జిల్లెళ్ళమూడిలో శరీరధారిణియై యున్నట్టి జగన్మాత అమ్మను గురించి నేను చెప్పగలిగినది చాలా సూక్ష్మము. అంతా తానేయైనది, అంతు లేనిది అగు అమ్మనుగూర్చి నేను తెలుసుకొంటినసుకొన్న కొన్ని వైద్యశాస్త్ర అనుభవాలను వివరించటానికి అమ్మ అనుజ్ఞతో ప్రారంభిస్తాను.
ADDa is a Medical MarDel అమ్మ ఒక అసాధారణ వైద్య ప్రవీణ. అంతేకాదు అమ్మ ఒక అసాధారణ రోగి కూడాను.
ఆమెకు 5 సంవత్సరాల వయస్సున్నప్పుడు అమ్మ తాతమ్మ మరిడమ్మ గారికి భరించరాని కాలునొప్పి వచ్చేదట. కొద్దిదూరం నడిస్తే చాలు విపరీతమైన బాధ కలిగి నడవలేక ఆగవలసివచ్చేదట. ఆమె ఒక రోజు నీళ్ళ బిందె మోసుకొనివస్తూ నడవలేక కాలినొప్పితో’ కూలబడిపోతే అమ్మ చూచి “తాతమ్మా జున్ను తిను. నీ జబ్బు తగ్గుతుందని” చెప్పేరట. ఒకే ఒక డోసు జున్నుతో ఆమెగారి కాలినొప్పి పూర్తిగా మాయమయింది.
జున్నుతో కాలినొప్పి ఎట్లా తగ్గుతుంది అని అడగగా ఆమె శరీరంలో లోపించిన పదార్థం దానిలో వున్నది. ఆ లోపం జున్ను తినటంతో పోయింది. కాలినొప్పి పోయింది అన్నారు అమ్మ. 5సం॥రాల పిల్లకు ఏది లోపించిందో తెలుసునటా – ఆ లోపించిన పదార్థం జున్నులో వున్నదని తెలుసునట. ఆమె భిషగ్వరేశ్వరిగాక మరేమి? ఈ వుదంతం అమ్మ స్వయంగా నాతో చెప్పిన విషయం కనుక దీనిని ప్రథమంగా వివరించటం జరిగింది.
ఏదైనా అసాధారణమైన విషయం ఆమె వలన జరిగిందని మనం పూర్తిగా నమ్మి చెప్పినా సామాన్యంగా దానిని అమ్మ వప్పుకొనక దాని తరుణం వచ్చింది గనుక జరిగింది అంటారు. లేక నీవు చాలా మంచివాడవు, ఆ పని చాలా శ్రద్ధగా చేశావు గనుక అది అంత అసాధారణంగా జరిగింది. అంతే కాని నేనేమి చేశాను, అంతా నువ్వే చేశావు అని తప్పించుకొంటారు. తెరలు కప్పి మాయపుచ్చటం అమె స్వభావాలలో ఒకటి. నా స్వానుభవాలు కొన్ని వివరిస్తాను.
భారతీయ సైన్యంలో మేజరుగా వున్న ఒక సోదరుని భార్యకు ఒక రకమైన అసాధారణమైన జబ్బుచేసింది. కాళ్ళలోను, చేతులలోను కీలుకు, కీలుకు మధ్యస్థానాలలో వాపులు, నడుములలోను, మెడలోను భరించలేని బాధలు. జబల్పూరులో వున్న ఆ దంపతులు ఆర్మీ హాస్పిటలుకు వెళ్ళి Specialist treat ente చాలా రోజులు ఆమెను వుంచారు. ఏ పరీక్ష చేసినా ఆ జబ్బు ఫలానా అని జబల్పూర్లో నిర్ణయించటం జరుగలేదు. మందుల వల్ల తాత్కాలికమైన ఉపశాంతియే కాని పూర్తి నివారణ జరుగలేదు. వారి Annual flea Deలో వాళ్ళు నావద్దకు Treatment కోసం వచ్చారు. నాకు అందుబాటులో వున్న సమస్త పరీక్షలు చేయించాను. Connective Tissue Inflammation due to some unknown cause బహుశః Autoimmune disease కాబోలు ననుకొని మందులు వాడాను. మరల తాత్కాలిక ఉపశాంతియే కాని నివారణ కాలేదు. వారు Ho eo వైద్యం చేయించమంటారా అని నన్నడిగారు. సరే నన్నాను. నెల్లూరులోని ప్రముఖ Ho eo వైద్యుని చేత చికిత్స చేయించారు. కాని ఏ మాత్రం గుణం లేదు. అలాగే ఆయుర్వేదం, అలాగే భూతవైద్యం గూడా అయి పోయాయి. మళ్ళా నన్ను అడిగారు ఏం చెయ్యమంటారు అని. నాకు గూడా దీని సంగతి తెల్సుకోవాలని ఉబలాటంగానే వున్నది. అందువల్ల నేనే వాళ్ళను మద్రాసులో గొప్ప పేరుగల ఒక స్పెషలిస్టు వద్దకు తీసుకు వెళ్ళాను. (DarShan uga Sundaran) ఆయన ఇంకొక స్పెషలిస్టు చేత గూడా పరీక్షలు చేయించారు. కాని వారు కూడా ఏ నిర్ణయానికి రాలేకపోయారు. ఏ డాక్టరుకు గూడా యీ వ్యాధి తలఒగ్గలేదు. ఇప్పుడేం చేద్దాం అన్నారు ఆ దంపతులు. ఆ భగవానుని పాదాలే శరణ్యం – పదండి జిలెళ్ళమూడికి అని నేనే వాళ్ళను అమ్మపాదముల సన్నిధికి తీసికొని వెళ్ళి నీవేతప్ప నితఃపరంబెరుగ రక్షింపందగున్ రోగినిన్ అని శరణు వేడాము. ఆర్మీ ఆఫీసరుగారు తనభార్యను అమ్మ వద్ద వదలి వెళ్ళారు, అమ్మ రోజూ మార్చి మార్చి మందులిచ్చేవారట. కొద్ది రోజులలోనే ఆమెకు పూర్తి స్వస్థత చేకూరింది. ఆమె పూర్తి ఆరోగ్యంతో ప్రస్తుతం తన భర్తతో ఢిల్లీలో వున్నది.
జిల్లెళ్ళమూడి నివాసిని అయిన ఒకామె సుమారు రెండు సంవత్సరాలుగా నడుము, కుడికాలు నొప్పితో బాధపడుతూ వుండేది. నొప్పితగ్గించే మాత్రలు హోమియో మందులు ఆయుర్వేదం మందులు చాలా పుచ్చుకున్నది. కాని క్రమక్రమంగా నొప్పి ఎక్కువవుతూ వచ్చింది. తరువాత ఆమె మద్రాసు వెళ్ళి DrRaD a Murty గారిని consult చేసింది. ఆయన మందులు రాసిచ్చి తగ్గకపోతే ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. వారి మందులతో తగ్గలేదు. నేను ఒక మారు జిల్లెళ్ళమూడి వెళ్ళినప్పుడు నాకు ray iliac joint T. అని నిర్ణయించి ఆ విషయం అమ్మతో చెప్పాను. ఏం చెయ్యమంటావు అని అమ్మ అడిగారు. గుంటూరులో Ortho Daedic Surgeon Dr Ethirajulu గారికి చూపిస్తే మంచిదేమో నన్నాను. ఆమె గుంటూరు వెళ్ళి వారిని consult చేసింది. వారు అదే జబ్బని నిర్ణయించి 6 నెలలు ఆమెను ed లో వుంచి Treatment చేశారు. కాని క్రమక్రమంగా నొప్పి ఎక్కువవుతూ వచ్చి రెండవ కాలుకుగూడా వ్యాపించి కాళ్ళలో బలహీనత ప్రారంభమయింది. వారు ఆమెను మరల పరీక్షించి యీ జబ్బు తనవల్ల కాదనీ హైదరాబాద్ కాని, వైజాగ్ కాని తీసుకొని వెళ్ళమన్నారుట. తరువాత గుంటూరులో Neuro surgeon ను consult చేశారు. వెన్నుపాములో కణితి పెరుగుతున్నదనీ, కాళ్ళలో పక్షవాతపు సూచనలు కనిపిస్తున్నాయనీ, ఆపరేషన్ చేసినా కాళ్ళు బాగుపడి ఆమె నడవగలదని తనకు నమ్మకం లేదని అభిప్రాయం వెలిబుచ్చారు. ఆ సమయంలో అమ్మ చిత్తూరుజిల్లా పర్యటనలో పున్నారు. Neurosurgeon గారి అభిప్రాయం జిల్లెళ్ళమూడికి తెలియచేయబడింది. అందరూ చాలా గాబరాపడ్డారు. ఈ సమాచారాన్ని మోసుకొని Sri KIG[Krishna Murthy గారూ Sri Darah anda SuDDa Rao Garu నెల్లూరు తీసుకొని వచ్చి నాకు అందజేసి సలహా అడిగారు. మేము ముగ్గురం ఆలోచించి అమ్మవద్దకు Datientను తీసుకొని వెళ్ళటానికి నిశ్చయించారు. గుంటూరు నుంచి ఆమెను కారులో మదనపల్లికి తీసికొని వెళ్ళాము. ఆమె అతిప్రయాసతో మా సహాయంతో అమ్మ విడిదిచేసిన శ్రీ కృష్ణమూర్తి యింటిలోనికి తప్పటడుగులు వేసినట్లుగా నడిచి వచ్చింది. ఆమెను క్రింద గదిలో పడుకోబెట్టి నేను పైకి అమ్మవద్దకు వెళ్ళి అమ్మ పాదపద్మములపై వ్రాలి ‘శరణు శరణు కరుణాకరి శుభకరి’ అని శరణువేడాను.
అన్నీ తెసిన అమ్మ ఏమీ తెలియనట్లుగా ఏమిటి నాన్నా అని ఆడిగారు. పరిస్థితి వివరించి నీవుదప్ప దిక్కులేదన్నాను. అప్పుడు అమ్మ రిషీవాలీ స్కూలుకు వెళ్ళటానికి సన్నద్ధమౌతున్నారు. సరే క్రిందకు వచ్చి Da అవ్వీ చూపించి పరీక్ష చేయించుకున్నది. నేను sacrotient వున్న గదిలోనికి వెళ్ళారు. నేను లోనికి వెళ్ళటానికి వీలు కాలేదు. 10 నిమిషాలు లోపల వున్నారు. అది ఏమి ట్రీట్మెంటో కాని Datient చక్కగా ఏమీ ఆధారం లేకుండా నడుస్తూ గదినుంచి బయటకు వచ్చింది. ఆమె వెనుక నవ్వుతూ అమ్మ వచ్చారు. ఆమెను కారులో ఎక్కించుకొని అమ్మ బయలు దేరారు. యీ సంఘటన అచ్చట నున్న వారందరినీ అమిత ఆశ్చర్యచకితుల్ని చేసిన అపూర్వ సంఘటన. తనను పూర్తిగా అమ్మకు అర్పించుకొనిన ఆ స్త్రీరత్నం హాయిగా తిరుగుతూ యిప్పుడు జిల్లెళ్ళమూడిలోనే వున్నది. ఆ పక్షవాతమేమైనదో, ఆ ట్యూమర్ ఏమైనదో, ఆమె నెత్తురు పరీక్షలు నెల్లూరులో (అమ్మ వద్దకు మదనపల్లి వెళ్ళకముందు) చేసినపుడు ES R వున్నది. మదనపల్లి నుంచి తిరిగివచ్చి చూస్తే 18 0 వున్నది. ప్రసిద్ధి గాంచిన వైద్యులవలన కించిత్తయినా నయముకాని యీ వ్యాధి క్షణంలో మాయం చేసిన ఆ అమ్మ – మహాభిషగ్వరేశ్వరి కాదా?
1978వ సంవత్సరం సెప్టెంబరు నెలలో అమ్మ నెల్లూరు వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఒకటి వుదహరిస్తాను. మా సన్నిహితుడు ఒక కుర్రవాడు సకుటుంబంగా అమ్మ మాయింటిలో విడిదిచేసిన సమయములో అచ్చట వుండటం తటస్థించింది. అమ్మ జిల్లెళ్ళమూడి తిరుగు ప్రయాణమునకు ముందురోజున అతనికి చాలా ఉధృతముగా MAMA (ఉన్మాదము) అను మానసిక వ్యాధి ప్రారంభమైనది. ఈ వ్యాధి అతనికి 1965లో మొదటిసారి వచ్చినప్పుడు నేను వెద్యం చేయగా తగ్గటానికి 3 నెలలు పట్టింది. రెండవసారి 1972లో వచ్చినప్పుడు అతను బొంబాయిలో వున్నారు. అచ్చట psychiatrist చేత వైద్యం చేయబడింది. తగ్గటానికి సుమారు 4 నెలలు పట్టింది.
అమ్మ మా యింటిలో వుండగా అతనికి యీ వ్యాధి ప్రాప్తించటం అతని ఆత్మ బంధువులకు పరిపరి విధాల మానసిక ఆందోళనలకు, విపరీత ఆలోచనలకు, ఆరోపణలకు గూడా కారణమయింది. నేను నిద్రమాత్ర తీసుకొనమంటే నిరాకరించాడు. అతనిని అమ్మ వద్దకు తీసుకొని వెళ్ళాము. అమ్మ నా వద్ద వున్న మాత్రను తీసికొని అతనిచేత మ్రింగించారు. కాని అతను నిద్రపోక రాత్రి అంతా నానా గలభా చేశారు. ఉదయం అమ్మ బయలుదేరే సమయానికి అతని పరిస్థితిలో మార్పు లేదు. నాకు అమ్మతోపాటుగా ప్రయాణం చేయాలని వున్నది. ఇంట్లో పరిస్థితినిబట్టి ఎట్లా బయలుదేరటమా అని వున్నది. అమ్మ కారులో ఎక్కబోయేముందు అమ్మనే అడిగాను. నువ్వు నాతో వచ్చెయ్యి నాన్నా వాడికి తగ్గిపోతుందిలే అని అమ్మ అభయం ఇవ్వటం – నేను కనీసం పాదరక్షలు గూడా లేకుండా కారులో ఎక్కటం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆ రోజు రాత్రి నేను తిరిగి వచ్చేటప్పటికి అతను పూర్తి స్వస్థతతో వున్నాడు. యీ విషయం తరువాత బొంబాయి లోని [psychiatrist తో ప్రస్తావించగా ఆయన i Docile అన్నాడట.
యీ పై 3 కేసులు అమ్మ స్వయంగా వైద్యం చేసి నివారించినవి. ఇలాగా ఏ మందూ సరిపడని నెల్లూరులో ఒక డాక్టరుగారి భార్యకు ప్రమాదమైన గుండెజబ్బు అమ్మ పాదతీర్థంతో పూర్తి నివారణ అయింది. అమ్మ తన గుండెలమీద చేయి పెట్టి రాస్తే బాగుండును అని మనస్సులో కోరుకున్న నా పేషెంటు (Heart attack patient) తన దగ్గరకురాగానే అమ్మ అతని గుండెలమీద చేయి పెట్టి ఎట్లావుంది నాన్నా అని అడగటం కరెంటు పాసయినట్లుగా అతను feel కావటం – తరువాత అతను పూర్తిగా కోలు కోవటం ECGలో వెంటనే మార్పులు రావటం జరిగాయి. అమ్మ కుంకుమ కలిపిన నీటితో ఒక Intestinal obstruction case విచిత్రంగా నయమయింది.
ఇలాంటిదే అనేక అనుభవాలు. అమ్మ వైద్యశాస్త్ర విజ్ఞానం అపూర్వమైనది. అమ్మ ఒక అసాధారణ రోగికూడాను అని ప్రథమంలో మనవి చేశాను. వివరించ ప్రయత్నిస్తాను. 1962 లో ననుకుంటాను. అమ్మకు అనారోగ్యంగా వున్నదని ట్రీట్మెంటుకు మద్రాసు తీసుకొని వెళ్ళటం జరిగింది. డాక్టర్ వైద్యనాధన్ అనే ప్రముఖ వైద్యుని యింటికి ప్రొద్దునపూట అమ్మను తీసికొని వెళ్ళారు. ఆయన పూజామందిరంనుంచి హాలులోనికి వచ్చి అమ్మ వంక కొంత సేపు కన్నార్పకుండా చూచి నీవు దేవతవా, కాకపోతే రాజపుత్ర స్త్రీవా-ఎవరమ్మా నీవు’ అని ప్రశ్నించాడు. ‘అమ్మ’ను నాన్నా, అని అమ్మ డాక్టరుగారికి ఆపిల్ పండు ఒకటి అందించింది. తన శరీర అనారోగ్యం గురించి అమ్మ వివరించారు. ఆయన అమ్మ పాదపద్మములకు సాష్టాంగ పడి చాలాసేపు తన్మయత్వంలో నుండి దేవతకు అనారోగ్యం ఏమిటమ్మా నన్ను తరింప చేయటానికి యీ విధంగా వచ్చావు. నా తపస్సు ఫలించింది అన్నారట.
1970 వ సంవత్సరంలో అమ్మ నాకు ఒక కబురు చేశారు. ఒంటి డాక్టరు, పంటి డాక్టరు, కంటి డాక్టరు కావాలి. నెల్లూరు నుంచి తక్షణం బయలు దేరి రమ్మని. ఇద్దరం ఒంటి డాక్టర్లమూ, ఒక కంటి డాక్టరు, ఒక పంటి డాక్టరూ బయలు దేరి జిల్లెళ్ళమూడి వెళ్ళాము. అమ్మకు మేము పాదాభివందనములు చేసి కూర్చున్నాము. తన శారీరక అనారోగ్యం గురించి విపులంగా ఒక అరగంట సేపు Chronological order లో అమ్మ వివరించి చెప్పారు. ఆ విపులీకరణలోనే సమస్త వ్యాధులు సాక్షాత్కరించాయి. అమ్మ మంచినీరు తప్ప regular గా ఏమీ ఆహారం తీసుకొనరు. బలవంతం చేస్తే కొద్దిగా కాఫీ త్రాగుతారు. ఏదన్నా నైవేద్యం పెట్టినపుడు కొద్దిగా నాలుకకు రాచుకుంటారు. ఏదీ తినరు – ఏదీ తినగూడదని నియమం గూడా లేదు. ఈ కలిలో నాకు ఆకలి లేదు అని పసిప్రాయంలోనే చెప్పారట. అట్టి అమ్మకు మేము పరీక్షించినపుడు మూత్రములో 2% Sugar వున్నది. Blood Pressure వున్నది. ఒకటేమిటి అనేక వ్యాధుల లక్షణాలు గోచరించాయి. ఆహారం లేకుండా జీవించటమే అసంభవం. మానవ శరీరంలో మధుమేహ వ్యాధి వున్నపుడు ఆహారం తీసికొనకపోతే శీఘ్రగతిలో శరీరం క్షీణించడం Star[ation Kitoris రావటం, ప్రాణహాని సంభవించడం జరగటానికి ఎంతో కాలం పట్టదు. కాని ఈ అమ్మలో ఆ Co locations సూచన ప్రాయంగా లేవు – కారణం – దైవత్వమే ననిపించింది.
మేమందరం ఆలోచించి ఒక మందుల లిస్టు తయారుచేసి అమ్మకు డాక్టర్ల హుందాతనంతో అందించి పుచ్చుకోమన్నాము. కాని వానితో అమ్మకు ఏమాత్రం గుణం కనిపించలేదు. తరువాత నేను అమ్మను ప్రార్ధించాను. అమ్మా- lagyl అనే మాత్రలు ఇస్తున్నాను. ముఖ్యంగా చిగుళ్ళ వాపులు తగ్గటానికి. దీనితోనే సర్వబాధలు, జబ్బులు తగ్గాలని ప్రార్థిస్తున్నాను అని. ఆశ్చర్యం. సర్వ రోగ లక్షణాలు lagyl మాత్రలు తీసుకున్నంత కాలం అంతరించినవి. మూత్రంలో Sugar గూడా లేదు. నాకు గర్వం గలిగింది. Dia De Tes మందు కనిపెట్టేశానని విర్రవీగి చాలామంది Datients కు flagyl prescribed చేశాను. కాని గుణం శూన్యం. ప్రార్థనతో జబ్బు తగ్గే యీ రోగి నిస్సందేంగా అసాధారణ రోగియే.
ఇంకొక సమయంలో నేను అమ్మ వద్దకు వెళ్ళినపుడు అమ్మ భరించరాని తలనొప్పితో బాధపడుతూ ఉన్నారు. ఒక చెంబులో నిప్పులు పోసి కాపు చేయించుకొంటూ “యిన్ని మాత్రలు యిచ్చారు, కానీ తగ్గలేదు” అన్నారు. పాదప్రణామం చేసి అడిగాను. బాధ తగ్గటానికి మార్గం చెప్పమని. నీ ఆవేదనతోనే నా బాధ పోతుంది నాన్నా అన్నారు అమ్మ. ఏం చెయ్యాలో పాలు బోక గది నుంచి బయటకు వచ్చి మెట్లు దిగుతుండగా నాకు ఆవేదన ప్రారంభమయి కళ్ళవెంట నీళ్ళు కారటం మొదలయింది. క్రిందకు వచ్చి హైమాలయంలో కూర్చుని ఒక అరగంట కాలం నా అదుపులో లేని ఆవేదన అనుభవించాను. తరువాత పైకి మరల వెళ్ళాను. అమ్మ మంచంపై కూర్చుని ఆనందంగా సోదరీ సోదరుల పూజలందుకుంటున్నారు.
అదే విధంగా అమ్మ చిత్తూరుజిల్లా పర్యటన సందర్భంలో నెల్లూరులో ఆగిన సమయంలో గూడా జరిగింది. విపరీతమైన దగ్గుతో, ఆయాసంతో జ్వరంతో అమ్మ నెల్లూరు చేరారు. “మందులు వేసుకుంటూనే వున్నాను నాన్నా తగ్గటం లేదు” అన్నారు. నేను యిచ్చిన మందు వేసుకుంటూ. సరే యింకో మంచి మందు యిస్తాను అని ఇంకొక Cough syrup సీసా తీసుకు వచ్చాను. దానితో నల్ల మందు కలిస్తే నాకు వద్దు నాన్నా అని అమ్మ అనగానే Shock అయ్యాను. దానిలో నల్ల మందు కొద్ది ప్రమాణంలో వున్నది. సరే ఆవేదనతోనేగా తగ్గేది. అది యివ్వవలసినది గూడా నీవే కదా? అని ప్రణమిల్లి గదినుంచి బయటకు వచ్చాను. జిల్లెళ్ళమూడి నుంచి అమ్మతో వచ్చిన అన్నయ్యలకు భోజనాది వసతులు, మేడపైన ‘మాతృశ్రీ అధ్యయన పరిషత్’ Meeting కు కావలసిన అరేంజ్మెంట్ లో నిమగ్నమైనాను. తరువాత అమ్మ స్నానం చేసి పైకి వచ్చారు. మేమందరం పూజ చేసుకున్నాము. యీ హంగామాలో ‘ఆవేదన’ విషయం మరచినాను. Meeting అయిన తరువాత నా [ed room లో నిద్ర కుపక్రమించాను. ఇక తెల్లవార్లూ భరింపలేని ఆవేదన. కళ్ళనీళ్ళతో దిండు తడిసిపోయింది. తెల్లవారేసరికి అమ్మ దగ్గూ, జ్వరం, ఆయాసం అన్నీ నా ఆవేదనతోనే మాయం అయ్యాయి. అందరూ అనుకున్నది నామందులు పనిచేశాయని. కానీ ఆవేదన అనే నా నివేదనతో అమ్మ తన ఆరోగ్యం కుదుటబరచుకున్నారు. Is She not a Medical arel ఆమె అసాధారణ రోగి కదా!
అలాగే గుంటూరులో డాక్టర్ లక్ష్మణరావుగారు రోజుకు 0 units Insulin ఇచ్చినప్పుడు (ఆహారం ఏమీ లేకుండా) అమ్మ DiaBetic condition లో ఏమీ మార్పు రాలేదట. భోజనం చేయకపోతే ప్రమాదం. కొద్దిగానైనా ఆహారం తీసుకొనమని వారు సలహా యిచ్చారట.
డాక్టర్ సత్యనారాయణమూర్తిగారు అంటారూ ‘మనం చొక్కాతీసి వంకెన తగిలించినట్లు ఆ బాధలు, జబ్బులు అన్నీ తీసి వంకెకు తగిలించి వేస్తారు అమ్మ’అని జగన్మాతవు నీకీ జబ్బులేమిటమ్మా? అంటే, అవ్వి మాత్రం ఎక్క డకు పోతాయి. వాటికీ ఆధారం కావాలిగా అన్నారు.
MarVelous Doctor MarVelous Dalientగా నాకు తెలిసిన మేరకు అమ్మనుగూర్చి చెప్పాను. ఇక అమ్మ డాక్టరుగా నాకు ఇచ్చిన సలహాలు అమ్మ ఆజ్ఞలు అందరికి అందించ ప్రయత్నిస్తాను.
(1) నీ వద్దకు వచ్చే రోగులు బాధతో వస్తారు. వారికి ప్రేమతో, ఆదరణతో ట్రీట్మెంటు యివ్వు. నీ మందులు ఎంత ముఖ్యమో నీవు చూపే ప్రేమాదరణలు అంతే.
(2) నీకు జబ్బు అర్థం కాకపోయినా, ట్రీట్ మెంటు నీకు సాధ్యం కాకపోయినా నీకంటే పెద్దవైద్యుని వద్దకు రోగిని పంపించు.
(3) డబ్బూ, కీర్తికోసం రోగులను పీడించకు. ప్రేమతో, sincere గా వైద్యంచేస్తే కీర్తీ, డబ్బూ వెతుక్కుంటూ
నీ వద్దకు వస్తాయి. అమ్మ సంకల్పం తిరుగులేనిది. తన బిడ్డలను Instruments ఉపయోగించి కార్యసాధన సాగిస్తారు. అమ్మ స్వర్ణోత్సవాల ముందర ఇంజనీరు తాతగారికి (శ్రీ సీతారామయ్య గారు retired Engineer Madras) ఒక కలవచ్చిందట. జిల్లెళ్ళమూడిలో బ్రహ్మాండమైన పందిళ్ళు. లక్షలజనం భోజనాలు. ఇదీ కల. అమ్మతో చెప్పగా ప్లాను వేసి పన్లు మొదలు పెట్టమన్నారు. ఒకే పంక్తిలో లక్షమంది భోజనానికి ఏర్పాట్లు చేయమన్నారు. ఇది సంభవమని తోచలేదు. కాని ఆ స్వర్ణోత్సవాలు ఎంత కన్నుల పండువుగా జరిగాయో ఒకలక్ష ముప్పదివేలమంది ఒకే పంక్తిలో ఒకేసారి భోజనాలు చేయటం కళ్ళారా చూశాము. ఇటు జనములు, అటు జనములు, ఎటు చూచిన యోజనములు జనగణములు భోజనములు జననికి నీరాజనములుగా జరిగాయి. ఇది అపూర్వం.
అలాగే 1971లో నరసాపురం డాక్టరు శ్రీ కేశవరావుగారికి ఒక కల వచ్చిందట. జిల్లెళ్ళమూడిలో Matrusri Research centre. బ్రహ్మాండమైన భవనాలు, గొప్ప ఆస్పత్రి. సైన్సు సర్వశాఖల్లో గొప్ప Research జరుగుతున్నట్లూ ప్రపంచంలోకెల్లా గొప్ప రీసెర్చి సెంటరుగా రూపొందినట్లుగా కల. వారు ఒక ఇంజనీరును తీసుకొని అమ్మ వద్దకు వచ్చారు. ఆ సమయంలో నేనూ అక్కడనే వున్నాను. వారు తమ కలను అమ్మకు నివేదించగా అమ్మ మరునాడే MRICIశంఖుస్థాపన చేశారు. దానికి తరుణం త్వరలో రాబోతున్నది, ప్రథమంగా ఉచిత వైద్యశాల భవనం. వారి మిగతాసైన్సు విభాగాలు. ముగ్గురు ప్రముఖ వైద్యులు డాక్టర్ కేశవరావుగారు, డాక్టర్ ప్రసాదరావుగారు [Surgeon K[GOHO Dizag డాక్టర్ జానకి obstetrician Egr oncologist Madana Dalli అచ్చట స్థిరపడి HosDital లో పనిచేయటానికి అమ్మ అనుజ్ఞను అర్థించటం జరిగింది.
బృహత్కార్యంలో బిడ్డలందరూ పాలు పంచుకోవాలని అమ్మ అభిలాష. కనుక అందరూ ఎవరి శక్త్యానుసారం వారు సహాయ సహకారాలు అందించి ఆ జగజ్జననికి సేవ చేసిన, సంతృప్తి పొందగలరని ప్రార్థిస్తున్నాను.