1) ఈనాడు : (16-6-21) వెలంపాలెంలోని చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి, చంద్రశేఖరభారతీస్వామి, స్మారకట్రస్ట్, వేదపాఠశాలల ఛైర్మన్ శ్రీ బులుసు లక్ష్మీప్రసన్న సత్యనారాయణ శాస్త్రి (85) కరోనాతో కన్నుమూశారు. ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాల్లో ముందుండే శ్రీ సత్యనారాయణశాస్త్రి మృతి తీరని లోటని వేదపాఠశాల సిబ్బంది విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర బి.సి. సంక్షేమ శాఖా మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శ్రీ శాస్త్రిగారి మృతికి సంతాపం తెలిపారు.
2) సాక్షి : (16-6-21) వెలంపాలంలోని శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీస్వామి, చంద్రశేఖర భారతీస్వామి స్మారక ట్రస్టుకు చెందిన వేదపాఠశాల ఛైర్మన్ శ్రీ బులుసు లక్ష్మీప్రసన్న సత్యనారాయణ శాస్త్రి మంగళవారం మృతి చెందారు. ఈయన గుంటూరుజిల్లా జిల్లెళ్ళమూడి అమ్మ ఆశ్రమ అభివృద్ధి కమిటీ సభ్యుడిగా కృషిచేశారు. మాజీ ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డిలకు సన్నిహితంగా ఉండేవారని, వారికి నీటిపారుదల రంగ అభివృద్ధికి సలహాలు ఇచ్చేవారని, ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలకు ఎన్నో సేవలు అందించారని వారి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శాస్త్రిగారి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.