1. Home
  2. Articles
  3. Viswajanani
  4. విద్యాపరిషత్ వార్తలు (అంతర్జాతీయ మహిళా దినోత్సవం)

విద్యాపరిషత్ వార్తలు (అంతర్జాతీయ మహిళా దినోత్సవం)

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : April
Issue Number : 9
Year : 2021

మార్చి 8 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో మహిళలకు ప్రాధాన్యతనిచ్చిన దేశం భారతదేశం అని కళాశాల ప్రిన్సిపాల్ డా|| ఎ. సుధామ వంశీ అన్నారు. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అన్న ఆర్యోక్తిని వివరించి అమ్మ మహిళలు విద్యావంతులైతే సమాజ పురోగతిని సాధిస్తుందనే సదుద్దేశంతో కళాశాల స్థాపించిందని విద్యార్థులకు తెలియచెప్పారు. ఈ సభలో కళాశాలలో పనిచేస్తున్న మహిళా అధ్యాపకులను గౌరవించి వారి అభివృద్ధికి కారణాలు, తమకు ఎదురవుతున్న సమస్యలు విద్యార్థులతో వంచుకోవాలని ప్రిన్సిపాల్గారు కోరారు. డా॥యల్.మృదుల మాట్లాడుతూ తాను తన చిన్నతనంలో పడిన కష్టాలను, తన విద్యాభ్యాసం, ఉద్యోగప్రస్థానం అన్నింటినీ చెప్పి అమ్మ దయవలనే కేవలం తను ఈ స్థితిలో ఉన్నానని అర్ద్రతతో కూడిన భక్తితో విద్యార్థులకు తన అనుభవాలు చెప్పారు. యమ్. కవిత మాట్లాడుతూ నేడు ప్రతి మహిళ అన్ని రంగాలలో ముందుంటుంది. మనం అనుకుంటే సాధించలేనిది ఉండదు అని తాను తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు చెప్పి విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపారు. డా|| వి. పావని మాట్లాడుతూ ప్రకృతి, పురుషుడు అనేది విభాగమే కానీ. విభేదం లేదు. అది కేవలం నడవడం కోసమేనని రహస్యాన్ని తెలుసుకోగలిగితే విభేదం లేదని సృష్టి చెప్పారు. బాధ్యతతో కూడిన అధికారాన్ని మాత్రమే ఆశిస్తూ ప్రతి మహిళా ముందుకు వెళ్ళాలని హితవు పలికారు. రమ్య (లైబ్రేరియన్) మాట్లాడుతూ తాను ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాతకూడా తనకున్న ఆసక్తితో పై చదువులు చదవగలిగానని, తాను చదువుకోవడానికి శరశ్చంద్ర అన్నయ్యగారు ఎంతో ప్రోత్సహించారనీ గుర్తుచేసు కొన్నారు. ఇలా మహిళా దినోత్సవంనాడు మహిళా అధ్యాపకులకు ప్రత్యేక సభా నిర్వహణతో డా॥ ఎ. సుధామ వంశీ గారి అధ్యక్షతన ఆర్.వరప్రసాద్ గారి సభా నిర్వహణతో డా॥హనుమత్ ప్రసాద్ గారి ఛలోక్తులతో సభముగిసింది. కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. 

కాలేజికి గుర్తింపు:

గత అయిదు దశాబ్దాలుగా ప్రతిష్ఠాత్మకంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల దిగ్విజయంగా నడపబడుతుంది. ఎన్నో మైలురాళ్ళుదాటుకొని రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపును కూడా పొందింది. ప్రభుత్వ నిబంధనల మేరకు మన కళాశాలకు 22.03.2021 సోమవారం రోజున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి FFC (Fact Finding Committee) వారు విచ్చేశారు. Dr.N.V. కృష్ణారావు H.O.D (Department of Oriental Language) Dr.E.V. పద్మజ Department of History and Archeology Visit చేశారు. మన కళాశాలకు స్వయంగా విచ్చేసిన ప్రొఫెసర్స్ ఇద్దరూ కూడా కళాశాలకు కావలసిన మౌలిక సదుపాయాలను పరిశీలించి మూల్యాంకన చేశారు. Documents ను కూడా పరిశీలించి కళాశాల గుర్తింపును కొనసాగిస్తామని తెలిపారు. విశ్వజననీ పరిషత్ వారు అధికారులకు అమ్మ శేషవస్త్రాలను సమర్పించి సత్కరించారు. 4 రోజులపాటు విద్యార్థులు అధ్యాపకు లందరి పర్యవేక్షణలో కళాశాల ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కళాశాల కరస్పాండెంట్ డా॥బి.యల్. నుగుణ గారు మరియు కళాశాల ప్రిన్సిపాల్ డా॥ఎ. సుధామవంశీ గారు విద్యార్థులను అభినందించారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.