రెండవరోజు (29.3. 2023)
“మానవ రూపంలో దర్శన మిచ్చే దైవం అమ్మ. జీవుల సంస్కారాలను ప్రక్షాళనం చేసే ప్రసాదం – అమ్మ పెట్టే అన్నం.”
- డా.నారాయణం శేషుబాబుగారు, సాహితీవేత్త, గుంటూరు
“20శతాబ్ది తొలిదశలో ఆంధ్రదేశంలో అవతరించిన దివ్య తేజస్సు అమ్మ. అమ్మ మాట తేట తెలుగు. అమ్మ మాట లోతు వెలుగు. సహజ సుందరం. సరళ సుందరం. అమ్మ వాక్యాలు ఆధ్యాత్మిక సత్యాలు. చింతపండులో పులుపుగా, వేపకొమ్మలో చేదుగా ఈ సృష్టిలో దైవం ఉన్నదనే అమ్మమాట ఆలోచనామృతం.
‘ఈ సృష్టి నాది’ అని ‘అందరిల్లు’ నెలకొల్పిన అమ్మ మాత్రమే అనగలదు.
మనం ఏడవమైలు దాటేవరకు గొంగళి పురుగులం. దాటితే… సీతాకోక చిలుకలం.
జిల్లెళ్ళమూడిలో అమ్మ స్పర్శానుభూతిని పొందవచ్చు. సహనానికి మారుపేరు, సహజీవనానికి తల్లివేరు అమ్మ.
అమ్మ నెట్ వర్క్ లో ఎప్పుడూ out of reach ఉండదు. అమ్మ ఎప్పుడూ coverage area లోనే ఉంటుంది. అమ్మప్రేమ ప్రీ పెయిడ్.
AMMA’s is endless. AMMA’s sayings are priceless.
- శ్రీ ప్రసాదవర్మ కామఋషిగారు. రచయిత, జర్నలిస్టు, హైదరాబాద్.
“అమ్మ సన్నిధి ఒక ప్రేమాలయం. లౌకికంగా విద్యాభ్యాసం చేయని అమ్మ జన్మతః ఒక జ్ఞానమూర్తి. ప్రేమ తత్త్వమే అమ్మ. ఆ ప్రేమ అందరికీ అన్నంపెట్టే సేవగా వ్యక్త మవుతుంది. నేటి సమాజానికి ఎంతో అవసరమైన ప్రేమపూర్వక జీవన విధానం అమ్మ ఆచరించింది. ఆ ప్రబోధం ప్రసాదంగా మనకు పంచిన అమ్మకు మనం ఋణపడి ఉంటాం. అమ్మ సందేశాన్ని ఆచరించి మనం ఆ ఋణం తీర్చుకోవాలి. అమ్మ ప్రవచించిన ప్రేమ తత్త్వం, ఆచరించిన సేవాతత్త్వం అసాధారణమైనవి.
– శ్రీ సోము వీర్రాజుగారు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, భారతీయ జనతాపార్టీ
“మంచితనానికి ప్రతిరూపం అమ్మ. ప్రేమ, సేవ కలిసిన నిండైన రూపం అమ్మ. అమ్మ ఆశయాలకు అనుగుణంగా మనం పురోగమించిన నాడే దేశాభ్యుదయం సాధ్యం. అమ్మ ఆచరించి ప్రబోధించిన ప్రేమతత్త్వమే విశ్వశాంతికి రాచబాట.”
– శ్రీమతి నన్నపనేని రాజకుమారిగారు, మాజీ మంత్రివర్యులు.
“ప్రేమ స్వరూపిణి అమ్మ. సృష్టి స్వరూపిణి అమ్మ.
అందరినీ తన బిడ్డలుగా ప్రేమించి లాలించి, అందరి ఆకలి బాధనూ తీర్చటమే లక్ష్యంగా అవతార ప్రస్థానం సాగించింది అమ్మ. హృదయం పవిత్ర ప్రేమమయమై, చేసే ప్రతిపనిలో భగవంతుణ్ణి చూడగలిగితే, సంసారం ఆధ్యాత్మిక సాధనకు ప్రతిబంధకం కాదని తన ఆచరణద్వారా ప్రబోధించింది అమ్మ. అమ్మ బాటలో సత్కార్యాలు ఆచరించటమే అమ్మను ఆరాధించటం.
కోవిడ్ సమయంలో దేశమంతటా పేదల ఆకలిబాధను నివారించటానికి మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీగారు నిర్వహించిన “అన్న యోజన” ప్రణాళికకు స్ఫూర్తి అమ్మ సందేశమే. మహా మహిమోపేతమైన దివ్య క్షేత్రం జిల్లెళ్ళమూడి. లక్షలాది మంది పేదల ఆకలి తీర్చిన ప్రేమ క్షేత్రం అన్నపూర్ణాలయం. లక్షమందికి ఒక్క పంక్తిని భోజనం పెట్టిన సేవా క్షేత్రం జిల్లెళ్ళమూడి.”
– శ్రీ బండారు దత్తాత్రేయగారు, హర్యానా రాష్ట్ర గవర్నర్.
“ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తుల సమ్మేళన స్వరూపం అమ్మ. అనంతమైన శక్తి ఒక దివ్య సంకల్పంతో మాతృప్రేమను సంతరించుకొని, పంచభూతాత్మకమైన రూపం పొంది, అమ్మగా దిగి వచ్చింది. కర్తవ్యమే భగవంతుడనీ, కూతురినీ కోడలినీ సమానంగా చూడటమే అద్వైతమనీ ప్రబోధించిన సమతా మూర్తి, మమతా మూర్తి అమ్మ.
సృష్టి అంతటిలోనూ దైవాన్ని దర్శించిన అమ్మను ఆరాధించటం అంటే ఆ దివ్య ప్రేమను మనం అలవరచుకోవటమే..మనస్సును శాంతితో, హృదయాన్ని ప్రేమతో నింపి, ఆ రెండింటినీ పూజా పుష్పాలుగా సమర్పించటమే అమ్మకు మన శతజయంతి కానుక.”
– శ్రీ శ్రీ శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ వారు, విశ్వ నగర్, గుంటూరు.
– డా|| బి.యల్.సుగుణగారి సౌజ్యంతో
—
నిత్యాన్న ప్రసాదవితరణ పథకం ఉంది – మరువకండి
‘డ్రస్సుతో, అడ్రస్సుతో నిమిత్తం లేకుండా ఆకలే అర్హతగా అందరికీ అన్నం పెట్టాలన్నదే అమ్మ ఆశయం. అమ్మ ఆశీస్సులతో జిల్లెళ్ళమూడిలో నిరతాన్నదానం నిర్విరామంగా సాగుతున్నది. అన్నదానంI చేసేవారిపై అమ్మ కరుణ అనంతంగా వర్షిస్తుందని ఎందరో సోదరీ సోదరుల అనుభవాలు నిరూపిస్తున్నాయి.I అందుకోసం ఏర్పడిన ‘నిత్యాన్నదాన పథకం’లో మీరూ భాగస్వాములై, అమ్మ కృపకు పాత్రులయ్యే సదవకాశం వినియోగించుకోండి. పుట్టిన రోజు, పెళ్ళిరోజు, గృహ ప్రవేశం, పుణ్యతిథి • ఇలా ఏ సందర్భంలో అయినా మీరు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు. మీరు కోరిన రోజున మీ పేరుతో జిల్లెళ్ళమూడిలో అన్నదానం జరుగుతుంది.
మీరు రూ. 5,000/-లు విరాళంగా అందిస్తే చాలు. ఆనాడు మీ గోత్ర నామాలతో ఆలయాలలోI పూజ, అనసూయేశ్వరాలయంలో ‘మహా నివేదన’ జరుగుతాయి. మీరు జిల్లెళ్ళమూడి వచ్చి, స్వయంగా ఈ I కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
వివరాలకు : శ్రీవిశ్వజననీ పరిషత్ ట్రస్ట్,
ఫోన్: 7788992385, 9490307364.

ఫోన్: 7788992385, 9490307364.V