేను కనిపిస్తేనే మీరు చూడగలరు అన్నట్టుగానే “అంఆ” అనే అక్షరాలకు వివరణ కూడా అమ్మే ఇచ్చింది. అమ్మ చెబితే తప్ప మనకు తెలియదు కదా! “అంతకూ” “ఆధారమైనదనీ” ఆది అంతమూ లేనిదనీ, అంతా అయి అర్థం కానిదనీ, అన్నిటికీ మూలం తాననీ – తానే అన్నీ అనీ చెప్పింది. ‘అంటే’ అనే అక్షరాలు పలుకుతుంటే “ఓం”కారమే వినిపిస్తుంది గమనించండి. సాకారంగా మన కళ్ళకు కనిపిస్తున్న ఈ సృష్టికి కారణమైన శక్తి తానే ననీ, ఈ చరాచర సృష్టిలో జరిగే పరిణామలన్నింటికి తనదే బాధ్యత అని చెప్పింది. అందుకే తల్లికి తప్పదు కాదు తప్పులే కనిపించవన్నది. కారణం తను సృష్టించిన వారిలో వాటిలో లోపం ఏదైనా ఉంటే అది తనదే అన్నది. అమ్మ అన్న మాటలు సంకలనం చేస్తూ శ్రీపాదవారూ, రామకృష్ణ మొదలైన వారు అమ్మలో కొన్ని వాక్యాలు ఒక దాని కొకదానికి విరుద్ధంగా ఉన్నవి. వాటిని తీసేస్తామన్నారు అప్పడమ్మ తల్లికి కుంటివాడో, గ్రుడ్డివాడో పుడితే వదిలేస్తుందా? అన్నది. నేను లోపం ఎన్నటం మొదలు పెట్టితే ఏడవ మైలు దిగేవాడు ఉండడన్నది. అందుకే మనం తిట్టినా, కొట్టినా దూషించినా, భూషించినా మమతామృతాన్నే మనపై వర్షిస్తుంది. ఆశ్చర్యమేమంటే భగవంతునికి మనం సర్వసమర్పణ చేయాలంటారు. అమ్మ మాత్రం బిడ్డలకు తల్లే అర్పణ ఔతుంది అంటుంది.
“పండితః సమదర్శినః” అంటే అందరినీ సమానంగా చూడటం అని అర్థంకాదుట. అందరిలో అన్నిటా ఉన్న భగవంతుని చూడటం అని అర్థం అన్నారు. తల్లి కనుక అమ్మ సమభావన అంటే ఎవరికి ఎంత కావాలో అది ఇవ్వటం అట. ఒకడు గిద్దెడు బియ్యం. వండిందే తినగలడు, ఒకడు సోలెడు, ఒకడు తవ్వెడు. తినగలడు. ఎవరికి ఎంత కావాలో అలా పెట్టటం సమభావన అని చెప్పింది.
ఒక బిడ్డ వచ్చి మాకు మా ఉద్యోగాలు, మా సంసారాలు సర్వస్వం – మా బ్రతుకు మాకు ముఖ్యం. నీకు ఏమీ సరెండర్ చేయలేని స్వార్థజీవులం అన్నాడు. అప్పుడు అమ్మ “నీవు, నీ కుటుంబం అందరూ నా బిడ్డలే నాన్నా! నాబిడ్డలకూ చెందినట్లే. స్వార్థం అన్న ప్రసక్తిలేదు. ఏది చేసినా నాకు చేస్తున్నానని శ్రద్ధగా, ప్రేమగా చేయి” అని చెప్పింది. అదీ అమ్మ ప్రేమ. అంతా ఆత్మగా తోచటమే ఆత్మసాక్షాత్కారం.
అమ్మా! సృష్టి అంతా నీ సంతానమే అయితే కొందరికి కష్టాలు, కొందరికి దుఃఖాలు, కొందరు ధనవంతులు కొందరు బీదవారు, కొందరికి అకాలమరణాలు ఇవన్నీ ఇలా జరగటమేంటి? తల్లికి బిడ్డలందరూ హాయిగా ఉండాలని ఉండదా? అని అడిగారు. అప్పుడు అమ్మ కష్టాలూ, సుఖాలూ నా బిడ్డలు కాదా! వ్యాధి మిమ్మల్ని చంపుతున్నదా? మీరు చేసే పాపపుణ్యాలవల్ల ధనమూ బీదరికమూ వస్తున్నవా? ఎన్నో త్యాగాలు చేసినవారికి, దానాలు చేసినవారికి, మంచిపనులు చేసిన వారికీ కష్టాలు తప్పటం లేదే! అంటే శక్తియొక్క స్వభావమే అది నాన్నా! వైవిధ్యమే సృష్టి స్వభావం. నీ కర్మవల్ల నీవు పుట్టడం లేదు. కర్మ నీవు చేయటం కాదు. వాడు చేయించటమే. దైవం జన్మ. యిచ్చేటప్పుడే నీకు జరగాల్సినవన్నీ వాడే ఇస్తున్నాడు. కార్యకరణాలకు కర్తలం మనం కాదు. అన్నింటికి అదే – వాడే. అసలు ఈ సృష్టిలో బాధలు లేనివారు లేరా – నాకు కనిపించలేదన్నది. ఇష్టం అయిష్టం ఉన్నప్పుడు అన్నీ ఉన్నట్లే. బాధలు లేని జీవితం ఏం జీవితం? బాధలు లేకపోతే జీవితమూ కాదు. ఈ బాధ, ఈ కష్టము సుఖము అన్నీ వాడుచ్చేవే అని దాని ఫలితాన్ని వాడికి వదిలివేస్తే మనకు, మనస్సుకు బాధ ఉండదు. అదే గీతలో కృష్ణుడు చెప్పింది. అమ్మ చెప్పింది. అదే అయితే అమ్మ అన్నది అదీ నీ చేతులలో ఉంటేగా! అదీ తనివ్వాల్సిందే మరి నీవు ఇవ్వవచ్చుకదా! అంటే. ఇవ్వాలనుకున్నపుడు ఇస్తాను అన్నది. అదీ మనకు తరుణం వచ్చినపుడు ఇస్తుంది. అందుకే అమ్మను నీవు నన్ను రక్షించావు. నీవు ఉద్యోగ మిచ్చావు. నీవు బిడ్డలను ఇచ్చావు. ఆరోగ్యాన్నిచ్చావు అంటే అమ్మ ఏమీ తనపై పెట్టుకోకుండా శరీరంతో వచ్చింది కనుక ఆ ‘తరుణం’ వచ్చింది నాన్నా! అని తను తప్పుకుంటుంది. చిదంబరరావు తాతగారు అన్నీ మరుగేనా? అంటే, అదే నా విధానం తాతగారూ! అంటుంది.
ఒకసారి రాజుపాలెం శేషుకు అమ్మవారు పోసి చాలా ప్రమాదకరంగా ఉన్నదని తెలిసిన హైమ అమ్మతో అన్నయ్యకు తగ్గించమని, ఆరోగ్యాన్ని ప్రసాదించమనీ అర్జించింది. నీవే తగ్గించవచ్చుగా అన్నది అమ్మ. నాకు చేతయితే నీ దాకా రావటం ఎందుకు అన్నది హైమ. ఏమో ఆరోజూ ముందు ముందు రావచ్చు అన్నది అమ్మ, అలాగే అర్తులపాలిట కొంగుబంగారమై, కల్పవృక్షమై, కామధేనువై కోరిన కోర్కెలు తీరుస్తున్నది నేడు..
మళ్ళీ అదే ప్రశ్న ఈ కోరటాలు, తీర్చటాలు కూడా ఇన్మనిచ్చేటప్పుడే మన ముఖాన వ్రాసి పంపిస్తున్నదా? అంతేనేమో! కాకపోతే అమ్మే కొందరికి హైమాలయంలో ప్రదక్షిణలు చేయమనీ, వెయ్యి కొబ్బరికాయలో, నూరు కొబ్బరికాయలో కొట్టుకో నీ కష్టం తీరుతుందనో చెప్పి చేయించినట్లు కనిపించే సంఘటనలు కనిపిస్తున్నాయి. కదా! ఇక్కడ ఏది చేసినా గోడకు బంతి కొట్టినట్లే అన్నది. బంతి కొట్టడాలు కొట్టించడాలు అన్ని అమ్మ చేతలలోనే.
ఇవన్నీ కూడా అమ్మ ఇచ్చే ప్రేరణలో, తరుణంలో భాగాలే ననిపిస్తున్నది. అంటే అన్నీ మనచేతుల్లో ఏం లేదు. పైవాడి చేతల్లోనే అనేది స్పష్టంగా చూపిస్తున్నది.
అందుకే సాధన నీ చేతుల్లో లేదు వాడు చేయిస్తేనే చేయగలవు. ఈ మధ్య నేను “అంతర్ముఖ పంచశతి” అని అయిదు వందల పద్యాలు నన్ను నీలోకి త్వరగా చేర్చుకో అని అభ్యర్థిస్తూ వ్రాశానని అనుకున్నాను. అని ముఖంగా భావన చేయటమే అంతర్ముఖ చేయకుండా ఉండటంకూడా, నీ చేతులలో లేడు చేస్తావు, పద్యాలు వ్రాయకుండా ఉండలే వ్రాస్తావు. ఒక ఊరివారు వచ్చి మా ఊళ్ళో దేవాలను, కట్టాలనుకుంటున్నాం. మా వల్ల కావటం లేదు. దయచూడమ్మా! అంటే అమ్మ అక్కడ కట్టలేకపో గుండెలో కట్టుకో నాన్నా! నా దయ సర్వవేకదా స ఉంటుంది అన్నది. అమ్మను అర్ధం చేసుకోవటం కష్టమో అంత తేలిక. ఏదైనా ఆ అనుభవం అమ్మ ఇవ్వాల్సిందే.
తాన్ సేన్ ఒక మహాగాయకుడు. ఆస్థానంలో ఉన్నాడు. ఒక గోచీ పాతరాయుడు మ నం చేస్తున్నాడు. తాన్ సేన్ పాటక గొప్పగా ఉన్నది. ఆమాటే అక్బర్ అన్నాడు. తాన్సేన్ అవును ప్రభూ నేను ఢిల్లీశ్వరుని కొరకు చేస్తున్నాను. అతడు జగదీశ్వరుని కొరకు గాను చేస్తున్నాడు కదా! అన్నాడు. అదీ కావలసినది.
ఏతావాతా తెలుస్తున్నదేమిటంటే ఏదైనా. ప్ర భావనైనా అమ్మ ఇవ్వాల్సిందే. మనం ఏమి చేసినా అమ్మ ఇచ్చినదే చేస్తున్నాం. మంచిగాని చెడుగాని అవి అన్నీ అమ్మార్పణంగా సమర్పిస్తే దాని ఫలితాలు అమ్మని, మనవి కావనేది సత్యం.
ఇదే విషయం విని అమ్మతో కొమరవోలు.. సుబ్బారావు గారు మాట్లాడుతూ అలా అని వదిలితే పాపాలు హింసలు చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు కదా! అంటే అమ్మ నీవు చేసే పాపపుణ్యాలకు వచ్చే ఫలి నేనే భరిస్తాను. నీకు ఒక కత్తి ఇస్తాను. ఎంతమందికి చంపగలవో చంపిరా అన్నది. అప్రతిభుడైనాడు ఆయను మనమూ అంతే అమ్మను ప్రార్ధించటం తప్ప చేయగలిగిందేం లేదు; అదీ మన చేతులలో ఉంటే, లేక అమ్మ మనకు ప్రసాదిస్తే, సూత్రధారి అమ్మ పాత్రధారులం మనం,