1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ‘అంఆ’ వున్నదిగా….

‘అంఆ’ వున్నదిగా….

Parsa Hara Gopal
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : April
Issue Number : 9
Year : 2013

ఇది జరిగింది 2005లో, నేను fulbright scholarship మీద ఢిల్లీలో వున్నాను. అది నాలుగు నెలల appointment ఢిల్లీలో మా చెల్లెలు ఇందు కల్యాణి బావగారు శ్రీచమన్ వుంటారు.

నేను ఎలాగూ ఇండియాలో ఇంతకాలం వుంటున్నాను కదాని, మా ఇంటి అమ్మకం కాయితాలు రిజిష్టరు చేద్దామని అనుకున్నాం. మా రెండో అన్నయ్య నన్ను ప్రత్యేకంగా తప్పనిసరిగా, block/white పాస్పోర్టు సైజు ఫోటోలు తీసుకొని రమ్మన్నాడు. రిజిస్ట్రేషనుకు కలరుఫోటోలు తీసుకోరు అని గట్టిగా చెప్పాడు.

ప్రయాణం తొందరలో నేను ఫోటోల గురించి మర్చి పోయాను. హైదరాబాదు రాగానే అన్నయ్య ఫోటోల గురించి అడిగాడు. సోమవారం ప్రొద్దున్నే తీసుకుంటానని చెప్పాను. ఆరోజు ఆదివారం రిజిస్ట్రేషను సోమవారం ఉదయం పదిగంటలకు, ఫోటోలు ఎలా తీయించు కుంటావని మా అన్నయ్య కోపంతో విసుక్కున్నాడు.

ఆదివారం రాత్రి మా అక్కయ్య ఇంట్లో పడుకున్నాను. సోమవారం పొద్దున్న 8 గంటలకు తయారయ్యాను. అప్పుడు మా బావ గారితో సుబ్బారావుగారితో ఇలా అన్నాను.

“బావగారు ! Block/White ఫోటోలు కావాలని అన్నయ్య అంటున్నాడు. ఇక్కడ మన ఇంటిదగ్గర ఏదైనా ఫోటోస్టూడియో వుందా !

సుబ్బారావు బావగారు “గోపీ ! ఇప్పుడు అందరూ స్టూడియోవాళ్ళు Digital ఫోటో లేదా కలర్ ఫోటోలే తీస్తున్నారు. Block White ఫోటోలు తీయడం లేదు. అయినా ఇంత తక్కువ సమయంలో తీయడం కష్టం కదా! అన్నారు.

నేను వెంటనే “అమ్మ వున్నదిగా. ఆమే చూసుకుంటుంది. మనం స్టూడియోకు వెళ్తాం అన్నాను.

విద్యానగర్ బ్రిడ్జి దిగగానే కుడిచేతి వైపున ఫోటో స్టూడియో అప్పుడే తీస్తున్నాడు. టైము 9:00 గంటలయ్యింది. తలుపులు తీయగానే నేను బావగారు లోపలికి వెళ్లాము.మాకు అర్జంటుగా రెండు Block White ఫోటోలు కావాలి. మీరు తీయగల్గుతారా ? అని అడిగాము. టైము 9:15 “B/W కావాలంటే ఫిల్ము అంతా తీయాలి రెండు ఫోటోలు తీస్తే మిగతా ఫిల్మంతా వుండిపోతుంది అన్నాడు. స్టూడియో యజమాని.”

ఏమి ఫర్వాలేదండీ ! మేము పూర్తి ఫిల్ముకు డబ్బులిస్తాం.” అన్నాను నేను.

అదికాదండీ షాపులోనేను ఒక్కడినే వున్నాను. B/W ఫిల్ము డెవలప్డ్చేస్తుంటే ముందు చేసేవాళ్లు ఎవరూలేరండీ.

“కొంచెం ఇబ్బంది కావచ్చు. మాకు ఆ ఫోటోలు చాలా అర్జంటుగా కావాలి. త్వరగా చేసే ప్రయత్నం చేయాలి” అన్నాను నేను.

“నేను ప్రయత్నం చేస్తానుసార్. మీరు తెలిసిన వాళ్లు కాబట్టి” అన్నాడతను మా బావగారికి పరిచయం కనుక.

నేను టైము చూస్తూనే వున్నాను. 9:35 రిజిష్ట్రారు ఆఫీసులో 10:00గం॥ కల్లా వుండాలి. వెంటనే స్టూడియో యజమాని నావి రెండు… ఫోటోలు తీసాడు. అమ్మయ్య కొంతపని జరిగింది. అనిపించింది.

మా అన్నయ్య కొడుకు ద్రుపద్ని అక్కడ వుంచి నేను బావగారు రిజిస్ట్రారు ఆఫీసుకు బయల్దేరాము.

ఫోటోలు కాగానే ఎక్కడా ఆగకుండా time waste చేయకుండా సరాసరి రిజిష్ట్రారు ఆఫీసుకు రమ్మని ద్రుపద్కు ఫోటోకు పూర్తి డబ్బు కట్టాము. బుద్ధిమంతుడు ద్రుపద్ “అలాగే బాబాయ్. కాగానే వచ్చేస్తానని అక్కడే కూర్చున్నాడు.

ఏది ఎట్లావున్నా, ఏది ఏమయినా ‘అంఆ” వున్నది. కదా’ అని నాకు పూర్తి నమ్మకం. రిజిస్ట్రేషను ఆఫీసుచేరేటప్పటికి, ఫోటోలు లేవని అన్నయ్య విసుకుంటున్నాడు. జరిగిన విషయం అన్నయ్యకు చెప్పాను.

అదృష్టవశాత్తు, మా అన్నదమ్ముళ్లు, అక్కచెల్లెల్లు పదిమందిలో నా నెంబరు 7. అంటే నాకంటే ముందు సంతకం పెట్టవలసిన వాళ్లు ఆరుగురు వున్నారు. ఒక్కక్కరు సంతకం పెట్టడానికి జరిగేతంతు దాదాపు 15 ని॥లు. నావంతు వచ్చేవరకు గం॥ 1:30 ని॥ పడ్తుంది. అంటే దాదాపు మధ్యాహ్నం 12 గం॥ అవుతుంది. ప్రతి పది నిమిషాలకు నేనుగేటువైపు చూస్తున్నాను. ద్రుపద్ కోసం ఫోటోల కోసం.

ఒక్కొక్కళ్లు నెమ్మదిగా సంతకాలు పెట్తున్నారు. నేను “జయహో మాతా…” నామం చేసుకుంటూనే వున్నాను.

చివరకు నా వంతు వచ్చింది. ఇంకా ఫోటోలు రాలేదు. “ఫోటోలు ఇవ్వండి” అన్నాడు అక్కడివుద్యోగి.

“అవి వస్తున్నాయి. నేను సంతకాలు పెట్టాను” అన్నాను. అన్నయ్య విసుక్కున్నాడు. ఆఫీసు పెద్దమనిషికి కూడా కోపం వచ్చింది. నేను ఏమిచేయలేను ‘అంఆ’ నామంతప్ప. నేను సంతకాలు పెట్టడం మొదలుపెట్టాను. అన్నీ అయిపోయినై ఫోటోలు అవసరం వచ్చింది.

“ఫోటోలు ఇవ్వండి” అన్నాడు. అక్కడి ఆఫీసరు చేయిచాస్తూ. సరిగ్గా ఆ సమయంలోనే ద్రుపద్ పరుగెత్తుకుంటూ వచ్చి ఫోటోలు చూపించాడు. రక్షించాడు. “ఇదిగోనండి ఫోటోలు” అని చేతికిచ్చాను.

ఆశ్చర్యపోవడం, బావగారి వంతు అంతే, సంతోషించడం నావంతు అయ్యింది. అసలు జరిగిందేమిటో మా ఇద్దరికే తెలుసు. శాంతించడం అన్నయ్య ఆఫీసర్లకు మిగిలింది. ఆఫీసులో, ఈ సంఘటన చూసింది పదిమంది, కానిదాని వెనుక జరిగిన విషయాన్ని తెలిసిన వాళ్లు ముగ్గురు. ఒకరు పనిచేసిననేను, నన్ను చూస్తున్న సాక్షి బావగారు. అందరినీ చూస్తున్న సర్వసాక్షి ‘అంఆ’. నా మనస్సులో ఎక్కడ కలుక్కుమంది. (ఇంత సంతోషంలోనూ) తప్పులు చేయడం నావంతు సరిదిద్దడానికై కష్టపడటం అమ్మ వంతు. తల్లి అంటే బిడ్డలకై కష్టపడుతుందని కదా ! అర్థం .

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!