(కళాశాల స్వర్ణోత్సవాల ప్రారంభ సభా కార్యక్రమము)
ఆగస్టు 6, 2021 శుక్రవారం రోజున మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అమ్మ కరకమలములతో స్థాపించబడి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా అనసూయేశ్వరాలయంలో అమ్మకు విశేష పూజలు జరిపారు. పూజాకార్యక్రమంలో విశ్వజననీ పరిషత్ సభ్యులు మరియు కళాశాల అధ్యాపక సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. పూజాకార్యక్రమం తరువాత ఏర్పాటు చేసిన సభాకార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీమతి బి.యల్. సుగుణ గారు స్వర్ణోత్సవ కార్యక్రమాల ప్రణాళికను ప్రతిపాదించారు. కాగా ప్రెసిడెంట్ శ్రీ. యమ్. దినకర్ గారు మరియు కార్యవర్గ సభ్యులు విద్యార్థుల భవిష్యత్తుకై అనేక సూచనలు చేశారు. అందరూ ఈ విపత్కర పరిస్థితిని అధిగమించి వేదికపై స్వర్ణోత్సవ కార్యక్రమాలను జరుపుకునేలా ఆశీర్వదించమని అమ్మని ప్రార్థించారు.