1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సంపాదకీయం -“తల్లి అంటే తొలి”

సంపాదకీయం -“తల్లి అంటే తొలి”

Unknown
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : October
Issue Number : 3
Year : 2022

“సర్వ చైతన్య రూపాం తాం

ఆద్యాం విద్యాం చ ధీమహి”

దేవీ భాగవతంలో వ్యాస మహర్షి చెప్పిన మాట ఇది. సృష్టి అంతటిలో చైతన్యరూపంగా ఉన్న శక్తిని దసరా పండుగ రోజులలో మనం అర్చిస్తూ ఉంటాము. ఆ శక్తికి పుట్టుక లేదు. పుట్టుక లేదు కనుక మరణమూ లేదు. ఆది మధ్యాంతాలు లేనిది ఆ శక్తి. ఆ శక్తి సృష్టికంటే ముందునుంచీ ఉన్నది. అందుకే ఆ శక్తి “ఆద్యా”. “అంతే కాదు, మనలో గూడుకట్టుకొని ఉన్న అజ్ఞానాంధకారాన్ని పటా పంచలుచేసే ఆ శక్తి “విద్యా”. ఈ తత్త్వాన్ని తేటతెల్లం చేయటానికే “తల్లి అంటే తొలి” అని, “తెలియనిది తెలియ చెప్పటానికే నా రాక” అని అమ్మ ప్రకటించింది.

‘ఆధ్యా’, ‘విద్యా’ అయిన ఈ శక్తిని శరన్నవరాత్రులలో అమ్మలో దర్శిస్తూ అర్చిస్తున్నాము మనం. బాలగా, లలితగా, దుర్గగా, గాయత్రిగా, అన్నపూర్ణగా, సరస్వతిగా, మహాలక్ష్మిగా, కాళిగా, రాజరాజేశ్వరిగా అమ్మను అర్చించుకుంటున్నాం. “ఒకటే అనేకం అయింది” అని కదా అమ్మ చెప్పిన మాట! ఆ ఒక్కటీ అన్నింటికంటె ‘తొలి’ అయిన తల్లి. ఆ తొలి అయిన ఆదిశక్తి విద్యా స్వరూపిణి కనుక, భిన్న విభిన్న దేశ కాలాలలో అవతరించి మానవాళికి మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. మంచివైపు నడిపిస్తూ ఉంటుంది. మానవజన్మ సార్థకం కావటానికి కావలసిన మహోపదేశం మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది.

అలా అనుగ్రహించటానికే అవతరించిన మన అమ్మ- తొలి.

“నేను ఆదెమ్మను” అని ప్రకటించిన అమ్మ, తాను ‘తొలి’ అయి అవతరించి మనకందరికీ జన్మను ప్రసాదించింది. “పూర్వజా” అని ఈ శక్తినే హయగ్రీవుడు ‘బ్రహ్మాండ పురాణం’ లోని ‘లలితా సహస్రం’లో ప్రస్తుతించాడు. ఏ ఇంటిలో అయినా అందరికంటే ముందు నిద్ర లేచేది అమ్మే. ఇంటిల్లపాదికీ అవసరమైన అన్ని పనులూ చూస్తూ, ఏ వేళకు అవసరమైన వారిని ఆ వేళకు నిద్రలేపి, వారికి కావలసినవన్నీ అమర్చి పెడుతుంది. మనకంటే కొన్ని పదుల సంవత్సరాలు ముందు పుట్టిన వారు మనకు భౌతికమైన జన్మను ఇచ్చినట్లే, మనకంటే ముందు మేల్కొన్నవారు మనను నిద్రనుండి మేల్కొలిపినట్లే మనకంటే ముందుగా సత్య సందర్శనం చేసిన మహనీయులు మనకు జ్ఞాన పూర్వకమైన రెండవ జన్మను అనుగ్రహిస్తారు. ‘అందరింటి’ లో అమ్మ చేసే పని కూడ అదే. “నేను అమ్మను, మీరు బిడ్డలు” అని తనకూ మనకూ ఉన్న బంధాన్ని వెల్లడించింది అమ్మ. తొలి అయిన అమ్మ కనుక తన బిడ్డలందరికీ తెలియవలసిన అంశాలన్నీ తెలియ చేస్తుంది అమ్మ. “నేను అమ్మను, నీకూ మీకూ అందరికీ పశుపక్ష్యాదులకూ క్రిమికీటకాదులకూ కూడా” అని తెలియజేసింది. “నేనే మీ అందరినీ కని మీ మీ తల్లులకు పెంపు డిచ్చాను” అని కూడా స్పష్టం చేసింది.

అమ్మ ‘జీవిత మహోదధి’లోని ఏ తరంగం చూసినా ఈ ప్రకటన ప్రత్యక్షర సత్యమని మనకు బోధపడుతుంది.

అమ్మ. ఆ మందకో అవలూ గొంటూ దు లూ మేకలూ – ఇలా అన్ని జాతుల పశువులూ ఉ వాటికి మేతకోసం సంగం జ్వార్లమాటినుంచి ప్రత్యేకంగా తెప్పించిన ‘రాజా’ వ 17 అ పనుసుల నోటికి అందించింది అమ్మ. అన్ని రకాల పశువులు వేల సంఖ్యలో ఒకపాట చేరి మేత చేస్తులే చూసి ఎంతో ంది అమ్మ ఆ పసవుల ఆలనా పాలనలను గురించి వాటి యజమానులతో సంప్రదించింది. అమ్మ ఆ మందకు ఎదురుగా న్నయిు వేశం ఏర్పాటు చేయించింది. సంగీతం విని వశవులు కూడా పరవశిస్తాయన్న ఆర్యోక్తిని ఆవరించి ఆ పసరులకు అనందం కలిగించింది అమ్మ

కష్టంగా ఉనడు అన్న మనన్లలో జేలో మతము ఎత్తి కూర్చొని, ఆ మెట్టకొపిట్టలమీద కి, కోయిల, గోయంకు, ఆడుతలతో మన్నట్లు చెప్పేది. గారి ముకలు తంది విసురుతూ అను ముక్కలతో వాటిని పట్టకుండాన్న కాకులను చూసి అను ఎంతగానో మురిసిపోయేది. చీరాలలో డా.శ్రీధరరావుగారి పెంపుడు కు నూనెతో తల అంటి అశీర్వదించింది అమ్మ పశుపక్ష్యాదులను తన కిడ్డలుగా జాతించిన ఇలాంటి సన్నివేశాలు అమ్మ చరిత్రలో కోకొల్లలు

“దుష్టత దీక్షతో గాని దష్ట రక్షణ లేదని అమ్మ తన అవతార తత్త్వాన్ని పరోక్షంగా చె అయిన చేరమని మనలమ్మ రూపంతో వచ్చింది. కనక, ఈ అవతార ప్రణాళికలో సంస్కరించటమే కా సంహారించటం అనేది లేదు. తల్లికి తప్పే కనిపించదు” అని స్వడంగా ప్రకటించింది. తప్పొప్పుల పట్టిక తన దగ్గర లే ఉన్నది అమ్మ. కప్పలను వేకెత్తి చూడకుండానే, నడుచుకోవలసిన మంచిదాని సూచించింది. అమ్మ తిట్టిపోస్ విధానం, కొట్టి చంపే విధానం కాదు అమ్మది. అది కట్టి లేసే విధానం

కులాల పేరుతో కుమ్ములాటలు, దుకాల పేరు మారణ చేశారులూ జరగరాదని అమ్ము అకాంక్ష, ర్వ నమ్మతమైనదే నా మతం” అని సనాతన ధర్మంలోని విశాల భావన తన మార్గంగా చూపించింది.

ఎందిరిందిలో సంస్కరించింది. అమ్మ సంప్రదాయాలు నింగించలేదు. సంప్రదాయం పేరిట సాగే కమానుడు విధానాలు ఖండించింది. తిరుగుబాలు అమ్మ ఉద్దేశం కాదు. మనందరినీ తిరిగి బాటలోకి చేర్చటమే అమ్మ అవతారలక్ష్మంగా కనిపిస్తుంది.

అమ్మ తలలో మాటలలో జీవిత సన్నివేశాలలో అంతలా ప్రేమపూర్వమైన విశ్వకటుం భావనే వునకు దర్శన మిస్తుంది. మనలోని భండాసుర మహిషాసురారి రాక్షసులను సంస్కరించటానికి తల్లి ప్రేమను తగిన ఉపకరణంగా ఎంచుకునది అను. మనలో అడగర దాగిఉన్న మానవతా భావన ఉండించ చేసే, దివ్యతాన్ని మకు చవి చూపించటమే అమ్మ లక్ష్యం అనిపిస్తుంది. పరిపూర్ణ రూనవత్వమే దైవత్వపని చాటి చెప్పిన అమ్మ పన ఇలచేలవు. మనకు అతి చేయవు. తొల్లి అయిన తల్లిని ఉరత్మమాడిలో అమ్మ రంలో ఈ సరన్నవరాత్రులలో ఉష్ణోడని అనసరించి తరిద్దాం. జక్క రికార్థం చేసికుందాం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!