“అసలు ఆ పదం కృష్ణుడు కాదు, గృష్ణుడు”;
“గృష్ణుడంటే గుణము లన్నింటికి ఆధారమయిన వాడు” – అని నిర్వచించింది అమ్మ. అమ్మ మాటలు చిదంబరరావు గారికి సరిగా వినిపించక ‘గణితమా?’ అని అడిగారు. “ఔను. గణితమే” అని నిర్ధారించింది సమన్వయ ధీశక్తి అమ్మ. సుదీర్ఘమయిన వివరణ కూడా ఇచ్చింది.
-“అసలు వీటన్నిటికీ కదలిక, శబ్దమే ఆధారం” అన్నది ఆ సందర్భంగా. Phonetics ప్రకారం క / k, గ /g/ అనేవి velar plosives. ‘క’ voiceless sound, ‘గ’ voiced sound. (Both are homo organic sounds which means they have the same place of articulation). ‘గ’ శబ్దం వినబడునంత స్పష్టంగా ‘క’ శబ్దం వినపడదు. ‘క’ శబ్ద ఉత్పత్తిలో vocal cords vibrate కావు. అంతేకాదు. “గొప్పస్థితి గల వానిని ఘనస్థుడంటారు. అంటే గుండెలోతు, మనసు లోతు, ఆలోచన లోతు గల మనిషి. ‘గ’ అనే అక్షరం మీద నాకు తోచిన అర్థం ఇదే” అని అద్భుతంగా వివరించింది అమ్మ.
“సృష్టి కూడ గణితమే” అనే అమ్మ ప్రబోధానికి ఒకించుక వివరణ:-
– “అంతకూ కర్త కనుక గృష్ణుడన్నాను” అనేది అమ్మ వాక్యం. గణిత శాస్త్ర ముఖ్య లక్షణం సృజనాత్మకత (creativity). 4+6=10 అనే సమీకరణంలో 10 సమాధానంగా రాబట్టడానికి వేల ఉదాహరణల నివ్వవచ్చు. (True spirit of Mathematics) గణిత శాస్త్ర ప్రధాన తత్వం-ఒక సమస్య (Problem) ని ఏదో ఒక విధంగా సాధించటం (solve) కాదు, ఎన్నో విధాలుగా సాధించటం (Multiple ways of solving a problem). సత్యాన్వేషణకి భక్తి, జ్ఞాన, వైరాగ్య, నేతి, నాస్తిక వంటి అనేక మార్గాలు ఉన్నాయి. Betrand Russel అంటారు “Mathematics, rightly viewed, possesses not only truth but supreme beauty” అని.
– భగవంతుడు అనంతశక్తి (Infinite) అనే గుణవైభవాన్ని గణితశాస్త్రం చాలా సులభంగా వివరిస్తుంది. 1042 = 5 అనే సమీకరణం (Equation) అర్ధం – ఐదు రెళ్ళను కలిపితే 10 – అని. మరి 10 +0= ఎంత? ఎన్ని సున్నాలు కలిపితే 10 అవుతుంది? సమాధానం లేదు. దీనిని Not defined అనీ, అనంతము (Infinity) అనీ అంటాము. త్రిశక్తి రూపిణి జగన్మాత శక్తి అనంతము, అనిర్వచనీయము, అగ్రాహ్యము.
ఒక సందర్భంలో అమ్మ ఒక వలయం (Circle) గీసి, “ఈ సున్నాలో ముఖ్యమైన ప్రదేశం ఏది?” అని అడిగింది. ఆ సందర్భంగా సున్నా లోపల, సున్నా పైన, సున్నా వెలుపల, కేంద్రము ఎన్నో అంగాలు తెరమీదికి వచ్చాయి. “అంతా ముఖ్యమే” అన్నది అమ్మ. దీనిని గణిత శాస్త్రంలో 3 విభిన్న బిందు సమితులుగా (set theory) వివరిస్తారు.
గణిత శాస్త్రంలో సంజ్ఞానాత్మక ప్రయోగం (use of symbols) ఒక ప్రత్యేకత. x +10=50 అనే సమీకరణంలో x =40. ఇంకా 4, T, p & ….. వంటి సంకేతాల్ని వాడతాం. ఆధ్యాత్మిక సాధనలో జడము, చైతన్యము, సత్యము, క్షరము – అక్షరము… వంటి పారిభాషిక పదాలను వాడతాం.
– తెలిసిన దానిని (Known Quantity) ఆధారంగా చేసికొని తెలియని దానిని (Unknown Quantity) తెలుసుకుంటాం – అనేది గణితశాస్త్ర Problem solving technique. “కనిపించేదంతా అదే అయినపుడు కన్నులు మూసుకోవడం ఎందుకు?” అనీ, “సంసార బాధ్యతలూ ఆధ్యాత్మిక సాధనే” అని స్పష్టంచేసింది. అమ్మ.
– “భాగము అన్నా లెక్కే (గణితమే)” – అన్నది అమ్మ తన వివరణలో. భిన్నములు (Fractions), దశాంశ భిన్నములు (decimal fractions) శాతములు (percentages) అని 3 chapters గా బోధిస్తాం. అభ్యసిస్తాం.
కానీ, తర్కించుకుంటే అవన్నీ ఒకటే – 1/2 = 0.5=50% అని తెలుస్తుంది. “అసలు ఇది ఏమిటి?” అని తర్కించుకోవాలి అని అమ్మ ప్రబోధించింది. “ఈ చెట్టు దేవుడే కానీ దేవుడు చెట్టు మాత్రమే కాదు” – అని విశ్లేషణ చేస్తుంది.
– “అసలు వీటన్నిటికీ కదలిక, శబ్దమే ఆధారం” అన్నది అమ్మ. శబ్దము, శబ్దార్ధములకు అమ్మ ఎంతో ప్రాధాన్యత నిచ్చింది. నాలుగేండ్ల పసిప్రాయంలోనే కృష్ణుడు, సత్యభామ, గోపిక, రాధ, త్రిమాతలు, త్రిమూర్తులు, రాముడు, సీత, అత్రి, అనసూయ పేర్లను వాటి అర్థాల్ని లోకోత్తరంగా చాటింది.
సామాన్యంగా అర్ధం కాని Great Linguist అమ్మ. అమ్మ అనేక భాషలలో సంతకాలు చేసింది. అం ఆ, AMA, 300 T అని తెలుగు, ఇంగ్లీషు, సంస్కృత భాషలలో చేసింది ఒక సందర్భంలో. పలు భాషలలో చేసింది కానీ ఆ భాషలు నాకు తెలియవు.
భాషోత్పత్తికి సంబంధించిన ధ్వనులను speech sounds (phonemes) అనీ, వాటిని కాగితము మీద చూపే ఆకృతులు – అక్షరములను (letters – graphemes) అనీ అంటారు. Letters అనేవి speech sounds కి సంకేతాలు.
‘అమ్మ’ అనే తెలుగు పదాన్ని Translate చేస్తే English లో Mother అనీ, సంస్కృతంలో ‘మాతా’ అని అవుతుంది. కానీ, ఇక్కడ అమ్మ చేసినది Transliteration లో ఒక విశేష ప్రక్రియ. ‘అమ్మ’ అనే పదంలో ‘మ్మ’ ఒక ద్విత్వాక్షరం (doubling sound). English are doubling sound . Plotted, dropped, pernined… వంటి పదాల్లో, ఒక్క ‘t, p, n,’ మాత్రమే పలుకుతాం. వాస్తవానికి తెలుగులో ‘అమ్మ’ అనీ, Englishలో AMMA అనీ, సంస్కృతంలో 31HI అనీ వ్రాయాలి. కానీ ‘అమ్మ’ అనే పదాన్ని AMA అనీ, 3HI అనీ ఎందుకు వ్రాసింది? ఆ శబ్దము Same Sound, Same place of articulation, స్వరస్థానం ఒకటే అని సూచించడానికి.
అమ్మ సకల వాఙ్మయ స్వరూపిణి, వ్యక్తావ్యక్త పరతత్త్వం,
అం ఆ
AMMA
అమ్మ సంతకాలు (పలుభాషలు)