1. Home
  2. Articles
  3. Viswajanani
  4. కనుగొంటి – కనుగొంటి

కనుగొంటి – కనుగొంటి

Omkaranamda Giri Svami
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : January
Issue Number : 1
Year : 2021

కనుగొంటి కనుగొంటీ

ఆదిఅంతములేని అమ్మతత్త్వముగంటి

 విశ్వాత్మకంబైన పరమతత్త్వముగంటి ॥ కనుగొంటి||

ఆధారమేయౌచు అవకాశమేయౌచు

 శుక్లశోణితకులము గౌరవము శోభిల్లు

విదితాత్మమహితాత్మపరమమౌఅమ్మనూ॥కనుగొంటి॥

 నీలిమేఘపుచీర రక్తవర్ణపురవిక 

ప్రభవించుచంద్రునీ ఫుల్లనేత్రపుకాంతి 

ఆదిత్యవిభవంపుసౌరునే మీరంగ 

మరుగునే గురువుగా మనసార కనుగొన్న 

మహితాత్మయౌయమ్మ ప్రేమవీచికలెన్నొ ॥ కనుగొంటి॥ 

ఆత్రేయమౌకాంతి అనసూయమౌశక్తి

 భూమినేరక్షింప భ్రాంతినే తొలగించ

బ్రహ్మమేతానౌచు నేనైననేనుగా

అన్నింటినీ మరచి అందరౌ అమ్మనూ ॥కనుగొంటి॥ 

వికచాబ్జనయనయై ప్రణతార్తిహరయౌచు

 సౌకుమార్యంబులో మమకారమును మరచి

తరుణమే పరిధిగా చైతన్యమేయౌచు

జీవితము జీవనము

మాధుర్యమును తెలిసి

రమణీయతత్త్వాన నటియించి రమియించి

 వలపు తలపులలోన మదిలోన ఇలలోన

తనకన్న వేరవని విశ్వతత్త్వముగంటి ॥కనుగొంటి॥

కనుగొంటికనుగొంటీ

అమ్మనూ కనుగొంటి కనుగొంటీ

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!