1. Home
  2. Articles
  3. Viswajanani
  4. “దయలేని హృదయమే దయ్యం” – అమ్మ

“దయలేని హృదయమే దయ్యం” – అమ్మ

Dr Brahmandam Ranga Sai
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 24
Month : February
Issue Number : 7
Year : 2025

దయ, ప్రేమలను గురించి చెప్పేటప్పుడు మంచి హృదయం ఉన్నవాడు అంటాము.

“ప్రియతే విషయైరితి హృదయం”-అని అమరకోశం. (విషయాదులచే హరింపబడునది హృదయం)

ఒక్కొక్కరికి ఒక్కొక వృత్తి, ప్రజ్ఞ ఇవ్వబడ్డాయి. చిత్స్వరూపిణి అయిన అమ్మ తన నిర్ణయం ప్రకారం ఆ పనికి కావాల్సిన మేధ, అవకాశము ఇస్తుంది. కొంత మంది యొక్క వృత్తి లక్షణము మాటలతో చెప్పేది కాదు. ఏ రోజైనా హాస్పిటల్లో ఎందరికి నయం చేయగలిగితే అంత సంతృప్తి.

తగ్గింది రోగము అని నలుగురిలో మంచి చెపుతాడు రోగి, వైద్యములో నైపుణ్యము, మేధస్సు వైద్యుని కృషి, సేవ అసాధారణం. అంతర్వాహినివలె బయటకు కనుపించకుండా ప్రవహిస్తుంది ఆ ప్రవృత్తి.

హృదయము, మేధ రెండు గుర్రాలకు సారథిగా నిమిత్త మాత్రంగా లోపల ప్రకాశంగా వెలుగుతూ అమ్మే నడిపిస్తుంది, రక్షిస్తుంది.

దయ హైమక్క అయితే, ప్రజ్ఞగా జీవుణ్ణి తన వశంలో పెట్టుకున్న శివ శక్తి స్వరూపిణి అమ్మ.

జీవుల ఆకలి, యోగక్షేమాలు చూస్తూ ఆదరించే అమ్మ కొంత మందిని ఉపకరణాలుగా చేసికొని ఎన్నో సేవాసంస్థలను నెలకొల్పింది, నడిపిస్తోంది. ‘అందరిల్లు’ అన్ని జీవులకోసం, కేవలము మనుష్యులకు మాత్రమే కాదు.

సకల జీవులపట్ల దయ కలిగి ఉండటమే మానవత్వం కదా! “దయ లేని మనస్సే దయ్యం” అని కదా అమ్మమాట!

సూత్రధారి, పాత్రధారి, విధి విధానం తానే అయిన అమ్మ పద్ధతి మౌనం, అగ్రాహ్యం. వివరించడం సాధ్యమా?

జగమేలు తల్లికి జేజేలు

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!