1) నరసరావుపేట పట్టణంలో : 11-11-2022న శ్రీ పాండురంగస్వామి దేవాలయ పవిత్ర ప్రాంగణంలో శ్రీ కె.జగదీష్, శ్రీమతి భార్గవి గారల సహకారంతో సామూహిక అనసూయావ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ ఎమ్. దినకర్ గారు అమ్మ స్థాపించిన సేవాసంస్థల పాత్ర, కృషి, ఔన్నత్యములను వివరించారు. వేదపండితులు శ్రీ ఎమ్. సందీప్ శర్మగారు శ్రీ అనసూయావ్రతాచరణ కావించారు. శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారు వ్రతకథలను చదువుతూ సందర్భోచితంగా అమ్మ ఆచరణాత్మక సందేశాన్ని వినిపించారు. సుమారు 185 మంది స్థానికులు ఇందు పాల్గొన్నారు. అంతేకాదు. వారందరూ జిల్లెళ్ళమూడి వచ్చి 14-11-2022న శ్రీ లలితా కోటినామపారాయణలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
2) అబ్బూరు గ్రామంలో : 16-11-2022న శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయ పవిత్ర ప్రాంగణంలో మాన్య సోదరి బేబమ్మగారి సహకారంతో సామూహిక అనసూయావ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సుమారు 100 మంది సోదరీమణులు పూలుచల్లుకుంటూ ఊరేగింపుగా అమ్మ చిత్రపటాన్ని పూజావేదిక వద్దకు తెచ్చి అలంకరించారు. శ్రీ ఎమ్. సందీప్ శర్మగారు శ్రీఅనసూయావ్రతాన్ని ఆచరింపచేయగా, శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారు వ్రతకథలను వినిపిస్తూ జిల్లెళ్ళమూడి పవిత్రక్షేత్రం, అమ్మ వాత్సల్య కారుణ్యవైభవములను హృద్యంగా వివరించారు.
పై కార్యక్రమాల్లో వ్రతాన్ని ఆచరించిన వారందరికీ అమ్మ ఫోటో, అమ్మసాహిత్యం, అమ్మ కుంకుమ, అమ్మ ప్రసాదాలను అందచేశారు.