స్వరూపలలిత, స్వభావమధుర, కారుణ్యమూర్తి, దయాస్వరూపిణి, శ్రీ హైమవతీదేవి 79వ జయంతి వేడుకలు జిల్లెళ్ళమూడిలో, ప్లవనామ సంవత్సర కార్తీక బహుళ షష్ఠి, నవంబరు 25వ తేదీన శ్రీ విశ్వజననీ పరిషత్ ఆధ్వర్యంలో మహావైభవంగా నిర్వహించబడినాయి.
ప్రతి సంవత్సరం లాగే కార్తికపౌర్ణమి నుండి బహుళ షష్ఠి వరకూ హైమవతీ జనయిత్రీ వ్రతములు, ఆశ్వయుజ పాడ్యమి నుండి కార్తీక బహుళ షష్ఠి వరకూ అమ్మ నామ సప్త సప్తాహాలు జరిగాయి.
అలాగే హైమవతీ దేవి పారాయణ జరపటం సంప్రదాయంగా అనేకమంది సోదరీ సోదరులు పారాయణలో పాల్గొన్నారు. సోదరీ సోదరులు 64 లక్షల 25 వేలు ప్రదేశాలలోని సోదరీ సోదరులు ఆ లక్షల అరవై అయిదు వేలు అయింది. తొంభైవేలు పారాయణ చేయటం విశేషం.
జన్మదినం నాడు లలితా కోటినామ వస్తున్నది. ఈ సంవత్సరం కూడా ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో కోటినామ జిల్లెళ్ళమూడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న పారాయణ చేస్తే, పరోక్షంగా, వివిధ సంకల్పంతో చేసిన పారాయణ సంఖ్య 98 వెరసి మొత్తం ఒక కోటి అరవైరెండు లక్షల
జిల్లెళ్లమూడిలో ప్రతిసంవత్సరం శ్రీ లలితా కోటి నామపారాయణ చేయటం సంప్రదాయంగా వస్తున్నది. గత రెండు సంవత్సరాల నుండీ ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల కారణంగా జిల్లెళ్లమూడి రాలేకపోయిన సోదరీ సోదరులు అదే సమయంలో వారి వారి ప్రదేశాలనుండి అకుంఠిత దీక్షతో పారాయణ చేసి ఈ పారాయణ కార్యక్రమాన్ని విశ్వవ్యాప్తం చేయటం అమ్మ కరుణా విశేషం.
హైమక్కయ్య జన్మదినమయిన కార్తీక బహుళ షష్ఠి నాడు (నవంబరు 25) హైమవతీ జనయిత్రీ వ్రతసమాప్తి, హైమాలయం వంటశాలలో శుచిగా, పవిత్రంగా వండిన 79 రకాల పిండివంటలతో నివేదన జరిగింది.
ఈ సందర్భంగా హైదరాబాదు వాస్తవ్యులయిన సోదరులు శ్రీ వఝ ప్రసాదరావు గారి కుటుంబ సభ్యులు 79 రకాల పిండివంటలు నేతితో చేయించి, జిల్లెళ్ళమూడి తీసుకువచ్చి హైమక్కయ్యకు సమర్పించారు. వారు 159 చీరలు తీసుకువచ్చి జిల్లెళ్ళమూడి ప్రాచ్యకళాశాల విద్యార్థినులకు, ఇంకా కొందరు కన్యలకు హైమక్కయ్య ప్రసాదంగా ఇచ్చారు.
సద్గతిప్రద, క్షిప్రప్రసాదిని, మహనీయ, దయామూర్తి అయిన శ్రీ హైమవతీదేవి శుభాశీస్సులు సర్వులపై సదా సర్వదా వర్షించుగాక.