1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అంబకన్న అధికులెవరు లోకమందున ?

అంబకన్న అధికులెవరు లోకమందున ?

Poojyasri Ganapathi sachidananda
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : September
Issue Number : 2
Year : 2022

(భజనపాట)

పల్లవి:

అంబకన్న అధికులెవరు లోక మందున?

అరసి చూడ అంబ యొకతె ఉన్న దెందున!! చరణం:

 

శిలల తెచ్చి ఉలుల మలచి అమ్మ యందునా?

వెన్నవంటి మనసు మాట తలప కుందునా!!

తలపకుందునా!! తలపకుందునా!!

 

వెలుగులీను దీపశిఖల అమ్మ యందునా

వెల్లివిరియు చల్లదనము వదలు కొందునా!

వదలు కొందునా! వదలు కొందునా!

 

అంతులేని నింగి చూచి అమ్మ యందునా

లేనిదాని కున్నదనము నిచ్చు కొందునా!

ఇచ్చు కొందువా ఇచ్చు కొందునా!

 

మంత్ర తతుల నాదగతుల నమ్మ యందునా

అమ్మలోని శాశ్వతత్త్వ మెన్న కుందునా!

ఎన్న కుందునా! ఎన్న కుందునా!

 

మంచుకొండ ముద్దుపట్టి అమ్మ యందునా

ఆమె అఖిలమాత యనుట

 పలుక కుందునా! ద! పలుక కుందునా!

 

శివుని మేన అర్ధ భాగ మమ్మ యందునా

నిత్య పూర్ణశక్తి నిట్లు చీల్చు కొందునా!

చీల్చు కొందునా! చీల్చు కొందునా!

నేను – నీవు- వాడులన్ని అమ్మ యందునా

సచ్చిదానంద దివ్యపదము నూత గొందునా!

ఊత గొందునా! ఊత గొందునా!

(అంతర్జాల సౌజన్యంతో)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!