ధస్యులు గారే ! అమ్మకు
ధాన్యము నర్పింపగల ఉదారులు, గుణ మూ
ర్థన్యులు: వారికి ఈడే
అన్యులు ? కేవల ధనాఢ్యులైనను భువిలో.
ధరణిని మొలిచిన ధాన్యము
పరవశమున విశ్వజనని పాదము లందున్
త్వరపడి చేరెడు భాగ్యము
విరివిగ కల్పింప గలరు విద్యార్థులహో!
దక్షత, మేటి ప్రణాళిక,
దీక్షయు మరియు చిత్తశుద్ధి దీపించినచో
రక్షాకరి అమ్మ కరుణ
అక్షయ విజయము లభించు సనవరతమ్మున్
అంకిత భావముతో అక
లంకం బగు మీ మనస్సు, లక్ష్యమ్మునకై
ఉంకించుటేమి వింతయె?
ఇంకేమిటి లోటు మీకు? ఇక విజయమ్మే!
మందస్మిత వదనముతో
బృందములుగ బయలుదేరి ప్రియమగు శిష్యుల్
వందలు వేలుగ సంస్థకు
చందాలను సేకరింప ‘శహభాషం’దున్
“వందేమాతర”మని స్వ
చ్ఛందముగా అమ్మసేవ సాగించుటకై
ముందుకు వచ్చిన మీకిక
అంది ప్రేమతోడ అభినందనముల్
అబ్బుర మే మున్నదిలే?
నిబ్బరమును గలిగినట్టి నిష్ఠా నిధులై
ఇబ్బడి ముబ్బడిగా ఈ
పబ్బమ్మున ఛాత్రు లెల్ల పాల్గొనుచుండన్.
అత్యంతాత్మీయముగా
ధృత్యుత్సాహములతోడ దీక్షితులగు మీ
ప్రత్యయము మెచ్చి అమ్మయె
నిత్య శుభమ్ముల నొసగును; నిశ్చయమిదియే.