వినవే చెల్లీ! అమ్మ కథా
భువిలో దైవం అమ్మ కదా!
జ్ఞానము నిచ్చును శాంతిని ఒసగును
ప్రేమను పంచును అమ్మ సదా!
రమణీయం మహనీయం
సంస్మరణీయం అమ్మ కథా
సుఖదాయిని శుభదాయిని
భవభయనాశని అమ్మ కదా!
కమనీయం భజనీయం
సంస్తవనీయం అమ్మ కథా
కాత్యాయని దాక్షాయణి
మోక్ష ప్రదాయిని అమ్మ కదా !
మందాకిని సంజీవిని
కామితదాయిని అమ్మ కథా
సురసేవిత మునిపూజిత
బుధ సంభావిత అమ్మ కదా!