వారొక
ఆధ్యాత్మిక చింతనా తత్పరులు
జిల్లెళ్ళమూడి కవితా విరించి
పరిపాలనా దక్షతకు నిలువెత్తు రూపం
వినూత్న కార్యక్రమాల సృష్టి కర్త
తన కలంలో
అమ్మ జీవన ఔన్నత్యాన్ని
సిరాగా పోసి ఓ నవీన కావ్యంగా
రూపొందించిన గొప్ప రచయిత.
. తన గాత్రంలో
అమ్మ ప్రేమామృతాన్ని త్రాగి
నలుగురికి వచన రూపంలో పంచి
అమ్మ హృదయాన్ని
ఆవిష్కరించిన ఆనంద బ్రహ్మ.
వేష భాషలో జీవన శైలిలో
వారొక మార్గదర్శకులు.
అమ్మ గురించి ఎవరైనా మాట్లాడితే
మురిసిపోయే తల్లి మనసు వారిది.
అమ్మ గూర్చి వారు మాట్లాడితే
వారి గొంతు పలకదు
వారి మనసే పలుకుతుంది.
స్నేహ శీలి, సౌజన్య నిధి
అమ్మ ఆశయాల ఆచరణ పుత్రులు
పూజ్యులు
ఆంజనేయ ప్రసాద్ అన్నయ్య గారికి
అక్షర నీరాజనం.