తల్లి అంటే తొలి అని అర్థం. అమ్మ అప్పుడప్పుడు ప్రసంగవశాన చెప్పిన వివరణలు యీ శీర్షిక లో అందజేస్తాము. – సంII
కష్టసుఖాలు పెట్టేవి కావు
కష్టం సుఖం పడేవికాని పెట్టేవి కావు. ఒకరు సుఖ పెడుతున్నా దాన్ని అర్ధం చేసుకోకపోతే అదే కష్టం అనుకోవచ్చు.
ఒకడికి భార్యా, పిల్లలూ, ఇల్లూ, వాకిలి, కోరిన గుడ్డా, తిండీ అన్నీ ఉన్నప్పటికీ_వాడికి యివన్నీ పద్దనిపిస్తాయి. ఏ చెట్టు క్రింద నన్నా కూర్చుందామనుకుంటాడు. నాకు ఆ చెట్టు “దొరక్కపోతే దుఃఖ పడతాడు. ఒకడికి అ చెట్టుకూడా అక్కరలేక ఎవ్వరూ లేనిచోటు కావాలనుకుంటాడు. అది అందకపోతే వాడు ఏడుస్తాడు. ఒకడు చచ్చిపోవాలనుకుని బ్రతికివున్నానే అని వాపోతాడు. అది ఏదయినా సరే__లేనిదానికొరకు ఆశించి పొందలేకపోత దుఃఖం. ఉన్నది చాలనుకునేది సుఖం.