1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అందరికీ సుగతి

అందరికీ సుగతి

K B G Krishna Murty
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : January
Issue Number : 6
Year : 2014

నాస్తి నాస్తి కలౌ నాస్తి -హరినామ వినా గతిః

గతి అంటే గమ్యము స్థితి అని నాకర్థమౌతుంది. నాస్తి నాస్తి కలౌ నాస్తి హరి నామ వినా గతి: అని అనుటలో గమ్యము, స్థితి చేరటానికి హరి నామస్మరణము తప్ప వేరే మార్గము లేదు అనే చెపుతున్నది. అనగా గతి అంటే గమ్యము స్థితి. అమ్మ అందరికీ సుగతి అని అనుటలో సమస్త జీవులు చేరవలసిన గమ్యము నేనే అని ప్రకటించడమే. “మీరు నా లోనే పుట్టి నా లోనే పెరిగి, నాలోనే లీనమౌతారు అన్న అమ్మ వాక్యం దీనినే స్పష్ట పరుస్తుంది. బ్రాహ్మణోపనిషత్ – ప్రాణం బ్రహ్మా అని తెలియపరుస్తుంది. కనుక జీవికి గమ్యము, స్థితి బ్రహ్మమే. చివరకు చేరవలసినది తన స్వస్థానమే బ్రహ్మలోనే. అన్ని జీవాత్మలు పరమాత్మలో లీనము కావలసినదే. అదే శాశ్వత గమ్యము గతి. అది అందరికీ గమ్యము కాబట్టి అది సుగతి అవుతుంది. నదీనాం సాగరో గతిః – అన్ని నదులు అనగా మురుగు కాలువలతో సహా చేరవలసినది సముద్రమే. సముద్రానికి అది పుణ్యనది అని కాని మురుగు కాలువలు అనే విచక్షణ లేదు. జీవులు అనగా చెట్టు చేమలతో సహా పీల్చుకునే వాయువు విశ్వవాయువు నుండే వదిలే వాయువు దానిలోనూ ఈ విశ్వవాయువు సర్వత్రా వ్యాపించి సర్వవ్యాప్తమైనది. దీనికి ప్రాణవాయువు అని కాని బొగ్గుపులుసు వాయువు అని కాని స్థితి తేడా లేదు. అట్లాగే సర్వవ్యాప్తమైన పరమాత్మ అమ్మ ప్రకటించినట్లుగా తన నుండే జీవులను ఉద్భవింపచేసి తనలోనే లయింప చేసుకుంటుంది. అదే సుగతి. దానికి స్థితి తారతమ్యాలు లేవు. కనుక అదే అందరికీ సుగతి అన్నది అమ్మ. అందరికీ సుగతి కాస్త అటూ ఇటుగా అని అనుటలో వారిని చేర్చుకుండే గమ్యమములో తరుణము తేడా తప్ప ఇంకేమీ

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!