అందరింటిలో అతి సామాన్యులుగా గోచరిస్తూ అసామాన్యమయిన, బహుళ ప్రజాదరణ పొందేలా కార్యక్రమాలు అతి సమర్థవంతంగా నిర్వహించ గలిగిన వారెందరో తారసపడ్తారు. ఆ కోవకు చెందిన వారిలో సోదరుడు పూర్ణచంద్రరావు ఒక్కడు అంటే అతిశయోక్తి కాదేమో!
‘అమ్మ’ను అర్చించి, అందరింటికి ఎన్నెన్నో సేవలందించిన వారిలో ఎవరి ప్రత్యేకత వారిదే! ‘అమ్మ’ అవతార ప్రణాళికలో భాగంగా ‘అమ్మ’ సంకల్పానుసారం, ‘అమ్మ’కు ఉపకరణాలుగా భాసిల్లిన వారే!
శ్రీ పూర్ణచంద్రరావుగారిది అమ్మ జన్మస్థలం అయిన మన్నవ గ్రామం. ఆయన యింటి పేరు మద్దినేని. కాని అందరింట మన్నవ పూర్ణచంద్రరావుగానే ప్రసిద్ధి అయినారు.
మన్నవ గ్రామంతో ఆయనకున్న అనుబంధంతో గాని, జిల్లెళ్ళమూడికి అక్కడి నుంచి వచ్చే అన్నదమ్ములతో, రాఘవరావు మామయ్య కుటుంబంతో ఆయనకు ఏర్పడ్డ బంధంతో వారందరితో కలసి చిన్నతనం నుంచి వాళ్ళలో ఒక్కడుగా, అమ్మను దర్శించు కుని వస్తూ ఉండేవాడు.
ఆనాడు జిల్లెళ్ళమూడిలో వెల్లివిరిసిన ప్రేమాను రాగాలు, పవిత్రాను బంధాలు, సేవానురక్తి ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసేవి. పశుపక్ష్యాదులు, జంతుజాలాలు కూడా ఈ ప్రభావంలోనే మెదిలేవి. వ్యక్తులమధ్య నిస్వార్థమయిన ప్రేమమయ వాతావరణం ప్రస్ఫుటంగా గోచరించేది. అందరూ అందరికోసం వారి వంతు సేవలందించే రోజులవి.
పూర్ణచంద్రరావు గారికి సోదరులతో కలసి చెరువు నుంచి నీళ్ళు కావిళ్ళతో’అమ్మ’ స్నానానికి అందించటం పోషించాడు. నాకు గుర్తు.
విద్యార్థి దశ తర్వాత డిఫెన్స్ సర్వీసెస్ లో జాయిన్ అయి ఆ కాంట్రాక్ట్ పూర్తి అయినాక సివిల్ సర్వీసెస్లో
జాయిన్ అయినాడు. ఇన్సురెన్స్ సర్వేయర్గా పనిచేస్తూ అవకాశం వున్నప్పుడు జిల్లెళ్ళమూడి వస్తూ వుండేవాడు.
‘అమ్మ’ వత్రోత్సవ వేడుకల సందర్భంగా ఊరూరా తిరిగి, ఆర్థిక వనరులు కోసం ఎంతో కృషి చేయడం జరిగింది. కొన్ని సందర్భాలలో అనేక ప్రదేశాలు తిరిగి వారితో కలసి పనిచేయటం జరిగింది.
‘హైమ’ పట్ల ఎనలేని భక్తి విశ్వాసాలు కలిగిన వాడు. హైమాలయంలో హైమక్కయ్య విగ్రహం చూసినప్పుడల్లా ఎంతో ఆవేదనకి, ఉద్వేగానికి గురయ్యేవాడు.
హైమాలయంలో పాలరాతి విగ్రహప్రతిష్ఠ అమ్మ ఆదేశానుసారం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వహణలో శ్రీ పూర్ణచంద్రరావు అకుంఠిత దీక్షతో వ్యవహరించి అమ్మ కృపకు పాత్రుడైనాడు.
‘అమ్మ’ సంకల్పానుసారం ప్రముఖ పాత్ర పోషించాడు. ఆ కార్యక్రమం నెరవేర్చటంలో ఎంతోమంది సోదర సోదరీమణులు ఆర్థికంగా, అనూహ్య రీతిలో స్పందించి సహకరించారు.
1999 తర్వాత SJ కమిటీలో ఆర్గనైజింగ్ సెక్రెటరీగా బాధ్యతలు ఆయన సమర్థవంతంగా నిర్వహించాడు.
‘అమ్మ’ భౌతికంగా కనుమరుగయిన తర్వాత ‘అమ్మ’ ఆదేశం మేరకు, ‘అమ్మ’, ‘నాన్న’ గార్ల స్వగ్రామా లైన మన్నవ, రేటూరులలో అన్నదాన కార్యక్రమం అత్యంత భక్తి, శ్రద్ధలతో నిర్వహించాడు.
అందరింట అన్ని సంస్థాగత వ్యవహారాల్లో శ్రీ పూర్ణచంద్రరావు ప్రముఖమయిన, కీలకమయిన పాత్ర
జిల్లెళ్ళమూడిలో టి.టి.డి కళ్యాణమంటపం నిర్మించబడటంలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఆయన
ముఖ్యకారణమైనాడు. ‘అమ్మ’ ప్రత్యేకించి ఆ బాధ్యతను ఆయనకు అప్పజెప్పడం జరిగింది.
ఆయన గురించి నేను వ్యక్తిగతంగా, ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ‘అమ్మ’ భౌతికంగా మనకు దూరమయిన తర్వాత మానసికంగా కుంగి, రాకూడని కష్టం వచ్చిందని తల్లడిల్లుతున్న సమయాన, నాకు ఎంతో అండగా వున్న వ్యక్తి పూర్ణచంద్రరావు. కొన్ని ప్రత్యేకమయిన పరిస్థితులలో నేను మాచర్లలో ట్రాన్స్ఫర్ అయి వుండవలసి వచ్చింది.
అక్కడ వున్న కొద్ది రోజులు నాకు వ్యక్తిగతంగా తన సహాయ సహకారాలు అందించారు. “ఎంతో అండగా” నా క్షేమమే ధ్యేయం అన్నట్లు వ్యవహరించిన తీరు నేను ఎన్నటికి మరువలేనిది.
ఆయనకు జీవితంలో ఉన్న వ్యాపకాలు, వ్యవహారాలు నిర్వహించిన తీరు పరికిస్తే ఆయనది ఒక ప్రత్యేకమైన బాణి, శైలి క్రింది అనిపిస్తుంది.
తన గర్భవాసాన జన్మించిన పుత్రుడు అకాల మరణం చెందినప్పుడు తన దుఃఖాన్ని దిగమ్రింగుతూ అమ్మకు విశేష పూజలు నిర్వహించి, అమ్మకు ఇష్టమైన అన్నదానం, వస్త్ర దానం ఎందరికో చేసి, తృప్తి పొందిన ధన్యజీవి.
వేలు, లక్షలు ఖర్చు చేస్తూ అందరింట్లో పూజలు, యజ్ఞ యాగాదులు నిర్వహిస్తున్న వారికి సహకారాన్ని అందిస్తూ తృప్తి పొందడం విశేషం. తను ఉపకరణంగా సహాయపడిన వ్యక్తి పూర్ణచంద్రరావు.
‘అమ్మ’ అనారోగ్యంగా వున్న అనేక సందర్భాలలో అవసరమయినప్పుడు తన కారుతో అనుకోకుండా ప్రత్యక్షమయ్యేవాడు.
‘అమ్మ’ మాయింట్లో వున్న నలభై రోజులలో అమ్మకు రోజూ ఒక కొత్త చీర, బెంగుళూరు నుంచి పూలు, కూరగాయలు జిల్లెళ్ళమూడి చేర్చి, ఎనలేని సేవలు అందించారు.
‘అమ్మ’ చెంతన, అమ్మ చింతన లో ఒక ఐదు నెలలు ముందుగా అమ్మ దగ్గర గడిపి అనంతరం శాశ్వతంగా అమ్మ ఒడిని చేరారు పూర్ణచంద్రరావు