ఎంతగానో ఎదురు చూస్తున్న అమ్మ శతజయంతికి ఐదునెలల దూరంలో ఉన్నాము. మనందరి హృదయాలు ఆ సంరంభాలు చూడాలని తహతహలాడుతున్నాయి.
అమ్మ స్వర్ణోత్సవం, వశ్రోత్సవం చూసి ధన్యులైన సోదరీసోదరులకు గొప్ప అనుభూతిని అమ్మ ప్రసాదించింది. లక్షమందికి ఒకేసారి అన్నప్రసాదం ఎలా అందించాలో అమ్మ చేసి చూపించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అమ్మ సంకల్పం మనలో ప్రవేశించి మనచేత చేయించిన మహాద్భుతం అది. ఎప్పుడూ అమ్మ మనలోనే, మనతోనే ఉంది.
శతజయంతి సంకల్పం ఇచ్చింది అమ్మే. మనచే చేయించబోయేది అమ్మే.
అది జరిగేవరకు మనలో ఉత్కంఠ ఉండనే ఉంటుంది. ఒక చారిత్రాత్మక సంఘటన మన కళ్ళముందు మళ్లీ జరగబోతోంది.
108 కోట్ల జపయజ్ఞం సంకల్పమూ అమ్మ ఇచ్చిందే. ఇది చేయగలుగుతామా అనిపించిన సందర్భాలు లేకపోలేదు.
ఈనాడు దాదాపు 83 కోట్ల అమ్మనామజపం అమ్మ మనతో చేయించింది. అమ్మ ఏది సంకల్పించినా అది మహాద్భుతంగా జరిపిస్తుంది.
అమ్మ సంకల్పం నెరవేరడానికి ఉపకరణాలు మనం. ఎందుకంటే అమ్మ చెప్పినట్లు అమ్మ అవయవాలు కూడా మనమేగా! అమ్మ శతజయంతి మహత్కార్యంలో మనవంతు ఉడతాభక్తిని మనమూ చేయిచేయి కలిపి అందించి తరిద్దాం. ఇలాంటి తరుణం మన జీవితాల్లో మళ్ళీ మళ్లీ రాకపోవచ్చు. జపయజ్ఞం పూర్తి చేసేంతవరకు మనం అవిశ్రాంతంగా ఉందాం.
కొంతమంది ఔత్సాహిక జపకర్తల వివరాలు:
క్రమ సంఖ్య | చేసేవారి వివరాలు | జప సంఖ్య |
1 | మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు | 6,81,75,503 |
2 | శ్రీమతి ఉప్పులూరి శ్రీమహాలక్ష్మి (చిట్టిపిన్ని) | 2,09,10,000 |
3 | శ్రీ హరికుమార్ కుమ్మమూరు | 86,89,760 |
4 | జిల్లెళ్ళమూడి అఖండ నామం గ్రూపు | 3,12,97,804 |
5 | శ్రీ డి వి రామరాజు | 18,79,220 |
6 | శ్రీ భవిరిపూడి శ్రీరామమూర్తి నాయుడు | 19,64,662 |
7 | శ్రీ ఆర్ యమ్ మోహనరావు | 19,58,000 |
8 | శ్రీమతి వఝా సీత | 21,83,424 |
9 | శ్రీ తురుమెళ్ళ రమ మాణిక్యరావు | 31,12,000 |
10 | శ్రీ చీదెళ్ళ సాంబశివరావు | 89,48,400 |
11 | శ్రీ టి వినాయకరావు | 24,89,292 |
12 | శ్రీ కె విశాల | 75,74,000 |
13 | శ్రీ వరప్రసాద్ కుటుంబం | 69,46,344 |
14 | శ్రీమతి మన్నె గంగాభవాని | 20,13,000 |
అమ్మ శతజయంతి మార్చి 28, 2023 నుండి ఏప్రిల్ 1 వరకు జరుగనున్నాయి. ఈలోగా సోదరసోదరీమణులు దాదాపు 25 కోట్ల జపం పూర్తి చేయవలసి ఉంది. అందువలన మనం మరింత ఉత్సాహంగా జప లక్ష్యాన్ని చేరడానికి భక్తి శ్రద్ధలతో కృషి చేయవలసి ఉన్నది. మీరు చేయడమే కాకుండా మరింత ఎక్కువమంది ఈ యజ్ఞంలో పాల్గొనేటట్లు చేయవలసిందిగా ప్రార్థిస్తూ.
జయహెూమాతా