అన్నదాతా సుఖీభవ!
అనసూయ మాతా జయీభవ!
- 26-6-2021 న నాచారంలోని ‘Sadhana Institute for mentally challenged children’లో నిర్వహించారు. అమ్మకు పూజాదికములను నిర్వర్తించి, అందరికీ అమ్మ (అన్న) ప్రసాదాన్ని పంచారు. చి.సౌ.కిరణ్మయి (USA) తన 50వ జన్మదిన శుభసందర్భంగా ఈ సేవాకార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. విశేషమేమంటే – శ్రీమతి కిరణ్మయి శ్రీ బి.వి. రామశాస్త్రిగారి కుమార్తె స్నేహితురాలు. ఆ సోదరి అమ్మ కృపకు, రక్షణకు ప్రత్యక్ష సాక్ష్యం. అమ్మ అనుగ్రహంతో Brain injury ప్రమాదం నుంచి గట్టెక్కింది.
- 30-6-2021 న మోతీనగర్ లోని ‘అఆఅఆ’ అనాధ ఆశ్రమం (అమ్మ ఆప్యాయత, అనురాగం, ఆసరా అనాధ ఆశ్రమం)లో నిర్వహించారు. అమ్మ నామ సంకీర్తన, పూజాదికములను నిర్వర్తించి అమ్మ (అన్న) ప్రసాదాన్ని ఆశ్రమ వాసులందరకూ ఆదరంగా అందించారు. తంగిరాల సోదరులు శ్రీ టి.ఎస్. శాస్త్రి గారు, శ్రీ టి. రామమోహనరావు గారలు తమ మాతృమూర్తి శ్రీమతి తంగిరాల దమయంతి గారి పుణ్యతిధిని పురస్కరించుకుని ఈ సేవాకార్యక్రమానికి ఆర్ధిక సహాయాన్ని అందించారు.
- 30-6-2021 న నాగోల్లోని ‘నిర్వాణ ఫౌండేషన్’ (పేద, వృద్ధుల ఆశ్రమం)లో ప్రేమార్చన నిర్వహించారు. శ్రీ టి.ఎస్. శాస్త్రి గారు తమ మాతృమూర్తి శ్రీమతి దమయంతిగారి పుణ్యతిథి సందర్భముగా ఆశ్రమవాసులందరికీ ఆదరంగా అమ్మ (అన్న) ప్రసాదాన్ని అందించారు. శ్రీమతి తంగిరాల దమయంతి గారంటే సాక్షాత్తూ హైమక్కయే నోరారా ‘అమ్మా’ అని పిలిపించుకున్న పుణ్య చరిత. ఆమె – హృదయవచశ్శరీరముల వెలుగొందేది మన అనసూయమ్మే.
10-7-2021 న నాగోలులోని Vatsalyam Voluntary Organisation లో ప్రేమార్చన నిర్వహించారు. ఆశ్రమ బాలబాలికలు శ్రద్ధగా అమ్మ నామ సంకీర్తన పూజాదికములు నిర్వర్తించారు. పిమ్మట అమ్మ (అన్న) ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ కె. లక్ష్మీనారాయణ, శ్రీమతి కళ్యాణి దంపతులు తమ కుమారుడు చి|| పవన్కుమార్ జన్మదిన శుభసందర్భంగా ఈ సేవాకార్యక్రమానికి ఆర్ధిక సహాయాన్ని అందించారు.
- 14-7-2021 న నల్లగండ్లలోని ‘శిశుమంగళ్’ అనాథ బాలబాలికల ఆశ్రమంలో ప్రేమార్చన నిర్వహించారు. బాలబాలికలందరూ అమ్మ నామం చేసి, అమ్మ పూజాదికములలో పాల్గొని, అమ్మ (అన్న) ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ కె. లక్ష్మీనారాయణ గారు తమ సతీమణి శ్రీమతి కళ్యాణి గారి జన్మదిన శుభసందర్భంగా ఈ సేవాకార్యక్రమానికి ఆర్ధిక సహాయాన్ని అందించారు.
- 18-7-2021 న మోతీనగర్లోని ‘అఆఅఆ అనాథ ఆశ్రమం’ (బాలురు) (అమ్మ ఆప్యాయత, అనురాగం, ఆసరా అనాధ ఆశ్రమం)లో ప్రేమార్చన నిర్వహించారు. ఆశ్రమవాసులందరూ. అమ్మనామ సంకీర్తన, పూజాదికములు నిర్వర్తించి, అమ్మ (అన్న) ప్రసాదం స్వీకరించారు. శ్రీ ఎమ్.వి.ఆర్.సాయిబాబు, శ్రీమతి అనంత సీతాలక్ష్మి దంపతులు తమ ప్రథమ పుత్రిక శ్రీమతి బాలాత్రిపుర సుందరి (శ్రీ మల్లాది సత్యనారాయణ గారి ధర్మపత్ని) జన్మదిన శుభ సందర్భంగా ఈ సేవాకార్యక్రమానికి ఆర్ధికసహాయాన్ని అందించారు.
7.18-7-2021 న నాగోల్లోని ‘నిర్వాణ ఫౌండేషన్’లో ప్రేమార్చన నిర్వహించారు. ఆశ్రమవాసులైన పేదవృద్ధులు, బాలబాలికలు అమ్మకు పూజాదికములు నిర్వర్తించి అమ్మ (అన్న) ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ ఎమ్.వి.ఆర్. సాయిబాబు, శ్రీమతి అనంత సీతాలక్ష్మి దంపతులు తమ ప్రధమ పుత్రిక శ్రీమతి మల్లాది బాలాత్రిపుర సుందరి జన్మదిన శుభసందర్భంగా ఈ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం అందించారు.