“నీవు దానాలు చేస్తున్నాననుకుంటున్నావు. గర్వపడుతున్నావు. కీర్తి ప్రతిష్ఠలను ఆశిస్తున్నావు. నిర్మలమైన మనస్సుతో నేను చేస్తున్నాననే భావనలేకుండా నిష్కామంగా దానం చేయాలి. అప్పుడు నీలో ఎటువంటి అహంకారం పెరగదు. లోలోపల అహంకారాన్ని పెంచుకున్నావు. అది ఆత్మవినాశం కలిగిస్తుంది. నీవు చేసే దానాలతో నీ ధార్మిక ప్రవృత్తిని కొలుచుకోవడం కూడా అనర్ధమే. వాస్తవమాలోచిస్తే ఈ లోకంలో నీదంటూ ఏదీ లేదు. భగవంతుడిచ్చిన దాన్ని మంచిమనస్సుతో “నేను ఇస్తున్నాను” అనే భావన లేకుండా భగవత్స్వరూపులైన ఇతర జీవులకు అందిస్తున్నాననే భావంకావాలి. నీవు నిమిత్తమాత్రుడివి. ఇది వరకు నీకు ఇచ్చినవాడు, ఇప్పుడు నీ చేత ఇప్పిస్తున్నవాడు, నీ నుంచి పుచ్చుకుంటున్నవాడు అన్నీ ఆయనే. నిన్నొక నిమిత్తంగా పెట్టి నీకు మంచి పేరు అందిస్తున్నవాడు కూడా ఆయనేనని భావన చెయ్యడం మంచిది. ఇలా అనుకోవడం వల్ల నీకు ఆత్మానుభూతి కలుగుతుంది. అది అమృతత్వానికి దోవ చూపిస్తుంది”.
జానశ్రుతి అనే మహారాజుతో “బండి తోలుకొని జీవనం సాగించే “రైక్వుడు” అనే ఆత్మజ్ఞాని పలికిన పలుకులివి.
“అంతా వాడే చేయిస్తున్నాడు అనుకో, నాన్న” – అమ్మ.