అందరింటి సోదరులలో మహనీయులు డా. SII. సుబ్బారావు గారు ఒకరు. వీరు నెల్లూరు డాక్టర్గా అందరికీ సుప్రసిద్ధులు. వీరు డాక్టర్ గా అమ్మకు సేవలు అందించించిన గొప్ప వ్యక్తి. మందులు సమర్పిస్తూ, “నీ శారీరక బాధ నుండి నీవే ఉపశమనం పొందుతల్లీ” అని ప్రార్థించారు. “వైద్యో నారాయణో హరిః” అంటే, ‘వైద్యునిలోని వైద్యశక్తి పరమేశ్వరుడైన శ్రీహరి రూపమే కదా!’ (అన్ని నేనులు నేనైన నేను అమ్మ) నాలోని నీవే నీ శారీరక బాధను నీవే నయంచేసుకో తల్లీ అంటూ తనను తాను సమర్పించుకున్న ధన్యజీవి మన సుబ్బారావు అన్నయ్య.
సోదరులు శ్రీ జన్నాభట్ల శాస్త్రి అమ్మను త్రికరణ శుద్ధిగా ఆరాధించి, అమ్మ మాటల్ని అక్షరాలా ఆచరణలో పెట్టిన వ్యక్తి మన శాస్త్రి గారు. అమ్మ సేవలో తరించిన మహనీయులు. నవవిధ భక్తిమార్గాల్లో ఒక్కొక్కరూ ఒక్కొక్క భక్తి మార్గాన్ని అనుసరించి చరిత్రలో నిలిచిపోయిన మహనీయులు ఎందరో కలరు. కానీ, మన శాస్త్రి అన్నయ్యగారు మాత్రం ఈ తొమ్మిది మార్గాల్లో అమ్మను సేవించిన ధన్యజీవి.