1. Home
  2. Articles
  3. Viswajanani
  4. పిడికెడు బియ్యం ఇస్తే చాలు!

పిడికెడు బియ్యం ఇస్తే చాలు!

Gemtela Nikhil Kumar
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 20
Month : January
Issue Number : 6
Year : 2020

చిరుజల్లు కుంభవృష్టి అయింది. వాన నీరు ఏరులా మారింది. వరదై ఎంగింది . ఫలితంగా ఆ గ్రామం వంట మొత్తాన్నీ శ్రీ విశ్వజననీ సోషల్, జికె – నష్ట పోయింది. | ఆకలికి అల్లల్లాడింది. వారి బాధను చూసిన ఓ అమ్మ మనసు కదిలింది. ఆ వరద నుంచే స్ఫూర్తి పొందమంది. ప్రతి ఇంటి నుంచీ పిడికెడు బియ్యాన్ని ఓ చోట చేర్చి బియ్యం రాశులు సృష్టించేలా పురిగొల్పింది. పేదప్రజల కడుపు నింపింది. ఇప్పుడు ముందడుగు అన్నపూర్ణాలయంగా లక్షలమంది ఆకలి తీరుస్తోంది. ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పుతోంది. మరెందరికో ఆశ్రయాన్నిస్తోంది.

ఎక్కడైనా గుడిలో గంట కొట్టి భక్తులు దేవుడిని ప్రార్థిస్తారు. కానీ ఆ గుడిలో గంట కొట్టారంటే అర్థం ఆకలిగా ఉన్నవాళ్లు వచ్చి భోజనం చెయ్యండని. ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని జిల్లెళ్లమూడి గ్రామంలో ఉన్న అన్నపూర్ణాలయంలో గత అరవయ్యేళ్లుగా రోజుకి రెండు సార్లు ఆ గంట మోగుతూనే ఉంది. ఎంతో మందికి ఆకలి తీరుతూనే ఉంది. ఈ మహత్కార్యానికి పునాది వేసింది జిల్లెళ్లమూడి అమ్మగా పేరుపొందిన అనసూయాదేవి. 1946లో గ్రామానికి దగ్గర్లోని నల్లమడవాగు పొంగి వరద రావడంతో చుట్టుపక్కల ఉన్న పంటలన్నీ మునిగిపోయాయి. పేదలకు తిండి గింజలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. అది చూసిన “అనసూయాదేవి ‘గ్రామ సేవ – పిడికెడు బియ్యం ‘పథకానికి శ్రీకారం చుట్టారు. ‘రోజూ వండుకునే బియ్యం నుంచి పిడికెడు బియ్యం తీసి ఓ సంచిలో వేస్తే, పేదల ఆకలి తీర్చొచ్చు’ అని పిలుపునిచ్చారు. ఆ మాటలకు ఎంతో మంది స్ఫూర్తి పొందారు. అలా సేకరించిన బియ్యాన్ని వండి రోజూ పేదలకు భోజనం పెట్టేవారు అమ్మ. ఆ ఏడాది తర్వాతా ఆమె సేవలు ఆగలేదు. 1958లో అన్నపూర్ణాలయం ఏర్పాటు చేశారు. పగలూ రాత్రీ అని తేడాలేకుండా ఎవరొచ్చినా కడుపునిండా అన్నం పెట్టేవారు ఆమె.

ఎంతోమంది సాయం

అనసూయమ్మ సేవలు చూసి ఎంతోమంది ఆర్థికంగానూ తమ వంతు సాయం చెయ్యడం మొదలు పెట్టారు. మరెంతో మంది ఆమెకు భక్తులైపోయారు.

1973 అమ్మ స్వర్ణోత్సవాలలో ఒకేరోజు లక్ష మందికి అన్నదానం చేయగలిగారంటేనే ఆమె పెద్ద మనసును అర్థం చేసుకోవచ్చు. ‘విశ్వజననీ పరిషత్ పేరుతో ప్రారంభమైన సంస్థ అనసూయమ్మ దేవాలయం చేరిన తరువాత కూడా ఆ సేవల్ని కొనసాగిస్తోంది. ఒకేసారి వేలమంది వచ్చినా భోజనం వండేందుకు వీలుగా ఇక్కడ ఆధునిక వంట శాలను నిర్మించింది సంస్థ. ఏటా రైతులూ భక్తులూ ధాన్యాన్ని విరాళంగా ఇస్తుంటారు. జిల్లెళ్లమూడిలో నిత్యాన్నదానంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వరదల్లాంటి ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో బాధితులకు భోజనం, దుస్తులు అందిస్తోంది సంస్థ.

ఉచిత విద్య, భోజనం!

అన్నపూర్ణాలయం ఆవరణలో 1971లో స్థాపించిన మాతృశ్రీ ఓరియంటల్ సంస్కృత పాఠశాల, కళాశాలల్లో ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ వరకూ ఉచిత సంస్కృత విద్యను బోధిస్తున్నారు. ఇక్కడ చదివే విద్యార్థులందరికీ వసతితో పాటు భోజన సౌకర్యాలూ సంస్థే కల్పిస్తుంది. వేదవిద్యను నేర్పేందుకు ఇక్కడ ‘వేద పాఠశాల’ కూడా ఉంది. ఈ రెండు విద్యాలయాల్లోనూ కలిపి ప్రస్తుతం రెండువందల పై చిలుకు విద్యనభ్యసిస్తున్నారు.

ఆదరణాలయం

‘మా సంస్థ ప్రారంభించిన ఆదరణాలయం ఏ ఆసరా లేని వృద్ధులకు ఆశ్రయం ఇస్తోంది. వీరి బాగోగులన్నీ మేమే చూసుకుంటాం’ అంటారు విశ్వజననీ పరిషత్ అధ్యక్షుడు పాట్రన్ బ్రహ్మాండం రవీంద్రరావు. పిల్లలు విదేశాల్లో ఉండడంతోనూ ఇతర కారణాలతో ఒంటరైన పెద్దలు కూడా విశ్వజననీ సంస్థ నిర్వహించే ‘అందరిల్లు’ భవనంలో ఉండొచ్చు. ఇలా దాదాపు రెండొందల మంది ఇక్కడ ఒకే కుటుంబంలా ఉంటున్నారు. వీరందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తారు. ఇక, ‘మాతృశ్రీ మెడికల్ సెంటర్ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, రోగులకు వైద్య పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేస్తోంది. అంతేకాదు, జిల్లెళ్ల మూడి గ్రామస్థులందరికీ సంస్థ తరఫున మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చారు. అందరికీ సురక్షిత మంచినీటిని అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటుచేశారు. ఇలా… విశ్వజననీపరిషత్ చేసే సేవాకార్యక్రమాలెన్నో. వీటన్నిటికీ దేశ విదేశాల్లోని దాతలు అందిస్తున్న విరాళాలే ఆధారం. ఫిబ్రవరి 17న జరిగే ధాన్యాభిషేకంలో అందరూ పాల్గొనవచ్చు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!