అందరింటి అక్కనూ
అమ్మ కన్న హైమనూ
కనులు తెరచి చూడగా.
మనసు పులకరించదా
తనువు పరవశించదా
|| అం||
చిలకల పలుకుల్లో
కోయిల పాటల్లో..
పూసిన పూలల్లో
తెలిమంచు చినుకుల్లో
|| అం ||
సాగేమబ్బుల్లో
వీచేగాలుల్లో
పాపల నవ్వుల్లో
ఇంద్రధనుసురంగుల్లో .
|| అం ||
అమ్మలోని హైమా
అమ్మ లాంటి హైమ
అమ్మ కోరి తెచ్చుకున్న
సురపారిజాతమా
|| అం ||
వ్యధాభరిత హృదయులను
చేరదీయు హైమా
సేదతీర్చి శాంతినిచ్చి
వరములిచ్చు హైమా
|| అం ||
పాలవంటి మనసున్న
పాలరాతి శిల్పమా
కోరి కొలుచుకున్నవారి
కొంగు బంగారమా
|| అం ||