- విద్యార్ధి ప్రవేశ సమయంలో తల్లిదండ్రులతో పరిచయం చేసుకోవటం.
- కళాశాలలో విద్య, నడవడిక, వసతులు మున్నగు అంశములపై విద్యార్థులకు అవగాహన కలిగించడం.
- వెలుపల ఉంటున్న, హాస్టల్లో ఉంటున్న విద్యార్ధు లకై ప్రవర్తనా నియమావళిని రూపొందించటం.
- విద్యార్థులు సంస్థ సేవాకార్యక్రమాల్లో పాల్గొనునట్లు చేయడం, ఆదివారాల్లో సాయంకాలం ఆలయములు మరియు కళాశాల ప్రాంగణ పరిశుభ్రత చేపట్టటం, శ్రమదానం చేయడం.
- నిర్ణీత కాలవ్యవధిలో ఉపాధ్యాయ – విద్యార్థుల సమావేశాన్ని నిర్వహించడం.
- విద్యార్ధులు అనుదినం పాఠ్యాంశములను ఉదయం, సాయంకాలం శ్రద్ధగా చదువుకోవడం.
- సంగీత అభ్యసనము వంటి పాఠ్యేతర అంశములను బోధించుట.
- దాతల విరాళములతో కళాశాలలో Computer Lab నిర్వహిస్తూ, ఎంపికైన విద్యార్ధులకు బాపట్లలో ప్రత్యేక శిక్షణనిప్పించుట.
- క్రమశిక్షణపై ప్రత్యేక శ్రద్ధవహించడం.
- బాలికల వసతిగృహంలో తగిన సదుపాయాల్ని
- బాలికలకు వారి తల్లి దండ్రులనుంచి వచ్చు Phone calls ను అందుకునేందుకు వీలుగా వసతి గృహంలో Telephone సౌకర్యాన్ని కలిగించడం.
- కుట్టు, వస్త్రములపై అద్దకం మున్నగు అంశములపై వేసవిసెలవుల్లో 30 రోజులు ప్రత్యేక తరగతులను నిర్వహించడం.
- ఆదివారాల్లో English Language Learning నిమిత్తం నిర్ణీతకోర్సులను నిర్వహించడం.
- గ్రంథాలయమును అభివృద్ధిచేసి, అందుబాటు లోనికి తీసుకురావడం.
- ఆదివారాల్లో అమ్మ నామసంకీర్తన పరంగా శిక్షణనివ్వడం.
- బోధనాసౌలభ్యం కోసం ఒప్పంద ఆధారిత అధ్యాపకులను నియమించడం.
- అస్వస్థతతోనున్న విద్యార్థులకు తగిన వైద్య సౌకర్యాలను సమకూర్చడం.
- బాలబాలికల వసతిగృహ నిర్వహణలో భాగంగా Warden మరియు Matron లు వారానికి ఒకసారి స్వయంగా వచ్చి వాటి స్థితిగతుల గురించి లిఖితపూర్వకంగా నివేదించడం. నేను Correspondent గా ఉన్నసమయంలో ‘బాలుర వసతిగృహాని’కి (శ్రీ అనసూయేశ్వర భవన్) సద్గురు శివానన్దమూర్తి గారు ప్రారంభోత్సవం చేశారు. వారు గ్రంథాలయాన్ని దర్శించి ఆ నిమిత్తంగా రూ. 25,000 లు, వారి అనుచరులు ఇరువురు ఒక్కొక్కరు రూ. 25,000 లు చొ||న విరాళాన్ని అందించారు. సోదరుడు జేమ్సుకాంపియన్ కాలేజి అభివృద్ధికోసం 1 లక్ష రు.లు విరాళాన్ని అందించారు.
అమ్మ పవిత్ర హస్తాలతో స్థాపించబడిన కళాశాల కార్తీకదీపంవలె ప్రకాశిస్తూ విజ్ఞాన రోచిస్సులను ప్రసరింపచేయాలని అమ్మ శ్రీచరణాలనంటి ప్రార్ధిస్తునాను