అన్నదాతా సుఖీభవ!
అనసూయ మాతా జయీభవ!
- 26-5-2021న నల్లగండ్లలోని ‘అనాధ బాలబాలికల ఆశ్రమం’లో ప్రేమార్చన నిర్వహించబడింది. అమ్మ నామ సంకీర్తన పూజాదికములను భక్తిశ్రద్ధలతో బాలబాలికలు నిర్వర్తించారు. అనంతరం అందరికీ అమ్మ (అన్న) ప్రసాద వితరణ జరిగినది. శ్రీ ఎమ్.వి.ఆర్. సాయిబాబు, శ్రీమతి అనంత సీతాలక్ష్మి దంపతులు తమ మనవడు చి.భాస్కర చాణక్య అద్వైత్ (శ్రీ పవన భాస్కర్, శ్రీమతి శిరీషకుమారి దంపతుల కుమారుడు) జన్మదిన శుభ సందర్భంగా ఈ సేవాకార్యక్రమానికి ఆర్థిక సహాయాన్నందించారు.
- 27-5-2021న నారాయణగూడలోని ‘అనురాగనిలయం’లో ప్రేమార్చన నిర్వహించబడింది. ఆశ్రమ నిర్వాహకులు, ఆశ్రమ వాసులు అమ్మకి భక్తిశ్రద్ధలతో పూజాదికములు నిర్వహించారు. అనంతరం అమ్మ (అన్న) ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ ఎమ్.వి.ఆర్.సాయిబాబు, శ్రీమతి అనంతసీతాలక్ష్మి దంపతులు తమ కుమార్తె శ్రీమతి శిరీష (జర్మనీ) పుట్టినరోజు సందర్భంగా ఈ సేవాకార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించారు.
- 28.5.2021న నల్లకుంటలోని “గాయత్రీ బ్రాహ్మణ వృద్ధాశ్రమం’లోను, మేడిపల్లిలోని అనాధ బాలబాలికల ఆశ్రమం ‘మాతృశ్రీ అభయ ఫౌండేషన్’లోను ప్రేమార్చన నిర్వహించారు. అమ్మకు పూజాదికములు నిర్వర్తించి, అమ్మ (అన్న) ప్రసాదాన్ని ఆశ్రమ వాసులందరూ స్వీకరించారు. శ్రీ వఝ లోకాదిత్య మల్లికార్జునప్రసాద్ పుణ్యతిధి సందర్భంగా వారి కుమారుడు శ్రీ వఝ శివరామకృష్ణ, ధర్మపత్ని శ్రీమతి సీతల ఆర్థిక సహాయంతో ఈ ప్రేమార్చనలు నిర్వహించారు.
- 5-6-2021 న నల్లకుంటలోని బ్రాహ్మణ వృద్ధాశ్రమంలో ప్రేమార్చన నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పద్మనాభశర్మగారు భక్తిశ్రద్ధలతో అమ్మ పూజాదికములు నిర్వర్తించారు. అనంతరము అందరికీ అమ్మ (అన్న) ప్రసాదం అందించబడింది. శ్రీ బి.వి. రామశాస్త్రి గారు మరియు డాక్టర్ బి.యస్.శర్మగారలు తమ తల్లిగారు శ్రీమతి బి. మహాలక్ష్మమ్మ గారి పుణ్యతిథి సందర్భంగా . ఆర్థిక సహాయం అందించారు.
- 6-6-2021న సరూర్ నగర్ లోని ‘ఆదరణహోమ్’లో ప్రేమార్చన నిర్వహించారు. అందు 80 మంది బాలురు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమ నిర్వాహకులు శ్రీ మాధవరావు గారు భక్తిశ్రద్ధలతో అమ్మ పూజాదికములు నిర్వర్తించి, అందరికీ అమ్మ (అన్న) ప్రసాదాన్ని అందించారు. శ్రీ తంగిరాల రామ్మోహనరావు గారు శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులు తమ మనుమరాలు కుమారి తనుశ్రీ (అమెరికా) జన్మదిన సందర్భంగా ఈ సేవాకార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించారు.
- 13-6-2021 న ‘ఆదరణఅనాధ ఆశ్రమం’ లో ప్రేమార్చన నిర్వహించారు. ఆశ్రమవాసులందరూ అమ్మ పూజాదికములలో భక్తిశ్రద్ధలతో పాల్గొని, అమ్మ (అన్న) ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీశేషయ్య లింగం గారి కుమార్తె శ్రీమతి బి. రాజరాజేశ్వరి (చాంద్రమానం ప్రకారం) షష్టిపూర్తి సందర్భంగా ఈ సేవాకార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించారు.
- 14-6-2021 న ‘మాతృ అభయ ఫౌండేషన్’ అనాధ బాలికల ఆశ్రమంలో ప్రేమార్చన నిర్వహించారు. బాలికలు భక్తిశ్రద్ధలతో అమ్మ పూజాదికములలో పాల్గొని, అమ్మ (అన్న) ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీకారంచేటి లక్ష్మీనారాయణ గారు 70 వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా ఈ సేవాకార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించారు.
- 15-6-2021న ‘ఆదరణ అనాధ ఆశ్రమం’లో ప్రేమార్చన నిర్వహించారు. ఆశ్రమ వాసులు శ్రద్ధాభక్తులతో అమ్మపూజాదికములలో పాల్గొన్నారు. ఆంగ్లమానం ప్రకారం శ్రీమతి బి. రాజరాజేశ్వరి గారు తమ షష్టిపూర్తి సందర్భంగా ఈ సేవాకార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించారు. అందరికీ అమ్మ అన్నప్రసాదాన్ని అందించారు.
- 19-6-2021న సరూర్నగర్లోని ‘మైత్రేయి ఫౌండేషన్’ లో ప్రేమార్చన నిర్వహించారు. పేదవృద్ధులు ఇందు ఆశ్రయం పొందుతున్నారు. అమ్మకు అర్చనాదికములు భక్తిశ్రద్ధలతో నిర్వర్తించి ఆశ్రమ నిర్వాహకురాలు కుమారి శరణ్య అందరికీ అమ్మ (అన్న) ప్రసాదాన్ని పంచారు. శ్రీ తంగిరాల రామమోహనరావు శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులు తమ వివాహ వార్షికోత్సవ శుభసందర్భంగా ఈ సేవాకార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించారు.