1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అందరింటి ఆవరణలో క్రిస్టమస్ పండుగ వేడుకలు

అందరింటి ఆవరణలో క్రిస్టమస్ పండుగ వేడుకలు

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 9
Month : January
Issue Number : 6
Year : 2011

డిసెంబర్ 25న క్రిస్టమస్ సందర్భంగా శ్రీ విశ్వజననీపరిషత్ వారు క్రిస్టమస్ పండుగ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా జిల్లెళ్ళమూడి చర్చి ఫాస్టరు రెవ ఐజక్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. శ్రీ బి. రామబ్రహ్మంగారు అధ్యక్షత వహించగా ఆ సభలో కుమారి లతిక పరిచయ వాక్యాలు పల్కారు. ఎమ్. దినకర్, టి.కేశవశర్మ, బి. రామబ్రహ్మంగారు ఏసుక్రీస్తును గూర్చి, అమ్మను గూర్చి వారి ప్రేమతత్వాన్ని వారి చేసిన లోక సేవలను ప్రస్తుతించారు. ఫాస్టర్ ఐజాక్ గారు ఏసుక్రీస్తు ప్రార్థనలు చేశారు. కాలేజీ విద్యార్థినీ, విద్యార్థులు, కుమారి ఇందిర, విశాల  మొదలగు వారు ఏసుక్రీస్తు పాటలు ఆలపించారు. ఎమ్. ఎస్. శరశ్చంద్రకుమార్, కాసినో వంటి ఎలక్ట్రానిక్ పరికరముల సహాయంతో అమ్మ నామము ఆయన పాడి పిల్లలందరి చేత రిధమ్ పలికించి జిల్లెళ్ళమూడి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ప్రారంభోత్సవము చేసినట్లుగా చెప్పారు. కేకన్ను చిన్న చిన్న పిల్లల చేత కేక్ కోయించి ముక్కలను, రస్కులను ఆహుతులకు విద్యార్థినీ విద్యార్థులకు పంచారు. క్రిస్టియన్ ట్రీని అందంగా, బెలూన్స్తోను ఎలక్ట్రిక్ దీపాలతోను అలంకరించి ఈ పండుగకు శోభను గూర్చారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!