డాక్టర్ పన్నాల రాధాకృష్ణశర్మగారు అమ్మ అశేషకళ్యాణ గుణ వైభవాన్ని కీర్తిస్తూ ‘శ్రీ అంబికా సహస్ర నామస్తోత్రాన్ని’ రచించారు.
మాన్యసో॥ శ్రీ తంగిరాల సింహాద్రిశాస్త్రి గారి అమ్మాయి “డాక్టర్ తంగిరాల అనసూయ” అమ్మ యందలి భక్తిప్రపత్తులతో ఆ స్తోత్రపూర్తి పాఠాన్ని ఒక స్టూడియోలో శ్రావ్యంగా గానం చేసి రికార్డుచేసి దానిని 15-10-2021 విజయదశమి పర్వదినాన అమ్మ శ్రీ చరణాలపై ఒక పూజాపుష్పంగా సమర్పించారు.
దానిని శ్రీ విశ్వజననీ పరిషత్ ప్రధానకార్యదర్శి శ్రీ డి.వి.యన్. కామరాజు అమ్మ ప్రత్యక్ష సన్నిధిలో శ్రీ అనసూయేశ్వరాలయంలో ఆవిష్కరించారు. సోదరి అనసూయపై జగజ్జనని సంగీతసరస్వతి అమ్మ శుభాశీస్సులు సదా వర్షించుగాక!
ఆ Audio File అంబికాసహస్ర నామస్తోత్ర’ పారాయణ కర్తలకు ఒక కరదీపికగా ప్రయోజనకారి. కావున
సదరు Audio File కావలసిన వారు సంప్రదించండి.
1) డాక్టర్ తంగిరాల అనసూయ (సెల్ నెం. 9849109170)
2) ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం (సెల్ నెం: 9963431087)