24-07-24 : జిల్లెళ్ళమూడి హెూమశాలలో సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి హవనం జరిగింది.
25-07-24 : గురువారము మున్సిపల్ కార్పోరేషన్ కొవ్వూరు వైస్ ఛైర్పర్సన్ శ్రీమతి వన్నె పద్మగారు అమ్మను దర్శించుకున్నారు.
27-07-24 : శనివారము – శ్రీ తుమ్మలపల్లి వేంకట నాగేశ్వర గుప్త గారు శ్రీ హైమవతీ దేవిని అర్చించుకున్నారు.
05-08-24 -06-08-24 (సోమ మంగళవారములు) శ్రీ విశ్వజననీపరిషత్ ఉభయ ట్రస్టుల సమావేశం జిల్లెళ్ళమూడిలో జరిగినది. ఈ సందర్భంగా ఆవరణలోని ప్రధాన ఆలయాలలో నిత్యం జరిగే ఏకాదశ రుద్రాభిషేక సేవలో శాశ్వత రీతి పాల్గొనే సువర్ణ అవకాశం కల్పించడం జరిగినది. మరిన్ని వివరాలకు శ్రీ విశ్వజననీపరిషత్ కార్యాలయం వారిని సంప్రదించగలరు.
06-08-24 : ఆవరణలోని అక్కయ్యలచే శ్రీ హైమవతీ దేవి ఆలయంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతము జరిగినది.
28-7-24, 31-7-24, 4-8-24, 7-8-24 తేదీలలో ప్రత్యేక సందర్భాలలో వేకువ జామున అర్కపురి వీధులలో నగర సంకీర్తన గావించారు.
09-08-24 – 13-08-24 వరకు అందరింటి వేదికగా, శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్యగారి ఆధ్వర్యవంలో, ఆవరణలోని అక్కయ్యలు, మాతృశ్రీ ఓరియంట్ కళాశాల విద్యార్థినుల సహాయ సహకారాలతో
అమ్మ పవిత్రోత్సవాలు ఘనంగా జరిగినవి.
ఈ సందర్భంగా ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలలో మొదటి రోజు వేడుకలు అందరిమామయ్య దంపతులు శ్రీ మన్నవ లక్ష్మీ నరసింహారావు గారు, శ్రీమతి మన్నవ శేషు గార్లు మరియు మొవ్వా కృష్ణప్రసాద్, శేషుమణి దంపతులచే నిర్వహించబడగా రెండవ రోజు శ్రీమతి వఝౌ అరుణశ్రీ గారు, మూడవ రోజు శ్రీ యల్లాప్రగడ మధుసూదన్ రావు, శ్రీమతి లలితగార్లు నిర్వహించగా నాల్గవ రోజు వేడుకలను కీ.శే. బుద్ధిమంతుడు అన్నయ్యగారి కుటుంబ సభ్యులైన శ్రీ మేళ్ళచెరువు సాయిబాబు, శ్రీమతి అనంత సీతాలక్ష్మి దంపతులు నిర్వహించారు. ఐదవ రోజున శ్రీ తుర్లపాటి సుబ్రహ్మణ్యంగారు, శ్రీమతి కల్యాణి గార్లు మరియు శ్రీ టి.వి.ఎస్. మల్లిఖార్జున్ రావు, శ్రీమతి ధనలక్ష్మీ దంపతులు నిర్వహించారు.
అలానే ఈ పవిత్రోత్సవాల ముగింపు సందర్భంగా 11వ రోజున ఉదయం శ్రీమతి బోళ్ళవరలక్ష్మీ అక్కయ్యగారు అన్నప్రసాద వితరణలో పాలుపంచుకోగా, సాయంత్రం వేళ శ్రీ చక్మా శ్రీమన్నారాయణ, శ్రీమతి లక్ష్మీ దంపతుల సహకారంచే పవిత్రోత్సవాలు ఘనంగా ముగిసినాయి. ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలలో అనేకమంది సోదరీమణులు గుప్త విరాళాలను అందజేస్తూ, కార్యక్రమాలు మరింత శోభాయమానంగా జరిగేందుకు తోడ్పడ్డారు.
11-08-24 : ఆదివారం- చిరంజీవి రామకృష్ణ కాశ్యప్, చి.ల.సౌ. తేజ లిఖితల వివాహ నిశ్చితార్థం అమ్మ సన్నిధిలో వైభవంగా జరిగింది. చి. రామకృష్ణ కాశ్యప్, శ్రీ కొండముది ప్రేమకుమార్, శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతుల కుమారుడు.
12-08-24 : అమ్మ నామ సంకీర్తన వాత్సల్యాలయ వేదికగా జరిగినది. మహాహారతితో అక్కయ్యలు నీరాజనమందించారు.
13-08-24 : అవరణలోని అక్కయ్యలు శ్రీ హైమాలయంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతము భక్తప్రపత్తులతో నిర్వహించుకున్నారు.
15-08-24 : గురువారం- చి.రామ్ ప్రసాద్, చి.ల.సౌ. నాగసాయి కామేశ్వరి స్రవంతిల వివాహం జిల్లెళ్ళమూడిలో వైభవంగా జరిగింది.
15-08-24 : శ్రీ అన్నపూర్ణాలయ వార్షికోత్సవము సందర్భంగా అందరంటి ప్రాంగణంలో శ్రీయుతులు మరకాని దినకర్ అన్నయ్యగారిచే అమ్మ పతాక ఆవిష్కరణజరిగింది. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థినులు అమ్మ జండా పాటను ఆలపించారు. అనంతరం శ్రీ దినకర్ అన్నయ్యగారు, శ్రీ ఎం.వి.ఆర్. సాయిబాబు గారు అన్నపూర్ణాలయ విశిష్టతను గురించి అమ్మ మాటలను ప్రస్తావన చేస్తూ వివరించారు. అనంతరం అందరూ అమ్మ ప్రసాదంగా అల్పాహారం స్వీకరించారు. అనంతరం శ్రీ అనసూయేశ్వర ఆలయంలో శాకంభరీ అలంకరణలో శోభాయమానంగా అమ్మ దర్శనమివ్వగా, అమ్మకు అలంకరణకు వినియోగించిన కాయకూరలను ప్రసాదంగా గ్రామస్థులకు వితరణగావించడం జరిగింది. శ్రావణ శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీ అనయేశ్వరాలయంలో శ్రీ అనసూయా వ్రతము జరిగినది. 12 గంటలకు అమ్మ కిరీట ధారిణిగా దర్శనమిచ్చారు. ఆ సమయంలో ఆలయంలోని అక్కయ్యలు అమ్మ దండకమును, శ్రీ హైమవతీ జనయిత్రీ స్తోత్రాన్ని ముక్తకంఠంతో ఆలపించారు. అన్నపూర్ణాలయంలో అన్నపూర్ణాలయ సిబ్బందిచే అన్నపూర్ణేశ్వరి స్వరూపిణి అగు అమ్మ పూజ ఘనంగా జరిగినది. పూజ అనంతరం విశ్వజనని పరిషత్ ఉభయట్రస్టుల సిబ్బందికి అమ్మ వస్త్ర ప్రసాద వితరణ జరిగినది.
15-08-24 : మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు మాతృశ్రీ గోశాలను సందర్శించి, గోసేవలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోవులకు పచ్చగడ్డిని సమర్పించారు.
16-08-24 : శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ హైమాలయంలో శ్రీ వరలక్ష్మీ వ్రతం అత్యంత వైభవోపేతంగా జరిగినది. జిల్లెళ్ళమూడి గ్రామస్థులు, ఆవరణలోని అక్కయ్యలు, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థినులు అందరూ కలసి భక్తి ప్రపత్తులతో వ్రతాచరణ గావించి, వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు..
శ్రీ బి. సుబ్బారావు – Bapatla Joint Collector గారు సతీసమేతంగా అమ్మను దర్శించుకుని, ప్రసాదాన్ని స్వీకరించారు.