నమో నమో
విశ్వ జనని శ్రీ అనసూయే!
నమో నమో.
విశాల హృదయే! అనసూయే!
హే నాగేశ్వరి! సర్వ శుభంకరి!
పరమ పావని! కృపాకరి!
భక్త హృది స్థిత ప్రేమ స్వరూపిణి!
మంగళకారిణి! అనసూయే!
హే జగదీశ్వరి! జగద్రక్షకే !
జగదేక మాత: నమో స్తుతే!
జన గణ వందిత ముక్తి ప్రదాయిని!
కామిత రూపిణి ! నమో స్తుతే!
హే అన్న దాత్రి! సౌవర్ణ గాత్రి!
కారుణ్య నేత్రే! అనసూయే!
సన్మార్గ బోధిని! దుష్టత్వ వారిణి!
వాత్సల్యవర్షిణి అనసూయే!!
– శ్రీ పి. శ్రీనివాస్