గుంటూరు జిల్లా, పొత్తూరు గ్రామంలో 8.2.1934న జన్మించారు. కన్నతల్లి దండ్రులు వెంకట సుబ్బయ్య, పన్నగేంద్రమ్మ. దత్తత తల్లిదండ్రులు గోపాలకృష్ణయ్య, సంపూర్ణమ్మ, సతీమణి సత్యవాణి – సంతానం ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు – సుప్రసిద్ధ దినపత్రికలు “ఈనాడు” “ఆంధ్రప్రభ”లకు ప్రధాన అమ్మతో పొత్తూరి వెంకటేశ్వరరావు సంపాదకులుగా చేశారు. ఆంధ్రప్రదేశ్ మరియు రామకృష్ణ అన్నయ్య ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ విభాగం చీఫ్ ఎడిటరుగా చేశారు. స్టేట్ కన్స్యూమర్స్ కోర్టు న్యాయమూర్తిగా మన్ జర్నలిస్టుగా ప్రసిద్ధి వహించారు. కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ చేశారు. జెంటిల్ పీఠానికి ధర్మాధికారిగా పనిచేశారు.
‘రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు’, ‘విధి నా సారధి’, అమ్మను గూర్చి ‘అంతా ఆమె దయే’ అనే గ్రంథం, ‘ఆధ్యాత్మిక పదకోశం’, ‘యతికులపతి’ అనే గ్రంథాలే కాక జర్నలిజానికి పాఠ్యపుస్తకాలుగా ఎన్నో ఎన్నో గ్రంథాలు వ్రాశారు. ‘శ్రీ విశ్వజననీ పరిషత్ అధ్యక్షులుగా మార్గదర్శనం చేశారు. ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు “నేను ముగ్గురమ్మల ముద్దుబిడ్డనయ్యా. కన్నమ్మ, పెంచినమ్మ, నన్నూ, మా అమ్మమ్మలను కూడా కన్నమ్మ జిల్లెళ్ళమూడి అందరమ్మ” అంటుండేవారు.
డాక్టర్ ప్రసాదరాయకులపతి గారితో కలసి మొదటిసారి జిల్లెళ్ళమూడి వచ్చారు. మల్లయుద్ధ, భారోద్ధరణ విద్యలు నేర్చారు. ప్రేమమూర్తి అమ్మతో అనుబంధం పెరగటం వల్ల హేతువాది ఆధ్యాత్మికవాది అయినారు. వేదాన్ని నమ్ముతారు. ధ్యానయోగి. మహోన్నత మానవీయ లక్షణాలతో నక్సలైట్లు, ప్రభుత్వంతో చర్చలు జరగటానికి తోడ్పడ్డారు. అమ్మపై అచంచల విశ్వాసంతో అమ్మ చేసే ప్రశాంత విప్లవ మహోద్యమంలో భాగస్వామియైనారు. పుట్టిన పొత్తూరుకు, ఉద్యోగంలో పైకి తెచ్చిన భాగ్యనగరానికి ఎంతో సేవ చేశారు.
జిల్లెళ్ళమూడిలో మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి, ఓరియంటల్ హైస్కూలు, హోమియో హాస్పిటల్ రావటంలో విశేషకృషి చేశారు. అమ్మతత్త్వాన్ని తెలియ చేసే ‘విశ్వజనని’, ‘మదర్ ఆఫ్ ఆల్’ పత్రికలకు గౌరవ సంపాదకులు. అమ్మతో సన్నిహితంగా మెలుగుతూ చర్చలు చేస్తూ అమ్మ వెంట హైదరాబాద్ నగరంలో బీదసాదల మురికి వాడలు, పాఠశాలలు, వైద్యశాలలు ఆదరించిన మానవతా మహోన్నతుడు.
పుంఖానుపుంఖంగా ఎన్నో సంపాదకీయాలు, వ్యాసాలు వ్రాసారు. సంపాద కీయాలకు సాహిత్య వాసన తెచ్చిన సంస్కార సంపన్నులు. శ్రీ వెంకటేశ్వరరావు గారు ఆరు దశాబ్దాల పైచిలుకుగా అమ్మ వద్దకు వస్తున్నారు. మితభాషి, హితభాషి. సౌమ్యభాషి అయిన వారు తమ రచనలలో సైతం క్లుప్తతను, పొదుపును పాటిస్తారు. ఏ పదాన్నైనా అర్ధవంతంగా వాడతారు. చిన్ననాటి నుండి దేనినీ గుడ్డిగా నమ్మరు. హేతువాద దృష్టి. అంతమాత్రాన నిరీశ్వరవాది కాదు. వేదాన్ని నమ్ముతారు. హోమాలు చేస్తారు. ధ్యానయోగి.
అమ్మ దేవత అని ఆయన ఒప్పుకోరు. నిజానికి అమ్మ కూడా తాను దేవతనని ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. చెప్పలేదా? అని గట్టిగా అడిగితే, మాటల సందర్భంలో ఒప్పుకొన్న సమయాలు కూడా లేకపోలేదు. అతిమానుష శక్తులు అమ్మ ప్రదర్శించలేదు. ఒకవేళ జరిగినా వాటితో తనకు సంబంధం లేదన్నది. అమ్మ మహిమాన్విత. “అమ్మ ఎక్కడ ఏమి జరుగుతున్నదో తను తలచుకుంటే చూడగలదు. సుదూర ప్రాంతాలలో మనం మాట్లాడుకున్న మాటల్ని వినగలదు. అమ్మకు భూత భవిష్యత్ వర్తమానాలనే తేడాలు లేవు. అన్ని కాలాలూ ఆమెకు వర్తమానమే. నాకు సైతం స్వంత అనుభవాలు కొన్ని ఉన్నాయి” అని కొద్దిగా ఉన్న ఆహార పదార్థాన్ని మరింతగా చేసిన సంఘటనలను ఆయన ఉదహరించారు కూడా. అందుకే “అనుభవాలు అసత్యమని అనుకోలేము” అన్నారు. “కానీ, మహత్తులను మించిన అమ్మ యొక్క మహోన్నత మానవీయ లక్షణాలకే నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను” అంటారు.
అమ్మది విశ్వ కుటుంబం. అమ్మ విశ్వజనని. సమాజానికి మేలుచేసే దేనినైనా ఆయన ఇష్టపడతారు. అటువంటిదే మంచి విశ్వాసం అంటారు. అమ్మలోని మానవీయ లక్షణాలు వారిని ప్రభావితం చేశాయి; అమ్మ ఏదైనా అనుభవించిందే చెప్పేది కనుక అమ్మ మాటలు మహావాక్యాలుగా ఆయన దర్శించారు. మనకు తెలియకుండానే మనలో అమ్మ తెచ్చిన మార్పును అమ్మ చేసినది ప్రశాంత విప్లవ మహోద్యమంగా గ్రహించ గలిగారు, మానవ ప్రయత్నం వల్ల గర్వభంగం చెందటమే తప్ప అంతా నిర్ణయం ప్రకారమే జరుగుతుందనేది స్పష్టంగా అర్థమయింది. అమ్మ మాట వృధా కాదు. అమ్మది తోలు నోరు కాదు తాలు మాట రావటానికి. 1957లో అమ్మ ఏడవ మైలువద్ద సింహద్వారం వస్తుందని చెప్పింది. ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత 1983లో ఆ నిర్మాణం. జరిగింది. అమ్మ ఏం చెప్పింది ఏం చేసింది అనే విషయం ఆయన ఆలోచించి ‘అందరూ కలసి బ్రతకటాన్ని, తనకున్న దానిలో ఇతరుల కింత పెట్టటాన్ని ప్రోత్సహించినట్లు కనిపిస్తుంది’ అన్నారు.
అమ్మ దేవాలయాలు దర్శించింది. దేవాలయాలు నిర్మించింది. అయితే ఈ విశ్వమంతా దేవాలయమేనని, దానికి ప్రతీకయే ఈ దేవాలయాలనీ, అమ్మ, బాపట్ల దేవాలయంలో చేసిన విచికిత్స దానికి తార్కాణమనీ వారి విశ్వాసం. అంతేకాక అమ్మదేవాలయాలు జిల్లెళ్ళమూడి, మన్నవలలోనే కాక చాలా ప్రదేశాలలో వస్తాయనీ, అమ్మను నమ్మినవారికి అవి పుణ్యక్షేత్రాలు, ఆరాధనా స్థలాలు అవుతాయని వారు చెప్పారు. విగ్రహారాధన కూడా ఒక ఆధ్యాత్మిక సాధన అని, సాధకులకు దైవం పట్ల భక్తిని శ్రద్ధను పెంపొందిస్తుందనీ, విశ్వాసాన్ని గట్టి పరుస్తుందని వారన్నారు. విగ్రహారాధన నచ్చనివారు తమదైన మార్గంలో సాధన చేసుకోవచ్చన్నారు.
అమ్మది అక్షరాలా లౌకికవాదం అంటూ సాంఘిక సమానత్వం ఆచరణలో ఎలా అమ్మ చేసి చూపించిందో చెప్పారు. సర్వసమ్మతమైనదే నా మతం అన్న అమ్మ ఎలా అన్ని మతాలవారినీ చేరదీసిందీ ప్రేమించిందీ వారి రచనలలో చూపారు. అయితే అమ్మ “లౌకికము ఆధ్యాత్మికము అంటూ రెండు లేవు నాన్నా! ఉన్నది ఒకటే రెండుగా కనిపిస్తుంది” అన్న దానిని శ్రీ పొత్తూరివారు కూడా అంగీకరిస్తారు.
“అమ్మ విశ్వకుటుంబిని. అపార కరుణామయి. ప్రేమస్వరూపిణి. ప్రేమ, వాత్సల్యాలు మాటలలో కాక అమ్మ చేతలలో నిరంతరం వ్యక్తమౌతూనే ఉన్నాయి”. ఇది ఆయన అమ్మలో గమనించింది. “మీరు నాలో మానవత్వాన్ని చూస్తారు, నేను మీలో దైవత్వాన్ని చూస్తాను” అన్నది అమ్మ. అసలు అమ్మ “సృష్టే దైవం” అన్నది. మనం సృష్టిలో భాగమే కదా! అంటారు వేంకటేశ్వరరావు గారు.
వెంకటేశ్వరరావు గారు బ్రహ్మసూత్రాలు చదివారు, ఉపనిషత్తులు చదివారు, పురాణాలు చదివారు, లౌకిక ఆధ్యాత్మిక గ్రంథాలెన్నో చదివారు. చదివింది ఏదైనా సునిశితంగా చదివారు. ఎంత చదవకపోతే ఆధ్యాత్మిక పదకోశం (ఇప్పటికి ఎవ్వరూ వ్రాయనిది) వ్రాయగలరు? జర్నలిజాన్ని గూర్చి వారు వ్రాసిన గ్రంథాలు జర్నలిజం కళాశాలలో పాఠ్యగ్రంథాలు.
“ఎవరి మార్గంలో వారు ఏదో చేయాలనుకుంటున్నారు. చేస్తున్నారు. ఒక్కొక్కసారి చేయలేకపోవటం కూడా ఉంటుంది. ఈ చేయటానికి చేయలేక పోవటానికి, అంతా ఆమె సంకల్పం ప్రకారమే జరుగుతున్నదనిపిస్తున్నది. ఇది నాకు అనుభవం నుంచి జనించిన విశ్వాసం” అంటారు వెంకటేశ్వరరావుగారు.
శ్రీ వెంకటేశ్వరరావుగారు జిల్లెళ్ళమూడిలో తన కల్యాణ వార్షికోత్సవ షష్టిపూర్తి సందర్భంగా అమ్మపూజతో పాటు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి పాదపూజ చేసుకున్నారు. అమ్మ కుటుంబంలోని ప్రతివ్యక్తినీ ఎంతో సన్నిహితంగా, ఇష్టంగా ప్రేమించారు. హైమవతీదేవిని మొదట దేవతలాగా ఉన్నది అన్నది పొత్తూరి వారే. ఆంధ్రప్రదేశ్ పత్రికారంగంలో ఒక ధృవతారగా వెలిగి ఎందరో సంపాదకులను తయారు చేసిన శ్రీ వెంకటేశ్వరరావుగారు 5.3.2020న అనారోగ్యంతో తన 86వ యేట హైదరాబాద్లో స్వగృహంలో తన కోరిక మేర అమ్మలో ఐక్యమైనారు.
అమ్మతో శ్రీమతి & శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు