విశ్వజననీ మా మనవులు
వినుమా అనసూయమ్మా !
విశ్వాసముతో చేసిన
విమల స్తోత్ర మిదమ్మా !!
నశ్వరమౌ భవప్రీతి (బంధము)
నవలీలగ త్రుంచి
శాశ్వతమౌ నీ సన్నిధి
శరణ్యమ్ము నీయమ్మా..
“అమ్మ” అనే అమృతమయపు
అక్షరాల సౌందర్యము
ఇమ్మహిలో నీ రూపము
దాల్చి మాకు దొరకెనమ్మా.
నీ పలుకులు సత్యములు
నీ పలుకులు నిత్యములు
నీ పలుకులు మంత్రములు
నీ పలుకులు మాకు విందు
నిన్ను మరచి మేమున్నా
కన్నుల పొర కమ్మినా
ఎన్ని పాపములు చేసినా
కన్నతల్లీ కాచెదవే.
నీ మూర్తికి జయం జయం
నీ మాటకు జయం జయం
నీ కీర్తికి జయం జయం
నీ దాసులకంతా జయం
(టి.టి.డి. అన్నమయ్య ప్రాజెక్టు సుప్రసిద్ధ గాయకులు వ్రాసిన పాట యిది)