శ్రీ కామేశ్వరరావుగారు పూలు, పుష్పమాలికలు సమకూర్చారు. దుర్గాష్టమినాడు మందిరం అలంకరించి అమ్మకు విశేషపూజలు నిర్వహించారు. మాతృశ్రీ పాచ్యకళాశాల పూర్వవిద్యార్థి శ్రీ ఐ.విద్యాసాగర్ ఆధ్వర్యంలో బాలపూజ, కుమారీపూజ, సువాసినీపూజ, హెూమము, పూర్ణాహుతి కార్యక్రమములు యధావిధిగా వైభవంగా జరిగాయి.
మధ్యాహ్నం 12 గంటలకు అమ్మ ప్రసాద (భోజనం) వితరణ కావించారు. ఓపికలేకపోయినా శ్రీమతి కుసుమక్కయ్య వచ్చి అందరిలో ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో మురళిదంపతులు, జగన్నాథం దంపతులు, ఆదినారాయణ, సుబ్బారావు, వెంకటాచారి ప్రభృతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మ ప్రసాదాన్ని ఆశీస్సుల్ని పొంది ఆనందించారు.
అమ్మ శతజయంతి సందర్భంగా మాతృశ్రీ అధ్యయన పరిషత్, విశాఖపట్టణం తరఫున ప్రతి ఆదివారం ENT హాస్పిటల్ వద్ద అమ్మ (అన్న) ప్రసాద వితరణ కావించాలని నిర్ణయించారు.